Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒకే మూవీ టైటిల్… ముగ్గురు తెలుగు హీరోలు (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)…

August 27, 2025 by Rishi

.

ఈ జయం మనదే ఆ జయం మనదే కాదు . ఇది కృష్ణది , అది యన్టీఆరుది , 1956 లో వచ్చింది . వెంకటేష్ జయం మనదేరా కూడా ఉంది .

ఈ కృష్ణ జయం మనదే 1986 ఏప్రిల్లో ఉగాది కానుకగా వచ్చింది . 100% వినోదాత్మక చిత్రం . గ్రామీణ నేపధ్యంలో తీయబడిన మరో ఊరికి మొనగాడు సినిమా .

Ads

ఓ చెరుకు పండించే ప్రాంతంలోని గ్రామంలో పిన్నమనేని బోస్ బాబు అనే యువకుడు పట్నంలో చదువుకుని పల్లెటూరి మీద మమకారంతో వ్యవసాయంలో సెటిల్ అవుతాడు.

మరి ఫార్ములా మేరకు హీరో ఉన్నప్పుడు విలన్లు , హీరోయిన్లు ఉండాలి కదా ! ఉన్నారు . ఆ విలన్లు తన తండ్రిని చంపి తల్లిని జైలుకు పంపుతారు . హీరోయిన్ తండ్రిని కూడా చంపుతారు . ఈ వాస్తవాలను తెలుసుకున్న హీరో దుష్టశిక్షణ చేయడంతో శుభం కార్డు పడుతుంది .

రొటీన్ కృష్ణ మార్క్ సినిమా . ఆయన స్టార్డంకు అనుగుణంగా పరుచూరి బ్రదర్స్ నేసిన కధ . మాటలు పదునుగానే ఉంటాయి . ముఖ్యంగా కోర్ట్ సన్నివేశాలలో బాగుంటాయి . అదీ పిన్నమనేని దెబ్బంటే వంటి డైలాగుల్ని కూడా పెట్టారు బ్రదర్స్ . పాపం ఆ జడ్జి గారు కూడా సిబిఐ విచారణకు ఆదేశం ఇస్తారు . అప్పట్లో కాస్త గౌరవం ఉండేది కదా !

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో ఆత్రేయ , వేటూరి వారి పాత్రలు శ్రావ్యంగా ఉన్నా బయట అంతగా హిట్ కాలేదు . దర్శకుడు కె బాపయ్య పాటల్ని బాగానే చిత్రీకరించారు . కృష్ణ , శ్రీదేవి డ్యూయెట్లు గోవులాంటి దాన్నిరా , ఏ చీరె కట్టుకోను , రాణివాసాల ఈ రామచిలకా బాగుంటాయి . గ్రామీణ నేపధ్యం అనగానే ఓ బృంద నృత్యం కూడా ఉంటుంది కదా ! ఒకరికి ఒకరు తోడుగా ఉంటే ఓటమి లేదండి అంటూ జయం మనదే ఐకానిక్ సాంగ్ సాగుతుంది .

కృష్ణ నటన ఎనర్జిటిగ్గా , శ్రీదేవి నటన ముద్దుముద్దుగా ఉంటుంది . ఇద్దరూ బాగా నటించారు . వీరిద్దరి తర్వాత అన్నపూర్ణదే తదుపరి తాంబూలం . పవర్ఫుల్ పాత్ర . రావు గోపాలరావు , అల్లు రామలింగయ్య కాంబినేషన్ షరా మామూలే . Made for each other . గిరిబాబు , చలపతిరావు , ఆనందమోహన్ హీరో చేతిలో తన్నులు తింటూనే ఉంటారు .

ప్రేక్షకులు గుర్తుంచుకునే టిపికల్ పాత్ర సత్యనారాయణది . ఇలాంటోళ్ళు పల్లెల్లో ఉంటారు . పనీపాటా లేకుండా దారిన వచ్చేపోయే ప్రతీ వారిని కెలికి , అప్పుడప్పుడు చివాట్లు కూడా భుజిస్తూ ఉంటారు . చెరపకురా చెడేవు పాత్ర కూడా ఇది . గాలి పోగేసి ఆ గాలిని జనం లోకి వదిలే ఈ సోమరిపోతు చివరకు తన స్వంత కూతురికే నష్టం చేయబోతాడు . సత్యనారాయణ బాగా పండించాడు ఆ పాత్రను .

ఇతర పాత్రల్లో రంగనాధ్ , కాంచన , సారధి , జయశీల , ప్రభాకరరెడ్డి , పి యల్ నారాయణ , మాడా , నర్రా , కాకినాడ శ్యామల , డబ్బింగ్ జానకి , ప్రభృతులు నటించారు . It’s an entertainer . చూడబులే . కృష్ణ అభిమానులు , శ్రీదేవి సౌందర్యాభిమానులు తప్పక చూడవచ్చు .

#సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నారా రోహిత్ జాబితాలో మరొకటి, అంతే… సుందరకాండ రివ్యూ…
  • రిస్కీ షాట్… అన్ని సీన్లూ అంత వీజీ కాదు… (దేవీప్రసాద్)
  • మోస్సాద్ వదిలేసిన ఏకైక టార్గెట్… ఎవరు అతను.. !? ( రమణ కొంటికెర్ల )
  • పెంకులు పగిలినా, ఇంటివాడు తిడితే అదొక ఆనందం..! (నగునూరి శేఖర్)
  • ఒకే మూవీ టైటిల్… ముగ్గురు తెలుగు హీరోలు (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)…
  • అప్పట్లో గుడ్ బాయ్… మా బాలయ్య మంచి స్టోరీస్..! (Dogiparthi Subramanyam)
  • ర్యాప్ అస్త్రంగా ఓ యువతి చైతన్య పోరాటం..! (రమణ కొంటికర్ల)..
  • టీపీసీసీ..! బండి సంజయ్ మీద అసందర్భ వ్యాఖ్యలతో పార్టీకే నష్టం..!!
  • ‘‘ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజీకి వస్తా… నాకు ధైర్యం ఉంది…’’
  • సీన్ ఛేంజ్..! నాడు ఎంట్రీపై నిరసన… నేడు సీఎం హోదాలో ఘన స్వాగతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions