.
కేటీయార్… కవితక్క తగ్గేదేలా… నువ్వేనా కేసీయార్ వారసుడివి..? ఏం మగ వారసత్వమేనా..? ఆడ వారసత్వం పనికి రాదా ఈ దేశంలో..?
ఠాట్, వీల్లేదు… మహిళల రిజర్వేషన్ల గురించి కొట్లాడిన కవితక్క అస్సలు ఊరుకోదు… రాజకీయ వారసత్వంలో కూడా మహిళలకూ సమాన హక్కులు ఇవ్వాల్సిందే… నో, ఇవ్వకూడదు, అంటే మీ బీఆర్ఎస్ రాజ్యాంగం మార్చుకొండి… ప్రజలకు చెప్పండి, మాది మగవారస పార్టీ మాత్రమే అని… హమ్మా…
Ads
‘‘చూస్తుండు, ఈ తరమే కాదు, భవిష్యత్తు తరానికీ నీకు పోటీ ఆల్రెడీ తయారు చేస్తున్నా… నా మేనల్లుడు, నీ కొడుకు హిమాంశును మీరు ఎలాగూ మూడోతరం వారసుడిగా ప్రవేశపెడతారుగా… నేనూ తగ్గేది లేదు…
ఇదుగో, నా కొడుకు ఆదిత్యరావు… కేసీయార్ నెత్తుటి వారసుడే… హిమాంశా..? ఆదిత్యా..? ప్రజలు చెబుతారు..! చిన్నప్పుడే హిమాంశు సచివాలయంలో చక్కర్లు, పలు ఆకస్మిక తనిఖీలు, కేడర్‌కు భరోసాలు గట్రా చూశారుగా… ఇక నా కొడుకును కూడా ప్రవేశపెడుతున్నా.., బహుపరాక్…
చూసుకుందాం, నీ పెతాపమో నా పెతాపమో…
https://www.facebook.com/reel/619699127890583
చూశావా..? బీసీ రిజర్వేషన్ల మీద బజారుకొచ్చేశాడు మావోడు… సరే, వాడికి ఇప్పుడు పెద్దగా లోకం ఏమీ తెలియదు, ఏం మాట్లాడుతున్నాడో వాడికే అర్థం కాదు… నేర్చుకుంటాడులే, నేర్పిస్తానులే… రాజకీయం నూరిపోస్తా… నూరీ నూరీ ఓ కత్తిలా మారుస్తాను… ఊరుకోను…
పేరు కూడా మారుస్తాను, కల్వకుంట్ల ఆదిత్య చంద్రశేఖర్ రావు అని… అప్పుడే ప్లకార్డు పట్టుకుని, బజారులో కూర్చున్నాడు… ఇక చూసుకో రాబోయే కాలంలో… ఢీ అంటే ఢీ… నో హిమాంశు, జై ఆదిత్యా…
హరీష్ రావు, సంతోష్ రావు పిల్లల్నీ ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారేమో, నో, నెవ్వర్… నేను అంగీకరించను… అవసరమైతే ఎలాగూ కేసీయార్ బొమ్మ, పేరు తీసేసి… జయశంకర్ బొమ్మతో జిల్లాలకు వెళ్తున్నాను కదా… ఈ విషయమూ జనంలోకి తీసుకుపోతాను… అంతే… హమ్మా…!!
Share this Article