Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

KCR ఆ మాట అనకపోయినా రాసి ఉంటే మాత్రం ఆంధ్రజ్యోతి తప్పే !!

August 11, 2026 by M S R

.

‘‘నా పాడె మోస్తాడనుకున్నా..’’ ఈ వాక్యం ఇప్పుడు ఆంధ్రజ్యోతికీ బీఆర్ఎస్ క్యాంపుకీ నడుమ మంట పెట్టింది… నేపథ్యం ఏమిటంటే..? మరణించిన ఉద్యమనేత, బీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి కేసీయార్ వెళ్లాడు… తను ఫామ్ హౌజు దాటి బయటికి వచ్చి, ఓ సంతాప కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్లడమే విశేషం…

ఐతే అక్కడ తను కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నప్పుడు… సుదర్శన్‌రెడ్డి నా ధైర్యం, తనే నా పాడె మోస్తాడనుకున్నా, కానీ దురదృష్టం, తననే కోల్పోయాం అన్నాడని ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీలో రాసుకొచ్చింది నిన్న… నిన్నటి నుంచే బీఆర్ఎస్ క్యాంపు ఆ వార్త మీద నిప్పులురుముతోంది… కేసీయార్ అనని మాటల్ని రాయడం దుర్మార్గం, అది రాధాకృష్ణ చావు భాష అని విమర్శలు…

Ads

అంతేకాదు, గతంలో ఆంధ్రజ్యోతి ఏమేం రాసింది అంటూ ప్రత్యేక కథనాలు నమస్తే తెలంగాణ… బహుశా నేను అనని మాటల్ని అలా ఎందుకు రాశారనేదే కేసీయార్ కోపం అయి ఉండవచ్చు, దాన్నే నమస్తే రాస్తుంది కదా… ఎస్, ఒకవేళ తను అలా అనకపోతే- అలా రాయడం ఖచ్చితంగా ఆంద్రజ్యోతి తప్పే… తప్పున్నర…

కొన్ని ఎమోషనల్, సెన్సిటివ్ ఇష్యూస్‌లో పాత్రికేయ స్వేచ్ఛ ఎంత ప్రమాదకరమో చెప్పడానికి ఇది నిదర్శనం… పరామర్శ దగ్గర కేసీయార్ పెద్దగా ఏమీ మాట్లాడలేదనీ, పెద్ది తల్లి దగ్గర మాత్రం, అమ్మా, మీకు నేనున్నా అని ధైర్యం చెప్పినట్టు సమాచారం… మరి ఈ ‘పాడె మోసుడు’ వ్యాఖ్య ఎక్కడి నుంచి వచ్చింది..?

ఆంధ్రజ్యోతికి ఎలా సారీలు, ఖండనలు అలవాటు ఉండవు కాబట్టి, దాన్నుంచి వివరణ ఆశించలేం… ఆ సంస్కారం వేరు! (అఫ్‌కోర్స్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే, సాక్షి అన్నీ అదే కోవ)… ఐతే డెస్క్ కావచ్చు, బ్యూరో కావచ్చు, స్వేచ్ఛ తీసుకుని ఆ వాక్యం గనుక రాసి ఉంటే… వాళ్ల తప్పును రాధాకృష్ణకు అట్రిబ్యూట్ చేయవచ్చా..? ఇదీ ఓ ప్రశ్న… కాకపోతే తన పత్రికలో ప్రచురితమైన ప్రతి పదానికీ, ప్రతి అక్షరానికీ తనే నైతికంగా, అధికారికంగా బాధ్యుడు..!!

నిజానికి తనకన్నా చిన్న వయస్సులో ఉన్న తమ సన్నిహితులు, బంధువులు మరణిస్తే… వయస్సులో పెద్దవాళ్లు పరామర్శకు వెళ్లినప్పుడు… ‘అయ్యో, నాకన్నా చిన్నోడు, నా పాడె మోస్తాడనుకుంటే నాకన్నా ముందే పోయిండు, దురదృష్టం’ అనడం పరిపాటే… నిజంగా కేసీయార్ ఆ మాట అక్కడ వాడి ఉన్నా తప్పు లేదు, పైగా అది ఆత్మీయ పరామర్శ… తను వయస్సులో పెద్ద, తను పరిణతిలో కూడా పెద్ద…

ఐతే ఎటొచ్చీ… తను ఆ మాట అనకపోయినా దాన్ని పబ్లిష్ చేస్తే మాత్రం అది తప్పు… తప్పే..!! ఐతే ఇది ఉద్దేశపూర్వకంగా ఆంధ్రజ్యోతి కేసీయార్ చావు కోరడం అవుతుందా..? ఇది సంక్లిష్టమైన ప్రశ్న..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • KCR ఆ మాట అనకపోయినా రాసి ఉంటే మాత్రం ఆంధ్రజ్యోతి తప్పే !!
  • ఒకప్పటి కుర్రకారు ‘ధడకన్’… అండర్ వరల్డ్ దెబ్బకు అజ్ఞాతవాసం!
  • Nalsar ! న్యాయ విద్యార్థుల అసాధారణ లేఖను ఇలా అర్థం చేసుకోవాలి..!!
  • సర్కారు చేసింది మహా వరుణ యాగం కాదా..? కరీరి ఇష్టి క్రతువా ?
  • దర్శకేంద్రుడు ఎవరు..? సేమ్ టు సేమ్.. రియల్ ఎవరో గెస్ చేయండి !
  • Safed Sagar ! ఈ ‘శ్వేత సముద్రానికి’ సర్వత్రా సలాం ! ఎందుకంటే..?
  • ఈమె ఆమేనా ! నాటి మహానటి నేడు ఓ సహాయనటికన్నా తక్కువ !!
  • TG Mohan Das … ఇలాంటోళ్లే నిజమైన ‘సంఘ్’ వ్యతిరేకులు !
  • భోజనమే ఆయుధమా? ‘దురంధర్’ తరహాలో ఉగ్రనేత మృతి..!!
  • తెహెల్కా తేజ్‌పాల్‌ కేసు చెప్పే పెద్ద న్యాయ పాఠం ఏమిటంటే..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions