Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దేశం రక్షింపబడింది..! మరింత బీమార్ గాకుండా రాష్ట్రమూ రక్షింపబడింది…

November 14, 2025 by M S R

.

బీహార్‌కు దూరంగా… ఓ మారుమూల ఈ ఫలితాలను చూస్తూ, తనదైన అవగాహనతో విశ్లేషించుకుంటున్న ఓ 70 ఏళ్ల రిటైర్డ్ టీచర్ చెప్పిన ఒకే ఒక ఫైనల్ మాట… సింపుల్‌గా… దేశం రక్షింపబడింది…

ఎలా..? తను సింపుల్‌గా కొన్ని విషయాలు వ్యంగ్యంగా… కాదు, స్ట్రెయిటుగానే చెప్పాడు…

Ads

1) థాంక్ గాడ్… ఓ స్కూల్ డ్రాపౌట్ నుంచి… ఓ అత్యంత అవినీతి కుటుంబం నుంచి… కులం, మతం పేరిట మాఫియా రాజ్‌, జంగిల్ రాజ్‌తో బీహార్‌ను నాలుగు దశాబ్దాలు వెనక్కి నడిపించిన ఓ ధూర్త కుటుంబం నుంచి బీహార్ ప్రజలు తమను తాము రక్షించుకున్నారు…

2) నితిశ్ అవినీతిపరుడు కాడు, వారసత్వ గొడవలు లేవు… కాకపోతే అత్యంత అవకాశవాది… ఇప్పటికీ నితిశ్ బీజేపీతోనే చిరకాలం ఉంటాడనీ లేదు… కానీ ఆర్జేడీ కూటమిని మరీ 45- 50 సీట్లలోపుకు పరిమితం చేయడం, బీహార్‌ కే కాదు, దేశానికే మంచిది… (ఆర్జేడీ కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చాడు… ఈ దేశ దౌర్భాగ్య రాజకీయాలకు, వాగ్దానాలకు పరాకాష్ట…)

3) జేడీయూ లార్జెస్ట్ సీట్ల పార్టీగా నిలబడొచ్చు… లేక బీజేపీ నిలబడొచ్చు, అంతిమ ఫలితాలు తేలేవరకు… కానీ  బీజేపీ సొంత సీఎం అనే వాదనను తెరమీదకు తీసుకురాకపోవచ్చు… నితిశ్ మరీ కేంద్ర మంత్రిగా వెళ్లడానికి ఇష్టపడడు…

4) అన్నింటికన్నా బెటర్ ఓ పొలిటికల్ బ్రోకర్ ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ అత్యంత దారుణంగా జనం తిరస్కరణకు గురికావడం, అది ఈ దేశ, ఈ సమాజానికి మంచిది… తనను వందల కోట్లతో ఎంటర్‌టెయిన్ చేసిన ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు సిగ్గుతో తలదించుకోవాలి…

5) కాలం చెల్లిన సిద్ధాంతాలతో ఇంకా జనంలో ఉనికి కలిగిన లెఫ్ట్, ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్ పార్టీలు ఏమాత్రం ప్రభావం చూపకపోవడం కూడా మంచిదే… వీళ్లంతా సూడో సెక్యులర్ ధోరణులతో హిందూ సమాజాన్ని నష్టపరుస్తున్నారు…

6) థాంక్ గాడ్… బీహార్ అంటేనే బీమారు రాష్ట్రం… దానికి బాధ్యత లాలూ కుటుంబం… మహాఘట్ భందన్ గనుక గెలిస్తే మళ్లీ మాఫియా రాజ్, మళ్లీ క్రైమ్ రాజ్ వచ్చేది… ఈ నైతికత యూపీలో మరో అరాచక్ పార్టీ ఎస్పీకి ఊతం ఇచ్చేది… అది ఆర్జేడీకి యూపీ ప్రతిబింబం… తద్వారా దేశానికి నష్టం జరిగేది…

7) అఫ్ కోర్స్, రాహుల్ గాంధీ ఓ అట్టర్ ఫ్లాప్ కేరక్టర్ ఇండియన్ పాలిటిక్సులో… తను కాంగ్రెస్ హైకమాండ్‌గా ఉన్నన్నిరోజులూ మోడీకి, బీజేపీకి ఢోకా లేదు… వోట్ చోరీ, సర్ వివాదం వంటి అనేకానేక విషయాల్లో రాహుల్ తన మూర్ఖపు రాజకీయ ధోరణిని బయటపెట్టుకుని జనంలో పలుచన అయిపోయాడు…

