Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాముడు తనే- సీత తనే..! మాటల్లేవ్… టాకీసులోనేే లైవ్ బీజీఎం..!!

November 7, 2026 by M S R

.

(  రమణ కొంటికర్ల  )… ఇప్పుడంతా రామాయణమే. రామాయణం ఎలా ఉంది అనేది చూడనివాళ్లల్లో ఉన్న క్యూరియాసిటీ. చూసినవాళ్లల్లో చాలామంది బానే ఉందంటూ చెబుతున్న మౌత్ టౌక్. మరోవైపు, రామాయణం కాదు రావణాయణమంటూ ఇంకో చర్చ. మరోవైపు, ఘాటు విమర్శలు.. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పైనా డిబేట్ చూస్తున్నాం.

ఏదేమైనా, భారతీయ ఇతిహాసాల్లో రామాయణానికున్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. వాల్మీకీ రామాయణం తర్వాత ప్రపంచవ్యాప్తంగా 300 వరకూ రామాయణంపై విభిన్న కోణాల్లో రచనలు వెలువడ్డట్టు ఓ సమాచారం. అయితే, ఇదే సమయంలో పురాణేతిహాసమైన రామాయణ కథను విభిన్న రకాలుగా తెరపైకెక్కించడమూ చూస్తూనే ఉన్నాం.

Ads

తెలుగులో సంపూర్ణ రామాయణం, సీతారామ కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం, రామాంజనేయ యుద్ధం, లవకుశ, బాల రామాయణం, శ్రీరామ రాజ్యం వరకూ ఇలా ఎన్నో మనం చూసినవీ, విన్నవే. ఇక హిందీలో ఇలాంటి పౌరాణిక సినిమాలు అంతగా కనిపించకపోయినా… రామానందసాగర్ దర్శకత్వంలో వచ్చిన రామాయణం సీరియల్ ఇప్పటికీ మాట్లాడుకునే ఓ సంచలనం.

కానీ, ఆ మధ్య విడుదలైన డిజాస్టర్ ఆదిపురుష్ తో ఉత్తరాది వాళ్లు తీసే రామాయణాలపై కొంత అపనమ్మకం ఏర్పడింది. ఈ సమయంలో నితేష్ తివారీ దర్శకత్వంలో వచ్చిన రామాయణం మీద విభిన్న రకాల చర్చలు చూస్తున్నాం. కానీ, మొత్తానికి విజువల్ ఫీస్ట్ గా ఇప్పుడీ రామాయణం ఒక పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంటోంది. సరే ఈ రామాయణాలన్నీ పక్కనబెడితే.. అసలు మొట్టమొదటి రామాయణం వెండితెరపైకి ఎప్పుడు ఎక్కిందో మీకు తెలుసా..? అయితే రండి తెలుసుకుందాం!

ramayana

109 ఏళ్ల క్రితమే వెండితెరపై రామాయణం! మాటలు లేవు.. పాటలు లేవు.. అయినా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన సినిమానే సరిగ్గా 109 ఏళ్ల క్రితం వచ్చిన రామాయణం…

ఇప్పుడు రామాయణం సినిమా అంటే భారీ సెట్లు, వేలాది మంది సాంకేతిక నిపుణులు, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, కోట్లాది రూపాయల బడ్జెట్. కానీ ఒక శతాబ్దం క్రితం పరిస్థితి పూర్తిగా భిన్నం. తెరపై పాత్రలు కనిపించేవి. కానీ మాటలు వినిపించేవి కావు. పాటలు, నేపథ్య సంగీతం కూడా రికార్డింగ్ రూపంలో ఉండేవి కాదు. అయినా ప్రేక్షకులను కట్టిపడేసే సినిమాలు వచ్చేవి. అలాంటి అరుదైన ప్రయోగమే 1917లో విడుదలైన లంకా దహన్!.

భారతీయ సినిమా చరిత్రలో రామాయణ ఘట్టాన్ని వెండితెరపైకి తీసుకొచ్చిన తొలి చిత్రాల్లో ఇదొకటి. ప్రముఖ దర్శకుడు, నిర్మాత దాదాసాహెబ్ ఫాల్కే ఈ మూకీ చిత్రాన్ని రూపొందించారు. హనుమంతుడు లంకలో సీతమ్మను వెతకడం, రావణుడి సైన్యానికి చిక్కడం, ఆయన తోకకు నిప్పంటించడంతో లంకా నగరాన్ని దహనం చేయడం వంటి సుందరకాండ ఘట్టాలే ఇందులో ప్రధానంగా కనిపిస్తాయి.

రాముడు, సీత వేషాలకు ఒక్కడే నటుడు! ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సిన ఆసక్తికరమైన విషయంలో ప్రధానమైంది నటీనటుల ఎంపిక. అప్పట్లో మహిళలు సినిమాల్లో నటించడం సాధారణంగా ఉండేది కాదు. దీంతో పురుషులే మహిళా పాత్రలు కూడా పోషించేవారు. అన్నా సాలుంకే అనే నటుడు లంకా దహన్ చిత్రంలో రాముడిగా, సీతమ్మగా రెండు పాత్రలూ పోషించడం మరో విశేషం. భారతీయ సినిమా చరిత్రలో ఒకే నటుడు రెండు ప్రధాన పాత్రలు పోషించిన తొలి ప్రయోగాల్లో ఒకటిగా కూడా ఈ లంకా దహన్ గుర్తింపు పొందింది.

మాటలు లేకపోయినా అలరించిన కథ! అప్పటి సినిమాలను మూకీ చిత్రాలు అనేవారు. అంటే తెరపై నటీనటుల సంభాషణలు వినిపించేవి కావు. వారి హావభావాలు, శరీర కదలికలు, దృశ్యాల ద్వారానే కథను అర్థం చేసుకోవాలి. అవసరమైన సందర్భాల్లో తెరపై వివరణాత్మక వాక్యాలు చూపించేవారు.

థియేటర్లలో ప్రత్యక్షంగా సంగీతకారులు వాయిద్యాలు వాయిస్తూ సినిమాకు నేపథ్య సంగీతం అందించేవారు. అలాంటి పరిమితుల మధ్య కూడా ఫాల్కే ప్రత్యేకమైన కెమెరా ప్రయోగాలతో.. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా హనుమంతుడి తోకకు నిప్పంటించడం, లంకాదహనం వంటి సన్నివేశాలు అప్పటి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చాయి.

థియేటర్లకు పోటెత్తిన ప్రేక్షకులు! సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లోనే లంకా దహన్ ప్రేక్షకుల ఆదరణ పొందింది. ముంబైలోని అప్పటి థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శనలకు భారీ స్పందన లభించింది. రాముడి పాత్ర తెరపై కనిపించినప్పుడు కొందరు ప్రేక్షకులు భక్తితో చెప్పులు విడిచి సినిమా చూసేవారట… దాదాసాహెబ్ ఫాల్కేకు భారతీయ సినిమా పితామహుడిగా గుర్తింపు రావడానికి ఆయన చేసిన ఇలాంటి ప్రయోగాలే పునాదయ్యాయి…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాముడు తనే- సీత తనే..! మాటల్లేవ్… టాకీసులోనేే లైవ్ బీజీఎం..!!
  • …. చివరకు మంత్రి ‘అక్షింతల’తో దత్తత వివాదానికి శుభం కార్డ్..!!
  • ఈ సీరియల్ కిల్లర్ ఓ క్రైమ్ రిపోర్టర్ – ఆ పత్రికకు ఎడిటర్- పబ్లిషర్…
  • ఈ ‘రామయణం’లో నాకు నచ్చిన నటుడు- వివేక్ విద్యుత్‌జిహ్వుడు!!
  • ఏం తక్కువైంది రెహమాన్ నీకు..? ఎందుకు ఈ సాకులు, ఈ శోకాలు..?
  • స్టార్ హీరోలకు దీటైన ‘మహాశక్తి’ … ఇలాంటి సినిమాలతోనే ‘కొడిగట్టేది’…
  • వీడియోకాన్ – దేశ బ్యాంకింగ్ చరిత్రలోనే అతి పెద్ద దివాలా కేసు !
  • రామాయణ సినిమా మాత్రమే కాదు… ఈ మహాభారతం ఘనత కూడా చదవండి!
  • మరీ అంత ‘సీన్’ లేదు ! సో సో… అక్కడక్కడా బాగున్నట్టు అనిపిస్తుంది !!
  • ఔను… రామాయణంతోపాటే రావణాయణం కూడా… తప్పేముంది..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions