Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రెండేళ్లలో డజను పెళ్లిళ్లు అట… ఆమె నిందితురాలా..? బాధితురాలా..?

June 25, 2025 by M S R

.

ఓ వార్త ఆంధ్రజ్యోతిలో చూశాను… ఒక మహిళ రెండేళ్లలో డజను పెళ్లిళ్లు చేసుకున్నదని… నిన్నటి వార్త అది… ఏపీలో అమలాపురం ప్రాంతంలో… ఆమె పేరు బేతి వీర దుర్గ నీలిమ… ముగ్గురితో కలిసి ముఠాగా ఏర్పడి రెండేళ్లలో నిత్య పెళ్లికూతురుగా 12 పెళ్లిళ్లు చేసుకుందనేది వార్త సారాంశం…

అంతేకాదు, పలువురు బాధితులు జిల్లా పోలీసు కార్యాలయం ఎదుట ధర్నా చేసి, ఫిర్యాదు కూడా చేశారట… పెళ్లి కాని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ధనవంతులను టాార్గెట్ చేసుకుని… భార్యలకు దూరంగా ఉండే భర్తలను పరిచయం చేసుకుని, సన్నిహితంగా ఉంటూ పెళ్లి వరకూ కథ నడిపించి, తరువాత కాపురానికి పోకుండా కేసులు పెడతామని బెదిరించి… లక్షలు కాజేసేది అట…

Ads

మొత్తం కోట్లల్లో దోచుకుందని రాసుకొచ్చింది వార్త… మిగతా పత్రికలు ఏం రాశాయో తెలియదు గానీ… ఆంధ్రజ్యోతి వార్త తరువాత సోషల్ మీడియాలో, యూట్యూబ్ చానెళ్లలో ఇక ఎలా పడితే అలా రప్పా రప్పా రాసిపడేశారు…

aj

అసలు ఇది సాధ్యమా..? అఫ్‌కోర్స్, ఇలాంటి వార్తలు అప్పుడప్పుడూ చదువుతున్నవే… పెళ్లిళ్లు చేసుకుంటూ డబ్బు కాజేసి పారిపోయే కేసుల గురించి… కానీ మరీ రెండేళ్లలో 12 పెళ్లిళ్లు… అదీ మన తెలుగు సమాజంలో సాధ్యమేనా అనే డౌట్ వెంటనే వస్తుంది వార్త చదవగానే…

ఎన్నెన్నో ఎంక్వయిరీలు చేశాక గానీ ఆడపిల్లకు వోకే చెప్పని కుటుంబాలు మనవి… ఆమె చదువు, కుటుంబం, బంధుగణం దగ్గర నుంచి అనేక విషయాలు విచారించి గానీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు… అలాంటిది జస్ట్, రెండు నెలలకు ఓ పెళ్లి, అదీ వరులను మభ్యపెట్టి ఎలా సాధ్యం..?

ఒకవేళ ఇదే నిజమైతే… వీళ్ల ప్లానింగుకు మెచ్చి ఏదైనా పోలీస్ సీక్రెట్ సర్వీసులో కొలువులు ఇవ్వాలి… కానీ తెల్లవారే మరో వార్త, అదే ఆంధ్రజ్యోతిలో…

aj crime

డజను పెళ్లిళ్లు అనే ప్రచారం తప్పు అని నేరుగా ఆమే చెబుతోంది… పాత పెళ్లాంతో విడాకులు తీసుకున్నానని అబద్దాలు చెప్పి ఓ పాస్టర్ తనను పెళ్లి చేసుకున్నాడట.., పిల్లలు కూడా ఉన్నారట… ఇప్పుడేమో నామీద 12 పెళ్లిళ్ల నిత్య పెళ్లి కూతురు అని కొత్త కథలు క్రియేట్ చేసి బదనాం చేస్తున్నారంటోంది… ఆ 11 మంది బాధితులు ఎవరో నిరూపించాలని సవాల్ చేస్తోంది…

మరి జరిగిందేమిటి..? పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎవరనో రాజేశ్వరితో ఈ నీలిమకు ఏవో గొడవలు, పరస్పరం కేసులు పెట్టుకున్నారు, కోర్టులో విచారణలో ఉన్నాయి… ఈలోపు ఇదుగో పోలీస్ కార్యాలయం ఎదుట ధర్నాలు, ఫిర్యాదులు, అసత్య ప్రచారాలు… అంతే, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా జస్ట్, అలా రాసేసింది…

పోలీసుల వివరణ అడిగితే… అసలు కథ, నిజమైన బాధితురాలు ఎవరో చెప్పే కథ తెలిసేది… జస్ట్, ఫిర్యాదు, ధర్నా ఆధారంగా ఓ కథ రాసేశారు… ఇప్పుడు సీఐ వెంకటనారాయణ చెబుతున్నాడు… 12 పెళ్లిళ్ల ఆధారాలు ఏమీ లేవని…! అంటే మొదటి రోజు ఎవరో ఏదో ఫిర్యాదు చేయగానే… ఆమె ఓ ముఠా అనీ, డబ్బున్నవాళ్లకు ఎరవేసి, సన్నిహితంగా ఉండి, పెళ్లి చేసుకుని దోచుకునేదని రకరకాల ముద్రలు వేసేసింది మీడియా… కేరక్టర్ అసాసినేషన్… సో, ఈ కేసులో అసలు నిందితులు ఎవరు..? బాధితులు ఎవరు..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎమర్జెన్సీ రాజ్యాంగబద్ధమే.., అప్పట్లో తప్పలేదుట, తప్పూ కాదుట…
  • రెండేళ్లలో డజను పెళ్లిళ్లు అట… ఆమె నిందితురాలా..? బాధితురాలా..?
  • ఉన్నతాధికారుల పోస్టింగులపై రేవంత్ సర్కారు తెలివైన అడుగులు
  • నిజంగానే ఉత్తరాది రాష్ట్రాలు ఎడాపెడా పిల్లల్ని కనేస్తున్నాయా..?!
  • విజయ్‌కన్నా ఉదయనిధే బెటరట… అవునూ, ఈ లెక్కల తిరకాసులేమిటో…
  • “కాళిదాసు తమిళ్షుడు అవాలనుకుని కణ్ణదాసన్ అయ్యాడు…”
  • హమ్మా… మా తెలుగు ఈగను పోలిన మలయాళ ఈగ క్రియేట్ చేస్తారా..?!
  • హమ్మో అమ్మాయిలా అనుకునే ఈ రోజుల్లో… ఈ టైటిల్, ఈ కథ విశేషమే…
  • నాణ్యతకూ, నమ్మకానికి పేరు హెరిటేజ్… కానీ ఎందుకో ‘పగిలిపోతోంది…’
  • తన పిచ్చి ఆరాధకుడు వర్మకు శ్రీదేవి లీగల్ నోటీస్ ఎందుకిచ్చింది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions