.
సీరియస్ వార్త కాదులెండి… టీవీ, సినిమా ఇండస్ట్రీలో చాలాా వింతలు, అసహజ తంతులు జరుగుతూ ఉంటాయి కదా… ముందుగా ఆ వార్త చదవండి…
పెళ్లి కాకుండానే ప్రియుడితో కలిసి ‘వరలక్ష్మి వ్రతం’… న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టి, సినిమా స్టార్‌గా మారింది సిరి హనుమంతు…
Ads
విశాఖపట్నంలో పుట్టింది… తొలుత న్యూస్ ప్రజెంటర్ … తర్వాత ‘ఎవరే నువ్వు మోహిని’, ‘సావిత్రమ్మగారి అబ్బాయి’ వంటి సీరియల్స్‌తో బుల్లితెరపై సందడి చేసింది… బిగ్ బాస్ షో ఆమెకు ఫేమ్ తెచ్చినా కొంత నెగెటివిటీ కూడా వచ్చింది… ఎవరో తోటి కంటెస్టెంటుతో (షన్నూ..?) రెచ్చిపోయింది… నటనే కావచ్చుగాక… వ్యతిరేకత మూటగట్టుకుంది…
ఐనాసరే, అది ఆమెను ఆపలేదు..! ‘ఇద్దరి లోకం ఒకటే’, ‘నరసింహపురం’, ‘బూట్ కట్ బాలరాజు’ వంటి సినిమాలతో పాటు షారుఖ్ ఖాన్ ‘జవాన్’లో క్యామియో రోల్‌తో మెరిసింది… ‘పులి మేక’ వెబ్ సిరీస్‌తో మరింత పాపులర్ అయ్యింది..! వైజాగ్‌లో ఏదో క్లినిక్ తెరిచింది… తెలివైంది… కానీ, జబర్దస్త్‌లో కొన్నాళ్లు యాంకర్‌గా తీసుకుని ఎందుకో తరిమేశారు, కారణాలు తెలియవు…
సరే, తను శ్రీహాన్‌తో రిలేషన్ షిప్పులో ఉంది… పెళ్లి తంతు లేదు గానీ పెళ్లయినట్టే కలిసే ఉంటున్నారు… శ్రీహాన్ కూడా బిగ్‌బాస్ షోకు వెళ్లినట్టున్నాడు… తనూ టీవీ, యూట్యూబ్ సెలబ్రిటీయే… ఆమె హిందూ, తను ముస్లిం అనుకుంటాను… నిశ్చితార్థం కూడా అయినట్టు ఫోటోలు కనిపిస్తున్నాయి…
వీరిద్దరూ ఓ బాబును దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు… విషయం ఏమిటంటే..? ఈ ఇద్దరూ కలిసి వరలక్ష్మి వ్రతం చేశారు…. సిరి చీరలో, శ్రీహాన్ పంచెలో ఫోటోలు వైరల్..! పెళ్లే కాలేదు, వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారహో అని కామెంట్లు…
ఓ పెద్దమనిషిని అడిగితే ఇలా చెప్పాడు… ‘‘అసలు వాళ్లకు పెళ్లే కాలేదు… ఆమె అసలు ఇప్పటికి గృహిణే కాదు… కలిసి జీవిస్తున్నంతమాత్రాన భార్యాభర్తలు అనలేం… ఏదో ఓ సంప్రదాయంలో పెళ్లిబంధంలో ఉండాలి కదా… అది జస్ట్, సహజీవనం… సంప్రదాయ వివాహబంధంలో లేరు… ఆ వ్రతం చేసేదే పిల్లల కోసం, మాంగల్య దీర్ఘకాల రక్షణ కోసం… అసలు మాంగల్యమే లేదు కదా ఇక్కడ…
నేను గృహిణినే, నేనూ వరలక్ష్మివ్రతం చేస్తాను అంటూ పూజ చేయించుకుని, ఫోటోల్ని సోషల్ మీడియాలో వైరల్ చేసుకున్నంతమాత్రాన ఫలితమేమీ సిద్దించదు.., సంప్రదాయం ఈ తంతును అంగీకరించదు… కాకపోతే ఆమె ఆశించిన ప్రచారవ్రతం వరకూ వోకే… కానీ అది ప్రసాద వ్రతం మాత్రం కాదు, అంటే ఫలితం సిద్ధించని వ్రతం… ఏదో బొమ్మలపెళ్లి తరహా అనుకోవచ్చు…’’ అన్నాడు…
ఏమోలెండి… కనీసం నిష్టగా పూజలో కూర్చున్నట్టు ఫోటోలు దిగారు కదా అంటారా..? అవును, జస్ట్, ఫోటోలు దిగారు… ఆశించిన ప్రచార ఫలితం సిద్ధించినట్టే… మరి అమ్మవారి కరుణ అంటారా..? ఏమో మరి… అమ్మవారి దయ, వాళ్ల ప్రాప్తం..!! అవునూ, ఆమె వరలక్ష్మివ్రతం తంతును అవమానించినట్టా..? గౌరవించినట్టా..?
Share this Article