.
సుడిగాలి సుధీర్ ఆహా ఓటీటీలో హోస్ట్ చేసే సర్కార్ షో తెలుసు కదా… కాస్త పాపులర్ షోయే… ఈసారి రెండు ఎపిసోడ్ల ప్రోమోలు కలిపి ఒకే ప్రోమోగా రిలీజ్ చేసినట్టున్నారు… డబుల్ పంచ్…
ష్, నిజం చెప్పాలంటే, ఆ ఒరిజినల్ షోకన్నా ప్రోమోలే ఆసక్తికరంగా ఉంటాయి సుమీ… ఈసారి ప్రోమోలో ఆసక్తికరంగా అనిపించిన వాటిల్లో… 1) ఎన్ఎం నీహారిక ఎంట్రీ… ఈమె తెలుసు కదా ఫేమస్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్… సూపర్ ఫ్లో ఉంటుంది ఇంగ్లిషులో… (కొణిదెల నీహారిక వేరు, ఈ ఎన్ఎం నీహారిక వేరు)…
Ads
మల్టీ టాలెంటెడ్… ఇప్పుడు సినిమాల మీదకు దృష్టి మళ్లినట్టుంది… బిగ్ మౌత్ అనే టీవీ సీరీస్ చేసింది… తరువాత ఇదయం మురళి చేసింది… వెంటనే పెరుసు… ఇది తెలుగులోకి కూడా వచ్చింది… ఇప్పుడు మిత్రమండలి సినిమా చేస్తోంది, ప్రియదర్శి హీరో…
ప్రమోషన్లలో భాగంగా టీవీ షోలకు రావాలి కదా… ఫస్ట్ సుమ అడ్డాకు వచ్చింది టీమ్… ఇప్పుడు ఆహా సర్కారు షోకు వచ్చారు… అంతకుముందు ఆమె వీడియోలు చూస్తుంటే ఈమె తెలుగమ్మాయే, అప్పుడప్పుడూ అందుకే ఫ్లోలో తెలుగు పదాలు దొర్లేవి అనిపించేది…
ఇంతకీ మీది బాంబేనా లేదా బెంగుళూరా అనడిగాడు సుధీర్… ఆమె విజయవాడ అని చెప్పింది… నిజమో కాదో, అక్కడ సరదాకు అలా చెప్పిందో గానీ తెలుగు ఫ్లూయెంట్‌గానే మాట్లాడుతుంది… సినిమాల మీదే బాగా కాన్సంట్రేట్ చేయాలని ఫిక్సయినట్టుంది… ఆల్ ది బెస్ట్ నీహారికా…
2) ఇదే ప్రోమోలో కొణిదెల నీహారిక కూడా కనిపించింది… ప్లస్ బడబడా వాగుడుకాయ దీపిక రంగరాజు కూడా… ప్లస్ ప్రదీప్… 3) తెలుగులో నంబర్ వన్ మేల్ టీవీ హోస్ట్… తను సుధీర్ హోస్టింగులో ఓ కంటెస్టెంటుగా రావడమే కాదు, ఇదే షోకు మొదటి మూణ్నాలుగు సీజన్లకు తనే హోస్ట్… ఇప్పుడు కేరక్టర్స్ ఛేంజ్… తను కంటెస్టెంట్… ఇంట్రస్టింగ్… (సినిమాలు ఇక తనకు పనికిరావని ఫిక్సయిపోయి, సుధీర్‌లాగే ఇక టీవీ షోల మీద కాన్సంట్రేట్ చేస్తున్నాడు…)
4) మరో కేరక్టర్ పేరు కావ్య… తెలుసు కదా, పాపులర్ తెలుగు టీవీ ఆర్టిస్టు… బిగ్‌బాస్ లాస్ట్ సీజన్ విన్నర్ నిఖిల్ లవ్ ఎపిసోడ్‌కు సంబంధించి ఏడాదిగా కావ్య పేరు పదే పదే వార్తల్లో నలుగుతోంది… కొన్నాళ్లు లివ్‌ఇన్ రిలేషన్ షిప్‌లో ఉన్నట్టున్నారు, తరువాత లవ్ బ్రేకప్… 5) నవదీప్ కూడా ఉన్నాడు…
సర్కారు షోలో అసలు ఆసక్తికరమే హోస్టింగ్, వచ్చే సెలబ్రిటీ కంటెస్టెంట్లతో సరదా ఆట… మంచి యాక్టివ్ పార్టిసిపెంట్లు వస్తే షో రక్తికడుతుంది… ఇద్దరు తెలుగు నీహారికలు, దీపిక, ప్రదీప్ ఎట్సెట్రా వస్తుంటే ఇంకేం…!?
Share this Article