Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భారీ బ్యానర్ ఐనంతమాత్రాన … సినిమా ఆడాలనేముంది..?

September 16, 2025 by M S R

.

Subramanyam Dogiparthi .... మరో జస్టిస్ చక్రవర్తి సినిమా . ఆ సినిమాలో నేరం నుంచి విముక్తి కలిగినా చేసిన నేరానికి కోర్ట్ హాల్లో కుప్పకూలిపోతారు . ఈ బ్రహ్మరుద్రులు సినిమాలో నేరం చేసి పోలీసులకు లొంగిపోతారు . లొంగిపోవటంతో సినిమా ముగుస్తుంది . అశ్వినీదత్ నిర్మాతగా కె మురళీమోహన్ రావు దర్శకత్వంలో 1986 నవంబర్లో వచ్చింది ఈ సినిమా .

న్యాయ పరిరక్షణలో స్వంత బావకే ఉరిశిక్షను విధించే జడ్జిగా , చెల్లెలు చేత శాపనార్థాలు తినే అన్నగా , క్లైమాక్సులో తన చెల్లెలికి , తన మేనల్లుడుకి అన్యాయం చేసిన విలనాసురులను కొందరిని మట్టుబెట్టి , మరి కొందరిని పోలీసులకు అప్పచెపుతారు అక్కినేని మేనల్లుడు వెంకటేషుతో కలిసి . జస్టిస్ జగదీష్ చంద్ర ప్రసాదుగా అక్కినేని నటన చాలా బాగుంటుంది . ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండే .

Ads

ఆయన భార్యగా లక్ష్మి మధ్య వయసులో కూడా చాలా అందంగా కనిపిస్తుంది . ఆమెకూ ఇలాంటి పాత్రలు ఎడం చేత్తో చేసేవే . వెంకటేష్ కొత్త నటుడు అనే భావన ప్రేక్షకులకు అసలు కలగనివ్వడు . తప్పక మెచ్చుకోవాల్సిందే .‌

సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవలసింది పరుచూరి గోపాలకృష్ణ పాత్ర , అతని నటన . కధను , డైలాగులను సమకూర్చటమే కాకుండా విలనుగా బ్రహ్మాండంగా నటించారు . పండిపోయిన రాజకీయుడిగా డైలాగ్ డెలివరీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది .

  • ఇద్దరు హీరోయిన్లు . ఒకరు రజని , మరొకరు రంజని .‌ రజని ఈ సినిమా టైంకు అనుభవజ్ఞురాలు అయిపోయింది . గ్లామర్ డాల్ కూడా అయిపోయింది . రంజని సింగపూర్ నటి . తమిళ , కన్నడ , మళయాళ భాషల్లో నటించింది . తెలుగులో ఇదే మొదటి సినిమా . నిజ జీవితంలో సామాజిక , పర్యావరణ ఉద్యమకారిణి . సెలబ్రిటీ కూడా .

పరుచూరి గోపాలకృష్ణ సహ విలన్లుగా నూతన్ ప్రసాద్ , ప్రభాకరరెడ్డి , బెనర్జీ , రాజ్ వర్మ నటించారు . నూతన్ ప్రసాద్ డైలాగ్ డెలివరీ , నటనలు కూడా ప్రత్యేకంగా మలిచారు . ఇతర పాత్రల్లో సంయుక్త , సుమిత్ర , రాళ్ళపల్లి , రాంజీ , సూర్య , తదితరులు నటించారు . అందాల మందాకిని ఐటెం డాన్సరుగా తళుక్కుమంటుంది .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు థియేటర్లో బాగుంటాయి . బయట పెద్దగా హిట్ అయినట్లు లేదు . బుగ్గ గిల్లుకో , కోక చెదిరిపోతే డ్యూయెట్లు బాగుంటాయి . తాయిలాలో తాయిలాలో గ్రూప్ డాన్స్ చిత్రీకరణ చాలా బాగుంటుంది .

ఓ జాబిలీ అంటూ సాగే అక్కినేని , లక్ష్మిల పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది . సినిమాకు ఐకానిక్ సాంగ్ ఓ ధర్మదేవతా ఓ న్యాయదేవతా . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మలు పాడారు . పాటలన్నీ వేటూరే వ్రాసారు . ఇన్ని విశేషాలున్నా సరే సినిమా పెద్దగా ఆడినట్టు లేదు… జనానికి పెద్దగా నచ్చలేదు…

సినిమా యూట్యూబులో ఉంది . అక్కినేని , వెంకటేష్ అభిమానులు ఇంతకుముందు చూసి ఉండకపోతే చూడవచ్చు .  It’s an action , emotional , sentimental , Paruchuri-mark movie . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గుప్త దానం ‘బహిరంగ’ ప్రచారమైందెలా? ఫోటోలు, వీడియోల వెనుక అసలు కథ!
  • ఇక ఇండియాపై చైనా- పాక్ జాయింట్ ఉపగ్రహ నిఘా!!
  • Miss & Mrs Universe… ఏడేళ్ల కూతురికి తల్లి… ఈసారి విశ్వసుందరి!
  • 26/11 ముంబై ఉగ్రవాద దాడి… ఇది మరో కుట్రకోణం !!
  • ఈ హీరోలతో ఇక పనేంటి బాసూ..! కొత్త ‘హీరో’లు వచ్చేస్తున్నారు !!
  • ఊగే మోదుగు పూలూ, త్యాగమూ… సారంగపాణీ… దాశరథి కృష్ణమాచార్యా…
  • కొత్త ట్విస్ట్! సుప్రీంకు జోసెఫ్ విజయ్ సర్కారు తప్పుడు నివేదిక?
  • ముసలోడే గానీ… మహా కర్కోటకుడు! ఓ భారీ రాక్షస ముఠా బద్దలు !!
  • పాప స్కూల్లో చేరితే బ్రేకింగ్ న్యూసా..? సెలబ్రిటీ ఆరాధనలో ‘అతి’…!
  • ఆకాశంలో ఒక తార… ఇది మన పాలకొల్లు జాహ్నవి కథేనా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions