.
I’am Game అని దుల్కర్ సల్మాన్ ఓ సినిమా చేస్తున్నాడు… కయదు లోహర్ హీరోెయిన్… ఈ సినిమాకు దుల్కర్ నిర్మాత కూడా..! ఇది స్పోర్ట్స్ యాక్షన్ మూవీ… హీరోగా, నిర్మాతగా దుల్కర్ హిట్ బాటలో ఉన్నాడు చాన్నాళ్లుగా… మలయాళంలో ప్రముఖ దర్శకుడు హిదాయత్ దీనికి దర్శకత్వం…
అన్నీ బాగానే ఉన్నాయి కదా… ఇందులో దుల్కర్, కయదుతో పాటు ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, సంయుక్త విశ్వనాథన్, కథిర్, వినయ్ ఫోర్ట్, పార్థ తివారీ తదితరులు నటిస్తున్నట్టు వికీలో, ఐఎండీబీలో కనిపిస్తోంది… దాదాపు 100 లొకేషన్లలో చిత్రీకరణ జరిగిందట…
Ads
అంతా బాగానే ఉంది… ఎవరే నువ్వే అనే లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు, ఎవరో సనారె గీత రచయిత అట… జేక్స్ బెజోయ్ సంగీత దర్శకత్వం… వచ్చే 20న సినిమా విడుదల, తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేస్తున్నారు… ఇదీ నేపథ్యం…
ఆ పాట వీడియో చూస్తుంటే ఒకటీరెండుచోట్ల జయసుధ మొహం కనిపించింది… 67 సంవత్సరాలు, ఎంత మేకప్ వేసినా ముడతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి… సరే, సహజం… బహుశా హీరో తల్లి పాత్ర అయి ఉంటుంది… జయసుధ ఇందులో నటిస్తున్నట్టు వికీలో గానీ, ఐఎండీబీలో గానీ ఆమె పేరే లేదు… అంటే, అంత అనామక పాత్ర…

కనీసం సినిమా తారాగణం జాబితాలో పేరు కూడా కనిపించనంత అనామక పాత్ర అనేసరికి ఆశ్చర్యం… ప్లస్ జాలి కూడా! అప్పుడెప్పుడో 1972లో ఎంట్రీ ఇస్తే, 54 ఏళ్లు సుదీర్ఘ నటనా జీవితం ఆమెది… ఆమె ఐదారు భాషల్లో సినిమాలు చేసినా తెలుగులోనే ఓ స్టార్ ఆమె… ఎన్ని వైవిధ్యమైన పాత్రలు, ఎంతటి ఘనమైన రికార్డులు… సావిత్రి, వాణిశ్రీ తరువాత అంతగా ప్రాచుర్యం ఆమెది… మహానటి… సహజనటి… షీరో !
ఎందరో మహానటుల సరసన మెప్పించి, కొన్నిసార్లు వాళ్లనూ డామినేట్ చేసి, నిజంగా ఆమెది టాలీవుడ్‌లో ఓ శకం… అలాంటి జయసుధ ఓ అనామక పాత్రలో..!! అదీ మలయాళంలో ఆమె చివరి సినిమా చేసి పాతికేళ్లు, మళ్లీ ఇప్పుడు..!
ఆమె రాజకీయ జీవితం, ఆమె కుటుంబ జీవితం పక్కన పెడితే… ఆమె అభిమానులకు అనిపించేది ఏమిటంటే..? ఒక వాణిశ్రీలాగా పూర్తిగా రిటైర్డ్ జీవితం గడపొచ్చు కదా, ఇలాంటి అనామక పాత్రలు చేసే బదులు..!! ఈ వయస్సులో కూడా అడపాదడపా ఒకటీ అరా సినిమాలు చేయడం విశేషమే, కానీ కాస్తో కూస్తో ప్రాధాన్యమున్న పాత్రలు చేయొచ్చు కదా… ఇలాంటి రెండుమూడు సీన్ల పాత్రలతో తన ఘన నటచరిత్రకు తనే మసిపూస్తోంది..!!
Share this Article