.
పదే పదే చెప్పుకుంటున్నదే…. తెలుగు ఫిలిమ్ జర్నలిజం రోజురోజుకూ పాతాళంలోకి దిగజారిపోతున్న దురవస్థ గురించి…
కానీ ఓ నిర్మాత, ఓ దర్శకుడు ఏం చేయగలడు ఫాఫం… సిండికేట్… బహిష్కరిస్తే ప్రచారం రాదు… ఆ సోకాల్డ్ జర్నలిస్టులు అనబడే పర్వర్టెడ్ కేరక్టర్ల తిక్క ప్రశ్నలకు జవాబులు చెప్పలేరు…
Ads
ఎస్, హైదరాబాదులో ఇండస్ట్రీకి పెద్ద శాపం తెలుగు జర్నలిజమే… మంచు లక్ష్మి మీద పిచ్చి కూతలు కూసిన ది గ్రేట్ ముసలి జర్నలిస్టు ఒకరు సిగ్గుపడి, తలవంచి చివరకు లెంపలేసుకుని… అమ్మా, నాది తప్పే, క్షమించు అని వేడుకున్నాడు… అఫ్‌కోర్స్, తనను నియమించుకున్న ఆ వెబ్ ప్లాట్ ఫారమేదో సిగ్గుపడాలి… సారీ టు సే…
ఇది కొత్త కాదు, ఇక్కడ ఆగేదీ కాదు… నాసిరకం… వేణుస్వామి ఎవరి మీదొో జోస్యం పెడితే ఈ సోకాల్డ్ తాత జర్నలిస్టు కూడా వెళ్లి వుమెన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు… అసలు ఆ అసోసియేషన్‌కు ఏమైనా బాధ్యతో మరొకటో ఉన్నాయా..? అందరూ టీవీ5 బాపతు జర్నలిస్టులేనా ఫాఫం…
(సోకాల్డ్ జగన్ క్యాంపు సైట్ వేణుస్వామికి ఎందుకు వ్యతిరేకంగా మారినట్టు..? ఆ టీడీపీ సిండికేట్ జర్నలిస్టును ఎందుకు మోస్తున్నట్టు..? నీకంటూ ఓ పొలిటికల్ లైన్ లేదా..? టీవీ5 పొలిటికల్ లైన్‌లోనే పడి కొట్టుకుపోతావా..?)
ఇప్పుడు ఏకంగా ఓ మహిళా జర్నలిస్టు అట… (ఇవ్వాళారేపు అందరూ జర్నలిస్టులే కదా పాపం, జర్నలిస్టును అని చెప్పుకునేవాడి నిజ జర్నలిస్టుల దురవస్థ ఇది)… హీరో మేటీరియలేనా అనడుగుతోంది ఓ వీడియోలో…
హీరో మెటీరియల్ అంటే ఏమిటి తల్లీ…. సిక్స్ ప్యాక్, వారసత్వం, వంశచరిత్ర, బ్లడ్డు అండ్ బ్రీడు ఇవేనా..? అడగడానికి ఏమైనా ఉందా అసలు..? ఓ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడానికి కలర్, క్యాస్ట్, ఫ్యామిలీ, బాడీ చూడాలా..? ఆకాశం నుంచి ఊడిపడతాడా..? ఇంకా ఏ లోకంలో ఉన్నారు ఈ జర్నలిస్టులు…? (నటుడు ప్రదీప్ రంగనాథ్ గురించే కావచ్చు..)
హీరోయిన్ మెటీరియల్ అంటే… కలర్, ఆరబోత, కమిట్మెంట్లు… అంతేనా… వాడెవడో దరిద్రపు నిర్మాత చెప్పినట్టు మంచి సైజులు… అంతేనా..? నటనలు మన్నూమశానం అంతా ఉత్తదే, హంబగ్, నాన్సెన్స్ అన్నట్టేనా..?
అందరూ ఆ ముసలి జర్నలిస్టు బాటేనా..? సోకాల్డ్ విఖ్యాత, ప్రముఖ, ప్రఖ్యాత మహిళా జర్నలిస్టు ఎవరి గురించి, ఏ సినిమా గురించి కామెంటిందో అప్రస్తుతం… జర్నలిస్టుల మైండ్ సెట్ చూస్తూ తెలుగు, సారీ, హైదరాబాదుకు వచ్చే ప్రతి సినిమా బాధ్యుడూ వణికిపోతున్నాడు… సిండికేట్ యవ్వారం…
కొందరు పీఆర్వోలు, మిగతా జర్నలిస్టుల కూటమిని తలుచుకుంటేనే నిర్మాతలకు తడిసిపోతున్నాయి.., అందుకే అనిల్ రావిపూడి వంటి దర్శకులు ఎహెపోరా అనేసుకుని తనదైన మార్కెటింగ్ పద్ధతుల్లో వెళ్లిపోతున్నారు… ఎస్, ఈ జర్నలిస్టులకు మంచు లక్ష్మే పర్‌ఫెక్ట్… నువ్వు గ్రేటమ్మా… నీ ముందు మోకాళ్లతో వంగిపోయిన, తలవంచిన, లెంపలేసుకున్న జర్నలిస్టులను చూపించావు జనానికి..!!
Share this Article