Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వీడొక డర్టీ ఫెలో… అగ్లీ కేరక్టర్… తగిన శాస్తి చేయండి… అర్హుడే..!!

December 30, 2025 by M S R

.

వాడు… అవును, ఇది చిన్న పదం… వాడు అనే పదాన్ని వాాడటానికి ఏమాత్రం సంకోచం లేదు, సందేహం లేదు… వాడి పేరు అన్వేష్ అట… నా అన్వేషణ అని ఓ యూట్యూబ్ చానెల్ వీడిది… ఒకప్పుడు ఏదో ఏటీఎం సెంటర్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ అట…

తరువాత దేశాలు తిరుగుతూ, ఆ విశేషాలు చెబుతూ యూట్యూబ్‌లో ఫేమస్ అయ్యాడు… ఎంతగా అంటే లక్షల్లో ఫాలోవర్లు, ఇన్‌స్టాలో కూడా… కోట్లలో ఆదాయం… కానీ వాడి భాష ఓ దరిద్రం, వాడి కంటెంటు పరమ దరిద్రం… రోత, బూతు… వెగటు, వెకిలి… మీరు ఏ పదాన్నైనా వాడండి, అన్నింటికీ వాడు అర్హుడే… (తన తాజా వీడియో బిట్లు రెండు మూడు చూశాక తనను తిట్టడానికి పెద్దగా ఆలోచించాల్సిన పని లేకుండా పోయింది)…

Ads

ఇంత హార్ష్‌గా అనడానికి కారణాలున్నాయి… మీరు గనుక వాడి సబ్‌స్క్రయిబర్ అయి ఉంటే, ముందు అన్‌సబ్‌స్క్రయిబ్ చేయండి, రిపోర్టు కొట్టండి…. అంత గలీజు గాడు వాడు… ఆమధ్య బెట్టింగ్ యాప్స్ వివాదంలో తెలంగాణ పోలీసులు తెగ సపోర్టు చేశారు వాడికి… వాడు ఈమధ్య ఓ వీడియో పెట్టాడు…

శివాజీ ‘సామాన్ల’ వివాదం తెలుసు కదా… అందులో దూరాడు… తన సామాన్లు (మర్మాంగం) కోసేయాలట… గరికపాటి కూడా అలాగే అసభ్య వస్త్రధారణ మీద ఆమధ్య హితవచనాలు చెప్పాడు కదా, తననూ తిట్టేశాడు… అంతేకాదు, బట్టలు విప్పుకుని తిరగండి అని పిలుపునిస్తున్నాడు ఆడవాళ్లకు… మతాల ప్రస్తావన తీసుకొచ్చి మరీ..!

అయిపోలేదు, ఆ వీడియోలు ఇక్కడ పోస్ట్ చేయడం లేదు, ఓ పుచ్చకాయ ఓ రంధ్రం చేశాడు, అది స్త్రీ మర్మాంగం అట… చేతిలో కీరా పట్టుకున్నాడు, అది పురుషుడి మర్మాంగం అట… ఇక బూతులే బూతులు… వాడి డిక్షన్ ఓ వికారం… వాడి ఫేస్ ఫీలింగ్స్ ఓ వికారం… ఆ టోన్ ఓ వికారం…

ఇంకా ఉంది… ఒక శివాజీ మాటలు అందరికీ నచ్చాలని లేదు, ఒక గరికపాటి మాటలు అందరికీ నచ్చాలని లేదు… నెగెటివ్, పాజిటివ్ రెండురకాల అభిప్రాయాలు వస్తున్నాయి… ఆ చర్చ వరకూ వోకే… కానీ వాడే భాష,  సంస్కారం ముఖ్యం కదా… అది లేదు వాడిలో…

వాడి వీడియోలో అంటున్నాడు… టీ షర్టులు వేసుకున్నారని సీత, ద్రౌపదిలను రే* ప్ చేశారా అంటున్నాడు… ఇడియెట్, బాడ్‌ఖావ్ (ఇక్కడ మీరు మీకు తెలిసిన ఏ బూతులు తిట్టుకున్నా వాడు అర్హుడే) రే* ప్ జరగడం ఏమిటిరా..? కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని గాయపరచడం కాదు ఇది… అంతకుమించిన ద్రోహం…

