.
బ్లాక్ బస్టర్ బోనాలు అని జీతెలుగులో ఓ ప్రోగ్రామ్ చేశారట, ప్రోమో కనిపించింది… ఒక్కోచోట ఒక్కో తేదీలో బోనాలు చేస్తార్రా నాయనా..? బోనాలు ఫలానా తేదీన చేయాలనేమీ ఉండదు… తెలంగాణ కల్చర్ గురించి జీతెలుగు వంటి చానెళ్లకు ఏం తెలుసులే గానీ…
బోనాలు అని పేరు పెట్టి, ఎప్పటిలాగే తమకు అలవాటైనట్టు నలుగురు సెలబ్రిటీ, చానెల్ ఆస్థాన నటీనటులను పిలిచి ఏదో ఫన్ షో క్రియేట్ చేస్తుంటారు కదా… ఇదీ అంతే… కాకపోతే ఈసారి జగద్ధాత్రి సీరియల్ నటి దీప్తి మన్నె స్పెషల్‌గా కనిపించింది… మామూలుగా టీవీ స్పెషల్ షోలలో కనిపించదు ఆమె…
Ads
మిగతా వాళ్లంతా రెగ్యులర్ కళాకారులే… కాకపోతే ఈసారి రోజా, శ్రీకాంత్ గెస్టులు… అన్నట్టు చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే… రోజా ఈటీవీకి గాకుండా జీతెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం, స్పెషల్ షోలు కూడా జీవాడికే చేయడం…
పార్టీ ఓడిపోయాక, ఇక మళ్లీ ఆమె టీవీల్లోకి వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేసిందే… తనను గెలిపించింది జబర్దస్త షో అనే పిచ్చి భ్రమల్లో ఉంటుంది కదా… కాకపోతే ఈసారి నో ఈటీవీ… ఏమనిపిస్తుందీ అంటే… గతంలో వేరు, తమ ప్రత్యర్థి పార్టీ నాగబాబును పక్కన కూర్చోబెట్టుకునీ షో చేసింది… జగన్‌కు ఏమాత్రం పడని ఈటీవీకి వర్క్ చేసింది…
కానీ అప్పుడు వేరు… కానీ కొన్నేళ్లుగా ఏపీలో పార్టీ వైరాలు, కులవైరాలు దారుణమైన స్థితికి చేరుకున్నాయి… మరీ ప్రత్యేకించి కమ్మ వర్సెస్ రెడ్డి ఘర్షణ ప్రతి రంగంలోనూ కనిపిస్తోంది… ఎటుచూసినా కులం లెక్కలే… ఈ స్థితిలో ఈటీవీలో షోలు చేయడం తనకు నష్టదాయకమని రోజా భావిస్తున్నదేమో…
పదే పదే జగన్ తనకు ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 ప్రధాన ప్రత్యర్థులు అంటున్నాడు కదా… ఇంకా ఇంకా ఈటీవీతో అంటకాగడం ఇబ్బందికరం అనే సోయి ఎట్‌లాస్ట్ వచ్చినట్టుంది… ఈటీవీ ఆర్ మల్లెమాల వైపు కూడా చూడటం లేదు…
జీతెలుగులో డ్రామా జూనియర్ చేస్తోంది… జడ్జి మాత్రమే కాదు, స్కిట్లలో కూడా పార్టిసిపేట్ చేస్తూ షోను రక్తికట్టిస్తోంది… సరే, ఆమె సీనియారిటీకి ఇదేం పెద్ద విషయం కాదు, కానీ మళ్లీ బిజీ అయిపోయింది టీవీ తెర కార్యక్రమాల్లో…
ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి… ఇదే డ్రామా జూనియర్స్ హోస్ట్ చేసేది సుడిగాలి సుధీర్… డెఫినిట్‌గా షోకు తను ప్లస్ పాయింట్… ఐతే ఈటీవీలో కూడా ఫ్యామిలీ స్టార్స్ షో హోస్ట్ చేస్తాడు,… (ఆహా ఓటీటీలో సర్కార్ కూడా చేస్తున్నాడు…) రోజాలాగే సుడిగాలి సుధీర్ కూడా… తను ఈటీవీ షో చేస్తాడు గానీ మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీకి మాత్రం నో చెబుతున్నాడు…
ఫ్యామిలీ స్టార్స్ షో బహుశా జ్ఞాపిక వాళ్లది కావచ్చు… ఒకసారి మల్లెమాల కంపెనీ వెళ్లగొట్టాక సుడిగాలి సుధీర్ ఇక వాళ్ల మొహం చూడటం లేదు, ఆ టెంపర్‌మెంట్ అవసరమేనేమో గానీ, వాళ్లు కూడా సుధీర్ పట్ల అదే విముఖతను చూపిస్తున్నారు…
సరే, ఇవన్నీ ఎలా ఉన్నా… ఈటీవీ ఫ్యామిలీ స్టార్స్‌కు పెద్ద రేటింగ్స్ లేవు, కానీ జీతెలుగు డ్రామా జూనియర్స్‌కు మాత్రం మంచి రేటింగ్స్ వస్తున్నాయి… జీతెలుగు టాప్ 30 ప్రోగ్రామ్స్‌లో ఉంటుంది… ఈ కోెణంలో చూస్తే మాత్రం రోజా నిర్ణయం కరెక్టే అనిపిస్తుంది… జగన్‌కు నచ్చని ఆ ఈటీవీ జోలికి పోవడం దేనికి..? జీతెలుగుతో కథ నడిపిస్తే పోలా అనుకున్నట్టుంది…!! అసలే ఈనాడుకూ జగన్‌కూ నడుమ అగ్గి మండుతోంది… చివరగా… ఎందుకోగానీ యాంకర్ రవి హోస్టింగ్ ఏమాత్రం బాగుండటం లేదు ఎందుకో గానీ..,!!
Share this Article