.
గీతాకృష్ణ అట… చాన్నాళ్లుగా రీల్స్, వీడియోలు కనిపిస్తున్నాయి… సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎవరితో అక్రమ సంబంధాలున్నాయి..? ఎవడెంత వెధవ..? రోత, బూతు యవ్వారాలన్నీ చెబుతుంటాడు… చాలా కాజువల్‌గా నేను ఎన్ని రహస్యాలు బయటపెడుతున్నాను చూశారా అన్నట్టుగా..!
ఇండస్ట్రీ అంటేనే… టీవీ కావచ్చు, సినిమా కావచ్చు, ఫ్యాషన్ సంబంధిత రంగాలేమైనా కావచ్చు, అచ్చంగా అవి లైంగిక దోపిడీ కేంద్రాలే… అందరూ వ్యభిచారులే, చెల్లింపుల రకాలు వేరు గానీ అందరూ విటులే అన్నట్టు ఉంటాయి ఆ వీడియోలు… జనానికీ అలాంటి కబుర్లు నచ్చుతాయి కదా, బాగా వ్యూస్ కనిపిస్తున్నాయి…
Ads

ఓ రీల్ కనిపించింది… తన వెగటు భాష, తన రోత ధోరణి ఓసారి గమనించండి… దాని హెడింగ్… ‘‘రష్మిక ఇలా చేశాక విజయ్ దేవరకొండ ఎలా పెళ్లి చేసుకుంటాడో…’’ ఇంకా ఇలా చెబుతున్నాడు… ‘‘ఆ అమ్మాయికి ఈ ఎంగేజ్‌మెంట్లూ ఇవీ కొత్తేమీ కాదు… రిషబ్ శెట్టి బ్రదర్స్‌తో ఎంగేజ్‌మెంట్స్ అయ్యీ బయటికొచ్చింది కదా… కాబట్టి కమర్షియల్ కింద లెక్క…

ఆమె విజయ్‌కన్నా బెటర్‌గా ఉంది కెరీర్‌లో… తను కాస్త టైమ్ అడుగుతున్నాడు పెళ్లికి… తను కూడా కొంత స్పీడ్ అందుకున్నాక పెళ్లి చేసుకుందామనే ఇగో శాటిస్‌ఫాక్షన్ కోసం… లేదా ఇద్దరూ పెళ్లిచేసుకున్నాక కలిసి రెయిజ్ కావడం కోసం కావచ్చు.,. పుష్ప చేశాక, విజయ్ మానేయాల్సి ఉండింది… ఎందుకంటే ఆమె అంత –గా యాక్ట్ చేసింది…కాకపోతే మంచి నటే, ఎక్కడికో వెళ్లిపోయింది..’’
ఇలా సాగిపోయింది… ఎవరబ్బా ఇతను అని గూగుల్ సెర్చితే… ఇండస్ట్రీలో చాన్నాళ్లుగా ఉన్నాడనీ, దర్శకుడనీ అర్థమైంది… నాగార్జున వంటి హీరోతో అప్పట్లో సంకీర్తన సినిమా తీసి నంది అవార్డు కూడా పొందాడట.., కోకిల, కీచురాళ్లు అనే సినిమాలు కూడా తీశాడట… బహుశా ఇదుగో ఈ రోత వ్యాఖ్యలతోనే ఇక అందరూ దూరం పెట్టేశారేమో… పుష్కరకాలంగా మళ్లీ ఏ చప్పుడూ లేదు… ఇప్పుడిలా తగులుకున్నాడు ప్రేక్షకులను… కామెడిమిడి జ్ఙానంతో…

రిషబ్ శెట్టి బ్రదర్స్‌తో ఎంగేజ్‌మెంట్స్ అట… రక్షిత్ శెట్టి హీరో, రిషబ్ శెట్టి దర్శకుడు మొదట్లో కిరిక్ పార్టీ అనే సినిమాకు సంబంధించి… అందులో రష్మిక హీరోయిన్… అంతేతప్ప రిషబ్ శెట్టి బ్రదర్ కాదు రక్షిత్ శెట్టి… కాకపోతే గాఢమైన స్నేహం… ఏవో మనస్పర్థలు వచ్చాయి, రష్మిక- రక్షిత్ ఎంగేజ్‌మెంట్ అయ్యాక బ్రేకప్.,. పెద్ద విశేషమేముంది అందులో… ఇండస్ట్రీలోనే కాదు, బయట కూడా బొచ్చెడు ఉదాహరణలు…
ఆమె మీద కోపంతో రిషబ్, రక్షిత్ ఆమె మీద చేయని నెగెటివ్ ప్రచారాలు లేవు… కానీ ఆమె సామాజికవర్గం కొడవ… సైనిక సంస్కృతి ఉన్న సామాజికవర్గం అది… అదే ఫైటింగ్ స్పిరిట్ చూపిస్తూ ఇండస్ట్రీలో నిలబడింది, తనను తాను ప్రూవ్ చేసుకుంది… కన్నడ మీడియా వెదజల్లే ద్వేషాన్ని కూడా తట్టుకుంది… ఈరోజు ఇండియన్ సినిమాకు నేషనల్ క్రష్మిక ఆమె…

పుష్పలో అంత దారుణంగా ఏం చేసిందని..? ఎందుకు విజయ్ దేవరకొండ తనను దూరం ఉంచాలి..? అదొక మూర్ఖపు వ్యాఖ్య… చిల్లరతనం… వాళ్లిద్దరూ చాన్నాళ్లుగా ప్రేమికులు… గీతగోవిందం నుంచే… విజయ్ ఫైనాన్షియల్‌గా, కెరీర్‌పరంగా బాగా డౌన్ అయినప్పుడు కూడా రష్మికే అన్నిరకాలుగా అండగా నిలబడింది…
ఎంగేజ్‌మెంట్స్ అట.., ఎన్ని జరిగాయి గీతాకృష్ణా..? పైగా రిషబ్ శెట్టి బ్రదర్స్‌తోనట… ఎందరు బ్రదర్స్‌తో..? కాబట్టి ఆమె కమర్షియల్ అట… పిచ్చి కూతలు… తమరి మెదడు ఒకవైపు కుళ్లిపోతున్నట్టుంది బ్రదర్… అన్నీ ఇలాంటి వీడియోలు, రీల్స్, షార్ట్స్… చివరికి ఎలాంటి వాడు ఎలాగయ్యాడు..?!

Share this Article