8) ప్రత్యేకించి సర్ ద్వారా ఎన్నికల సంఘం లక్షల దొంగ వోట్లను తొలగించడం బీజేపీకి బాగా ఉపయోగపడింది… ప్రక్షాళన జరిగింది… దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ జరగాలి… అది దేశానికే హితం… చివరకు అమిత్ షా కూడా ఇంత భారీ విజయాన్ని అంచనా వేయలేదు, తను 160 దాాటుతాం అన్నాడు… కానీ 195 దాటి  వస్తున్నయ్…

9) చివరగా… బీమారు రాష్ట్రంలో మనుషులకన్నా జంతువులు ఆనందంగా ఉన్నాయి… తమ దాణాను తినే మనుషులు మళ్లీ అధికారంలోకి రావడం లేదు, థాంక్ గాడ్… మా దాణా సురక్షితం…

10) ఇకనైనా రాహుల్ గాంధీ జెన్ జీ ఆందోళనలు, జార్జ్ సోరోస్, డీప్ స్టేట్, ఇతర అంతర్జాతీయ కుట్రలు ఇండియాపై సాగుతుంటే వాటికి మద్దతుగా నిలవడం మానేసి, తను భారతీయీకరించబడితే దేశానికి మంచిది, కాంగ్రెస్‌కు మంచిది…

11) ఆర్మీకి వ్యతిరేకంగా కూడా రాహుల్ తన ‘పరిమిత’ సంకుచిత జ్ఞానంతో వ్యాఖ్యలు చేశాడు… కాంగ్రెస్ మరీ డబుల్ డిజిట్ కూడా లేదు… (మరీ దారుణంగా అయిదారు సీట్లు… మరీ మజ్లిస్, సీపీఐఎం లిబరేషన్ పార్టీలతో సమానం అయిపోయింది)… కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇకనైనా నెహ్రూ కుటుంబ వారసత్వ పాలన నుంచి బయటపడితే మేలు…

….. ఈ పెద్దాయనతో అందరూ ఏకీభవించాలని లేదు… కానీ ఒక్కటి మాత్రం నిజం… బీహార్ మళ్లీ కులమాఫియా, నేరరాజకీయంలోకి… ఓ అరాచక, పాత రాతియుగంలోకి వెనక్కి వెళ్లకుండా ప్రజలు తమను తాము రక్షించుకున్నారు..!!

.

(అంకెలు ఎర్లీ results adhaarangaa)…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అరయగ కర్ణుడీల్గె…! కేటీయార్ ఓటమి… జనంలోకి రాని కేసీయార్ ఓటమి..!!
  • గెలిచింది రేవంత్…! ఓడింది కేటీయార్…! ఓ కొత్త కాంగ్రెస్ కనిపించింది…!!
  • దేశం రక్షింపబడింది..! మరింత బీమార్ గాకుండా రాష్ట్రమూ రక్షింపబడింది…
  • దీనక్క పాటలో సొంగకారిన పదాలు… దీనక్క ఏం రాస్తున్నారు భయ్యా…
  • ‘శ్రీబాగ్ భవన్’ అలా కాపాడబడింది… ఆ రక్షణ వెనుక కూడా ఓ కథ…
  • గాన చారుశీల సుశీల..! తిరుగులేని గళమాధుర్యం… స్వర సౌందర్యం..!!
  • చున్నీయిజం..! అది స్త్రీ స్వేచ్ఛావ్యతిరేక ప్రతీకా..? ఏమిటో ఈ సిద్ధాంతం..?!
  • శివ అంటే నాగార్జున, వర్మ మాత్రమేనా..? ఇంకెవరికీ క్రెడిట్ లేదా..?!
  • డాక్టర్ ఐపీఎస్… ఉగ్రవాదుల ఓ భారీ కుట్రను ఛేదించిన తెలుగు పోలీస్…
  • వ్యూహాత్మక బగ్రామ్ ఎయిర్‌ బేస్‌కై చైనా, అమెరికా పాలిటిక్స్… కానీ..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions