.
Sree'nivas Bibireddy
…. దొంగ ఓట్లు అని మహారాష్ట్రలో అబద్ధపు ప్రచారం చేసిన సంజయ్ కుమార్ ఇతనే… తన అబద్దపు మాటలు వినే రాహుల్ గాంధీ ఎగురుతూ…. రేప్పొద్దున దేశవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతున్నది…
తనకి మొన్న అర్ణవ్ గడ్డి పెట్టి, ఎన్నికల సంఘం నోటీసులు పంపించగానే, అంతా తూచ్, నేను చెప్పింది అంతా తప్పు, నేను పొరపాటు చేసాను, క్షమించండి అని అంటున్నాడు …
Ads
రాహుల్ గాంధీ తన మెడలో ఉన్న గండం, సంజయ్ కుమార్ మెడలో వేయడానికి చాలా ప్రయత్నించాడు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఆ గండంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది…
రాహుల్ గాంధీ కోసం అబద్ధపు కథనాన్ని సృష్టించడానికి CSDS చీఫ్ సంజయ్ కుమార్ తనను తాను నాశనం చేసుకున్నారు. దశాబ్దాల నుండి సంపాదించిన పేరు మీద ఆయనే గొడ్డలి వేటు వేసుకుని, తనతో పాటు తన బృందం భవిష్యత్తును కూడా నాశనం చేసుకున్నాడు…
క్షమాపణలు చెప్పిన తర్వాత, ఇప్పుడు ఆయన తన కింద పనిచేసేవారిపై నేరం మోపడానికి ప్రయత్నిస్తున్నారు. సంజయ్ స్వతహాగా కాంగ్రెస్ భావజాలం ఉన్నవాడు. ఈ అబద్ధపు పనిలో కాంగ్రెస్‌కు సహాయం చేయడానికి ప్రయత్నించి పీకల్లోతూ కష్టాల్లో ఇరుక్కున్నాడు…
ఇప్పుడు రాహుల్ గాంధీతో పాటు ఆయన అనుచరులైన పవన్ ఖేడా, సుప్రియా శ్రీనేత్ ముఖాల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది… ఈ అబద్ధపు గణాంకాలను బీహార్ కోసం ఎవరు తయారు చేసి రాహుల్ గాంధీకి ఇచ్చారని ఎన్నికల కమిషన్ విచారిస్తోంది…
తనను పావుగా వాడుకుని, రాహుల్, కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇండియా కూటమిని ఈ అబద్ధపు కథనంలో ఇరికించాయి… ఇతనిపై రెండు ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు అయ్యాయి… చట్ట పరిధిలో శిక్షించాల్సిందే… దేశం కోసం…
Share this Article