.
ఆమె భర్త ఇంద్రారెడ్డి జనంలో బతికిన మనిషి… నరేంద్రలు, విజయశాంతిలు, కేసీయార్లకన్నా ఎంతోముందు తెలంగాణను స్వప్నించి, అప్పట్లోనే ఓ పార్టీ పెట్టి ఉద్యమించిన నాయకుడు… జనం మెచ్చిన మనిషి… మాజీ హోం మంత్రి… భర్త అడుగుజాడల్లో నడిచిన ఆమె కూడా మాజీ హోం మంత్రి… పార్టీలూ గీర్టీలూ ఏవయితేనేం..? పోలీసు వాతావరణం బాగా తెలిసిన మనిషి…
రాజకీయ విమర్శల్ని కూడా బ్యాలెన్స్‌డ్‌గా చేసే నాయకురాలు… హఠాత్తుగా ఆమె కూడా ఇలా మారిపోయిందేమిటి అనే ఆశ్చర్యం కలిగింది నిన్నటి ఆమె విమర్శలు చూసి..! ఏదో ఫ్రస్ట్రేషన్‌లో హరీష్‌రావు, కేటీయార్ కూడా మరీ ఓ జగదీష్‌రెడ్డిలా ఏవేవో పొంతన లేని కువిమర్శలు చేస్తున్నారు అనుకుంటుంటే… ఈమె కూడా అదే బాటలోనా..?
Ads
అదీ కాస్త వెటకారం ధ్వనించే నవ్వుతో… ‘‘కేసీయార్ ఇచ్చిన నోటిఫికేషన్ల బాపతు ఉద్యోగాల నియామకపత్రాలను ఇచ్చీ ఇచ్చీ అదే అలవాటుతో రేవంత్ రెడ్డి డీజీపీకి కూడా ఓ నియామకపత్రం ఇచ్చాడు… చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రచారం కోసం ఏ డీజీపికి ఇలా ఇచ్చి ఉండడు… పెద్ద జోక్ ఇది… ఆయేన ఇస్తే ఇచ్చిండు, డీజీపీ ఎట్ల తీసుకున్నడు ఆ నియామకపత్రాన్ని..? అన్నింటా అదే నటన, దగా, మోసం’’ అని చెప్పుకొచ్చింది…
1) ఒక హోం మంత్రిగా పనిచేసిన, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆమె స్థాయికి ఈ విమర్శలు తగినవేనా… ప్రచారం కోసం ఏదో ఓ విమర్శ చేయాలని ఇలా బ్యాలెన్స్ తప్పడం దేనికి…
2) పార్టీ ఈ విమర్శ చేయాలని చెప్పిందో, ఆమే స్పాంటేనియస్‌గా విమర్శించిందో గానీ … పోలీస్ అధికారుల్లో ఇప్పటిదాకా ఆమె పట్ల ఉన్న గౌరవభావనను చేజేతులా ఆమే చెడగొట్టుకోవడం దేనికి..?
3) ఒక ముఖ్యమంత్రి ఒక పోలీస్ ఉన్నతాధికారిని డీజీపీ పోస్టులోకి ప్రమోట్ చేస్తూ… ఒక అభినందనగా, ఒక విశ్వాస సూచనగా సాదరంగా, తనే స్వయంగా సదరు నియామకపు పత్రాన్ని ఇస్తే అందులో ప్రచార యావ ఏమున్నట్టు..? నెగెటివ్‌గా చూడటం ఎందుకు..?
4) కేసీయార్ కొలువుల భర్తీకి, ఈ నియామక పత్రం ఇవ్వడానికీ లింకేమిటసలు..? ఇందులో జోక్ ఏముంది..? పైగా ఒక ముఖ్యమంత్రి తనను ప్రమోట్ చేస్తూ,, స్వయంగా ఓ ఉత్తర్వు చేతికిస్తానూ అంటే కొత్త డీజీపీ దాన్ని తిరస్కరించాలా..? ఇదేం విమర్శ..?
5) ఇందులో నటన, మోసం, దగా ఏమున్నట్టు..? తన భర్త పొలిటికల్ ప్రొఫైల్, ఆమె ప్రొఫైల్ ఏమిటి..? మరీ ఏమిటీ విమర్శలు… అందుకే సబితమ్మా… నీ వ్యక్తిత్వం ఎక్కడ..? నీ అస్థిత్వం ఎక్కడ..?
Share this Article