.
Pardha Saradhi Potluri …. విదేశీ అతిధులు, విదేశీ ప్రధానులు, అధ్యక్షులు భారత దేశ పర్యటనకి వచ్చినప్పుడు వారికి ఇచ్చే ప్రత్యేక విందులో మన దేశ లోక్ సభ ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానించడం అనవాయితీ గా వస్తున్నది!
అయితే సదరు అధ్యక్షులు, ప్రధాన మంత్రులు భారత్ లో తాము ఎవరిని కలవాలో, ఎవరిని కలవకూడదో అనే ఛాయిస్ కూడా ఉంటుంది!
Ads
సదరు ప్రధాన మంత్రులు, అధ్యక్షులు తమకి ఇష్టం లేని వాళ్ళతో కలిసి విందులో పాల్గొనడానికి ఇష్టపడరు!
ఇక రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ రాహుల్ తో కలిసి కరచాలనం చేసి విందులో పాల్గొంటాడు అని అనుకోవడం పిచ్చితనం!
- బదులుగా శశిధరూర్ ని ఆహ్వానించడం రాహుల్ ని అవమానించడం కాదు రాహుల్ ని అనుమానిస్తున్నారు!
వ్లాదిమిర్ పుతిన్ కి జార్జ్ సోరోస్ కి అసలు పడదు. రాహుల్ కి జార్జ్ సోరోస్ కి ఉన్న సంబంధం ఏమిటో మనకంటే పుతిన్ కే ఎక్కువ తెలుసు. అటువంటప్పుడు పుతిన్ రాహుల్ తో కలిసి విందులో ఎలా పాల్గొన గలుగుతాడు?
రాహుల్ యూరోపు దేశాలలో తిరిగి ఎవరు ఎవరితో కలిసి ఏం మాట్లాడుతున్నాడో మన RAW కంటే ఎక్కువే పుతిన్ కి తెలుసు. అటువంటప్పుడు పుతిన్ రాహుల్ తో కలిసి విందులో ఎలా పాల్గొనగలుగుతాడు?
వియత్నాం, బర్మా, మలేషియాలలో రాహుల్ ఎవరిని ఎందుకు కలుస్తున్నాడో పుతిన్ కి తెలుసు. అటువంటప్పుడు పుతిన్ రాహుల్ తో కలిసి విందులో ఎలా పాల్గొనగలుగుతాడు?
బంగ్లాదేశ్ లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ex CIA ఏజెంట్ ని పుతిన్ మనుషులే హత్య చేశారు, కారణాలు ఏమిటో పుతిన్, మోడీలకి తెలుసు. అటువంటప్పుడు పుతిన్ రాహుల్ తో కలిసి విందులో ఎలా పాల్గొన గలుగుతాడు?
ex CIA ఏజెంట్ హత్య జరిగిన పది రోజుల తరువాత పాకిస్తాన్ ISI ఏజెంట్ హత్యకి గురయ్యాడు! ఎవరు హత్య చేశారో, ఎందుకు చేశారో పుతిన్, మోడీలకి తెలుసు. అటువంటప్పుడు పుతిన్ రాహుల్ తో కలిసి విందులో ఎలా పాల్గొన గలుగుతాడు?
చైనాలో SCO సమావేశానికి వెళ్ళినప్పుడు పుతిన్, మోడీలు పుతిన్ కారులో రహస్యంగా ఎందుకు మాట్లాడుకున్నారో, ఏం మాట్లాడుకున్నారో వాళ్ళిద్దరికే తెలుసు. అటువంటప్పుడు పుతిన్ రాహుల్ తో కలిసి విందులో ఎలా పాల్గొన గలుగుతాడు?
రాహుల్ కాదు, కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఒకటుంది, అది: ఆపరేషన్ సిందూర్ ఆగిన తరువాత పాకిస్తాన్ మీద భారత్ ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో వివరించడానికి బీజేపీ ప్రతినిధులతో పాటు ప్రతిపక్షాల నుండి శశిధరూర్ తో పాటు అసదుద్దీన్ ఒవైసీ వివిధ దేశాలకి వెళ్ళినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ నేనూ వెళ్తానని ఎందుకు అడగలేదు? సమాధానం చెప్పాలి!
అసలు స్వంతంగా ఏ టాపిక్ మీద అయినా మాట్లాడలేని రాహుల్, యూరోపు నుండి వచ్చిన స్క్రిప్ట్ ని బట్టిపట్టి మాట్లాడే రాహుల్ పుతిన్ తో కలిసి విందులో పాల్గొని ఏం మాట్లాడతాడు? భారత్ లో ప్రజాస్వామ్యం లేదని అరుస్తాడా?
UPA చైర్ పర్సన్ అనేది రాజ్యాంగ పదవి కాదు. కానీ పదేళ్ల పాటు ప్రధాన మంత్రిని పక్కన నెట్టేసి. సోనియా మాట్లాడేది విదేశీ ప్రతినిధులతో! పాపం! 11 ఏళ్ళ తరువాత గత వైభవం గుర్తుకి వచ్చినట్లున్నది… గతం గతః! ……. (ఈ అభిప్రాయాలు పూర్తిగా వ్యాసరచయిత సొంతం)
Share this Article