వాడు వెయ్యి రూపాయలు ఇచ్చి, ఎవరో 14 ఏళ్ల బాలికతో సంభోగం చేశాడట… ఇండియాలో అయితే పోక్సో కేసు పెట్టి లోపల నూకుతారు… ఇండియాలో మొత్తం పొల్యూషన్ అట… 28 వేల మందిని హిందువులు రే* ప్ చేశారట… తనకు బిడ్డ పుడితే ఇండియాకు వస్తే తననూ రే* ప్ చేస్తారట… వాడి నోరు పెద్ద డ్రైనేజీ మోరీ…

ఆ కంపు భరించలేక, వీహెచ్‌పీ వాడిపై ఫిర్యాదు చేసింది… పోలీసులు కేసు పెట్టారో లేదో తెలియదు… (నటి మాధవి మీద మాత్రం ఎవరో చెప్పగానే కేసు పెట్టేశారు… సాయిబాబా ముస్లిం అన్నందుకు అట)…

ఇప్పుడు జనం లక్షల్లో అన్‌సబ్‌స్క్రయిబ్ చేస్తుండేసరికి ఈ అన్వేషకుడికి తత్వం బోధపడింది… (నిన్నటి నుండి 3.2 మిలియన్ subscribers నుండి ఈరోజు 2.44 మిలియన్ unsubscribed అయ్యారు, అంటే ఒకెేరోజు 7 లక్షల 60 వేల మంది… అంటే వాడి మాటల్ని, చేష్టల్ని ఎంతగా జనం (వాడి ఫాలోవర్లే) అసహ్యించుకుంటున్నారో అర్థమవుతోంది కదా)

శివాజీకి సారీ అట… నేనూ హిందువునే అంటున్నాడు… వాడు బతికేది విదేశాల్లోనట… ఇండియాలో టాక్సులు కడుతున్నాడట… ఉద్దరించాడుట… హిందూ జాతికి ఇలాంటి వాళ్లే పెద్ద వైరస్.., సందేహించకండి, సంకోచించకండి… వీటికి బుద్ధిచెప్పాలంటే… వాడి ఆదాయ మార్గాన్ని దెబ్బతీయడమే… ఇన్నాళ్లూ వాడి కంపు చూసింది  చాలు, అన్ ఫాలో కండి, రిపోర్టు చేయండి…

ఇంత హార్ష్ అభిప్రాయాన్ని ‘ముచ్చట’ ఎవరిపైనా వ్యక్తం చేయలేదు... ఇప్పుడు వాడికి వాడాల్సిన భాష ఇంకా పదునుగా ఎలా ఉండాలో కూడా అర్థం కావడం లేదు..!! వాడి భాష మనకు రాదు కాబట్టి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసలు ఏమిటి ఈ ఉన్నావో కేసు..? ఎవరు ఆ నొటోరియస్ క్రిమినల్..?
  • వెండి, బంగారం…! ఎందుకీ పరుగు..? ఎక్కడి దాకా..? సేఫేనా..?
  • ‘సేటూ, ప్రాణాలు పోతాయని డబ్బుల్లేకపోయినా తిన్నాను… ఇక నీ దయ..’
  • వీడొక డర్టీ ఫెలో… అగ్లీ కేరక్టర్… తగిన శాస్తి చేయండి… అర్హుడే..!!
  • ముక్కోటి ఏకాదశి అంటే ఒకటే తిథి కదా.., మరి పదిరోజుల దర్శనాలు..?!
  • కురువాపురం వెళ్లొచ్చాం… శ్రీపాద వల్లభుడి గుడిలో దివ్యానుభూతి…
  • సంస్కారం, మర్యాద, పరిణతి… రేవంత్ రెడ్డి తలెత్తుకున్నాడు కేసీయార్ ఎదుట..!!
  • NCP ఏకీకరణ..? NDA వైపు శరద్ పవార్ అడుగులు..? ఇండి కూటమికి దెబ్బ..!!
  • సువ్వి కస్తూరి రంగ – సువ్వి కావేటి రంగ … మరుపురాని పాట…
  • మన ఇంట్లో, మన కాలనీ గుడిలో దేవుడు దేవుడు కాడా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions