.
స్టార్ మాటీవీలో వచ్చే కుకూ జాతిరత్నాలు రియాలిటీ షోకు రేటింగ్స్ బాగుంటున్నాయి… ఒకవైపు రియాలిటీ షోలకు పేరొందిన ఈటీవీ షోలు నానాటికీ తీసికట్టు అయిపోతుంటే… ఈ స్టార్ మా రియాలిటీ షో ఎందుకు పాపులర్ అయ్యిందబ్బా అనుకుని ఓ ఫుల్ ఎపిసోడ్ చూడబడింది నాతో…
ఎందుకంటే..? స్టార్ మాటీవీలో బిగ్‌బాస్ తప్ప వేరే రియాలిటీ షోలు పెద్దగా క్లిక్ కావడం లేదు… బిగ్‌బాస్ కూడా కొన్ని సీజన్లుగా దాని ఖర్చుకు సరిపడా రెవిన్యూ సంపాదించడం లేదు, పేలవంగా మార్చేశారు… జీ తెలుగులో సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తూ… రోజా, అనిల్ రావిపూడి జడ్జిలుగా ఉన్న డ్రామా జూనియర్స్ పర్లేదు, బాగుంటుంది…
Ads
మరి ఈ కుకూ జాతిరత్నాలు స్పెషాలిటీ ఏమిటబ్బా అని చూస్తే, బాగుంది… సగటు ఈటీవీ షోలలో కనిపించే బూతులు, వెగటు వేషాలు, డబుల్ మీనింగులు, ప్రత్యేకించి హైపర్ ఆది మార్క్ డవిలాగులు ఏమీ లేకపోవడం పెద్ద రిలీఫ్… శ్రీముఖి హైపిచ్ అరుపుల్లేకపోవడం మరింత పెద్ద రిలీఫ్…
చాన్నాళ్ల తరువాత ప్రదీప్ మళ్లీ టీవీ తెరపై కనిపిస్తున్నాడు… తను ఈ షోకు ఓ ప్లస్ పాయింట్ ఖచ్చితంగా… ప్రస్తుతం ప్రదీప్, సుడిగాలి సుధీర్ వీరిద్దరే టాప్ మేల్ హోస్టులు… జడ్జిలుగా ఉన్న తుమ్మ సంజయ్, నటి రాధ బాగానే ఇన్వాల్వ్ అవుతూ, సమయానుకూలంగా పంచులు వేస్తూ షో రక్తికట్టుస్తున్నారు తమకు చేతనైనంతలో…
ఆశిష్ విద్యార్థిని తప్పించి ఆలీని తీసుకొచ్చారు ఎందుకో… కారణం ఏమిటో గానీ, ఆలీ పెద్ద యాక్టివ్‌గా అనిపించలేదు… రాబోయే షోలో తనతోపాటు తన భార్య జుబేదా కూడా రానుంది… ఈసారి మరీ నాలుగే జంటలతో షో కాస్త కళతప్పింది గానీ… రెగ్యులర్‌గా అయిదారు జంటలతో షో చేస్తున్నారు…
కంటెస్టెంట్లను మారుస్తున్నారు… అంతా స్క్రిప్టెడ్, పేరుకే అది కుకరీ షో… షో ఉద్దేశం జస్ట్, వినోదమే… కంటెస్టెంట్లందరూ బాగా ఇన్వాల్వ్ అవుతూ షో పట్ల ఆసక్తిని పెంచుతున్నారు… నిన్నటి షోలో ఇమ్ము, యాదనరాజు, బాబా భాస్కర్, సుహాసిని, తనూజ, హరి, రీతూ, vj సన్నీ (అరుణ్ అభిమన్యు..?) గోమతి కనిపించారు…
అందరూ సరదాగా ఒకరి మీద ఒకరు పంచులు, స్పాంటేనియస్ జోకులు వేసుకుంటూ షోను పడిస్తున్నారు… రాబోయే షో ప్రోమోలో శోభా శెట్టి, ప్రభాకర్ తదితరులతోపాటు ఈ షోను స్పాన్సర్ చేస్తున్న నీలోఫర్ బాస్ బాబురావును కూడా తీసుకొచ్చినట్టున్నారు…
పూర్తి కుకరీ షోలు తెలుగు టీవీల్లో పెద్దగా క్లిక్ కాలేదు ఎప్పుడూ… ఆహా ఓటీటీలో కూడా ఆమధ్య నీహారికతో చేసిన కుకరీ షోకు ఫన్ యాడ్ చేశారు, ఐనా పెద్దగా ఆదరణ రాలేదు… కానీ కుకరీకన్నా ఫన్‌కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన ఈ కుకూ జాతిరత్నాలు మాత్రం మంచి రేటింగ్సే సాధిస్తోంది…!
Share this Article