Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అక్షయ్, శరత్‌కుమార్, మోహన్‌లాల్ ఫెయిల్… విష్ణు, ప్రభాస్ పాస్…

June 30, 2025 by M S R

.

ఓ చిన్న తిన్నడి కథను సినిమా కోసం పెద్దది చేసి, నాస్తికత్వాన్ని చేర్చి, ఆస్తికుడిగా మారే (అన్నమయ్య, వేమనలోలాగే) క్రమాన్ని ఓ కంట్రాస్టుగా చూపి… మొత్తానికి అప్పట్లో బాపు ఏవో తిప్పలు పడ్డాడు…

కాకపోతే వాణిశ్రీ ఆ ప్రయోగఫలితం నెగెటివ్‌గా ఉండకుండా నిలబెట్టింది… సరే, అదొక సక్సెస్‌ఫుల్ సినిమాటిక్ ఎక్స‌పరిమెంట్… ఇన్నేళ్ల తరువాత ఇంకేం కొత్తగా చెప్పాలి అనుకుని మంచు విష్ణు దాన్ని మరింత విస్తరించి, అయిదు తెగల వాయులింగ పోరాటంగా మలిచాడు…

Ads

సరే, బాహుబలి, కల్కి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ లెవల్ అనుకున్నాడు… వోన్లీ తెలుగు అయితే సరిపోదు అనుకుని, పాన్ ఇండియా అంటే అన్ని భాషల నటులు ఉండాలనుకుని శరత్‌కుమార్, మోహన్‌లాల్, అక్షయకుమార్ తదితరులను ప్రవేశపెట్టాడు… అయితే.,.?

kannappa

ఆ ధోరణీ సరికాదు, ఆ భావనా సరికాదు… తమిళం, హిందీ, మలయాళం తారలు ఉండగానే ఆ భాషల జనం ఏమీ విరగబడరు, ఇది తప్పుడు అంచనా… కేజీఎఫ్, కాంతార, ఆర్ఆర్ఆర్, బాహుబలి, పుష్ప సినిమాల్లో ఆ ధోరణి లేదు, అచ్చంగా మన సౌత్ సినిమాలే… కానీ హిందీ సహా అందరూ ఆదరించారు…

kannappa

ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… నో డౌట్… విష్ణు బాగా యాక్ట్ చేశాడు, గుడ్… తమ ఫ్యామిలీ మీద సర్వత్రా నెలకొన్న నెగెటివిటీని దాటి కాస్త పాజిటివ్ టాక్ వచ్చింది… ప్రభాస్ గనుక లేకపోతే సినిమాకు ఆ జోస్, ఆ హైప్, ఆ బజ్ వచ్చేది కాదు… ప్రభాస్ నిజంగానే సినిమాను కాస్త నిలబెట్టాడు… తనే హీరో అయి ఉంటే ఆ రేంజ్ వేరే ఉండేది…

kannappa

2 రోజుల్లో 23 కోట్లు వచ్చాయి… అస్సలు సరిపోదు… సండే దాటాక ఏమేరకు నిలబెడుతుందో చూడాలి… కానీ రెండో రోజుకే వసూళ్లలో తగ్గుదల ఉంది… వీక్ డేస్‌ అంటేనే వీక్… ఇక చూడాలి… కానీ తన ఖర్చు తిరిగి వస్తుందనేదీ డౌటే అనిపిస్తోంది… ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కూడా గట్టెక్కిస్తాయో లేదో అనుమానమే… ఈ అంచనా ఎందుకంటే..?

kannappa

తెలుగులో తప్ప వేరే ఏ భాషలోనూ వసూళ్లు ప్చ్… మరీ కన్నడంలో 15 లక్షలు మాత్రమే… ఐనా కన్నడిగులు వాళ్ల భాష సినిమాలు తప్ప ఇంకేమీ చూడటం లేదు… కుబేర ఎట్సెట్రా సినిమాల వసూళ్లు చూశాం కదా… సేమ్, తమిళులు… ధనుష్ ఉన్నా సరే కుబేరను లైట్ తీసుకున్నారు, దాన్ని నిలబెట్టింది తెలుగు ప్రేక్షకులు మాత్రమే…

kannappa

అంతటి మోహన్‌లాల్ ఉన్నా సరే మలయాళం వసూళ్లు జస్ట్, 35 లక్షలు… అక్షయకుమారుడూ అంతే… 1.45 కోట్లు… అదీ వీక్ డేస్‌లో సస్టెయిన్ అవుతుందానేది డౌటే… తమిళంలోనూ జస్ట్, 35 లక్షలే… భక్తి సినిమా అయినా సరే, ప్రీతి ముకుందన్‌కు అడ్డగోలుగా కురచ దుస్తులు వేసి, ఆరబోతకు దిగినా ప్రయోజనం లేదోయీ మంచు కన్నప్పా…

kannappa

ఫైట్లు, రొమాన్స్ మన్నూమశానం కలిపినా సరే… సినిమా పికప్ లేదు పెద్దగా… విష్ణుకు అతి పెద్ద నిరాశ… అన్నింటికీ మించి ఇండియన్ ఫిలిమ్ సర్కిళ్లకు పెద్ద గుణపాఠం… ఆయా భాషల నుంచి నలుగురిని ప్రవేశపెట్టినంతమాత్రాన అది భారీతనం కాదు… అది ప్రేక్షకులను ఆకర్షించదు… అది పాన్ ఇండియా సూత్రం అసలే కాదు… విష్ణుకు సమజైంది కావచ్చు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 
  • అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?
  • ‘రా’ కొత్త చీఫ్‌గా ఆపరేషన్ సిందూర్ మాస్టర్ మైండ్..!!
  • చిరంజీవే హీరో అయినాసరే… మాధవి పాత్రదే అల్టిమేట్ డామినేషన్…
  • ప్రధానిపై క్షుద్ర పూజల ప్రయోగం… విరుగుడుగా ప్రత్యేక పూజలు…
  • బీఆర్ఎస్ పంథాలో ఏమిటీ మార్పు… KCR ఉద్యమ ధోరణికి వ్యతిరేకం…
  • అక్షయ్, శరత్‌కుమార్, మోహన్‌లాల్ ఫెయిల్… విష్ణు, ప్రభాస్ పాస్…
  • సంపూర్ణంగా ఈ కామాఖ్య ఆదిశక్తిపీఠం తరహాయే వేరు… Part-2 …

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions