.
ద్రోణాచార్యుడు చంద్రబాబు మొత్తం విద్యలు… అనగా వర్తమాన రాజకీయాల్లో ఉండాల్సిన లక్షణాలను మొత్తం కొడుకు లోకేష్ అలియాస్ అశ్వత్థామకు నేర్పించాడు… అఫ్‌కోర్స్, పైకి చూడబోతే మాత్రం అర్జునుడు ప్రియశిష్యుడు… లోకంలోకెల్లా గొప్ప విలుకాడిని చేసినట్టు చెప్పుకున్నాడు…
సీన్ కట్ చేస్తే… అదే చంద్రబాబు తన శిష్యుడు రేవంత్ రెడ్డికి మొత్తం నేర్పించలేదు… వర్తమాన భారతం కదా… నెత్తురే ముఖ్యం… సొంత వారసుడే ముఖ్యం… ఫాఫం, రేవంత్ రెడ్డిది తెలంగాణ కదా, తెలంగాణలో సోకాల్డ్ చంద్ర లోకేషులు చేసేదేమీ లేదు కదా… మరి రేవంత్ రెడ్డినీ తీర్చిదిద్దాలిగా… లేదు…
Ads
ఉదాహరణకు చూడండి… లోకేష్ ఇచ్చిన స్పూర్తితోనే ఇప్పుడు వుమెన్ క్రికెట్ టీం ప్రపంచ కప్ కొట్టింది అని టీవీ5 సాంబ నుంచి మొదలుకొని యెల్లో బ్యాచ్ ఊదరగొడుతోంది… లోకేష్‌కూ క్రికెట్ టీమ్‌కూ లింక్ ఏమిటీ అనడక్కండి… ఈ ప్రశ్నలు ఈ వర్తమాన భారతంలో పనిచేయవు…
జట్టులో శ్రీచరణి రెడ్డి ఉంది… రాయలసీమ… అనగా ఆంధ్రప్రదేశ్… వెంటనే టీడీపీ (కూటమి కాదు) ఓన్ చేసుకుంది… అమరావతికి పిలిచారు… మిథాలీరాజ్, శ్రీచరణికి ఘన స్వాగతం, చంద్రబాబుతో సెల్ఫీ, లోకేష్‌తో సెల్ఫీ… 1000 గజాల ఇంటిస్థలం, 2.5 కోట్ల నగదు, గ్రూపు-1 పోస్టు అట… ప్రకటించేశాడట…
మరి రేవంత్ రెడ్డి..? పూర్ టీం… పక్కా హైదరాబాదీ అరుంధతిరెడ్డి కూడా ఈ వుమెన్ జట్టులో ప్లేయరే… రిజర్వ్‌డ్… ఆడే అవకాశం దొరకలేదు కానీ మెరిటోరియస్… పేస్ బౌలర్… మరి గెలుపులో ఆమెకూ పేరు దక్కాలా అంటారా..? వై నాట్..? ఆమె పార్ట్ ఆఫ్ వుమెన్ టీమ్…

ప్రతీక రావల్ గాయపడితే షఫాలీ వర్మ జట్టులోకి వచ్చింది… ఏమో, అది హర్మన్ ప్రీత్ కౌర్ చాయిస్… షఫాలీ క్లిక్ కావడంతో అరుంధతీ రెడ్డి బెంచ్‌కే పరిమితం కావల్సి వచ్చింది… ఆమె ఈ కప్‌లో ఆడకపోయినా భారత జట్టుకు ఆడింది… 11 వన్డేలు, 38 టీ20లు ఉన్నాయి ఆమె ఖాతాలో…
సో, కప్ గెలిచిన జట్టు సభ్యురాలిగా తెలంగాణ ప్రభుత్వం ఆమెను ఓన్ చేసుకునే పని లేదా..? మరి చంద్రబాబును చూసి రేవంత్ రెడ్డి ఏం నేర్చుకున్నట్టు..? ఆమెను మంత్రి వాకిటి శ్రీహరి (?) కలిశాడనీ ఓ పోస్టు, డిప్యూటీ సీఎం భట్టిని కలిసినట్టు ఓ ఫోటో కనిపించింది… క్రీడా ప్రాధికార సంస్థ తరఫున ముఖ్యులు స్వాగతం పలికారు… అంతే… అధికారికంగా ప్రభుత్వం అభినందన ఏదీ..? (ఈ కథనం రాసే సమయానికి…)

రేవంత్ రెడ్డి పిలిచి సన్మానించాలి, అభినందించాలి… అదీ ఓ పక్కా హైదరాబాదీని ఓన్ చేసుకోవడం… ఆ సోయి రేవంత్ టీమ్‌లో ఎవరికీ లేనట్టుంది… ఆమె హైదరాబాదీ, తల్లి భాగ్యరెడ్డి… ఆమె వాలీబాల్ ప్లేయర్… తండ్రి వివరాలు తెలియవు, భాగ్యరెడ్డి సింగిల్ పేరెంట్… అరుంధతీ రెడ్డి సోదరుడు రోహిత్ రెడ్డి, తల్లి భాగ్యరెడ్డితో కలిసి ఉంటుంది…
ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం చొరవ చూపితే… తగిన రీతిలో అభినందిస్తే… సన్మానిస్తే… అది మరికొంతమందికి స్పూర్తి… ఐనా ఎవరైనా వ్యక్తిగత విజయాలు సాధిస్తేనే కదా చంద్రబాబైనా, ఇంకెవరైనా పిలిచి, ఆత్మీయంగా మాట్లాడి ఆదరించేది…
అంతకుముందు సదరు ప్లేయర్లకు ప్రభుత్వాలు చేసిందేమీ ఉండదు… అదైనా రేవంత్ రెడ్డికి చేతకాకపోతే ఎలా..? మిథాలీ రాజ్ కూడా హైదరాబాదీయే… ఆమెకు గతంలో హామీ ఇచ్చిన ఇంటిస్థలం ఆమెకు దక్కిందా లేదా తెలియదు..!!

Share this Article