.
విజయ్ నటించిన ‘జననాయగన్’ (Jananayagan) సినిమా సెన్సార్ వివాదం ప్రస్తుతం కోలీవుడ్‌లో ఒక హాట్ టాపిక్… అంతేకాదు, తమిళ రాజకీయాల్లో కూడా..! ముందుగా సెన్సార్ సమస్య ఏమిటో చూద్దాం…
విజయ్ రాజకీయ ప్రస్థానానికి ఉపయోగపడేలా ఈ సినిమా (తన చివరి సినిమా అని చెబుతున్నాడు)లో కొన్ని సంభాషణలున్నాయి… అవి విద్వేష వ్యాప్తికి దారితీస్తాయని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ నిరాకరించింది… 27 కట్స్ చెప్పింది… అన్నీ సవరిస్తామని చెప్పినా బోర్డు రివైజ్ కమిటీకి సిఫారసు చేసింది…
Ads
సాధారణంగా సినిమాల విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు, FCAT (Film Certification Appellate Tribunal) ఉండేది… కానీ దాన్ని రద్దు చేశాక, నేరుగా హైకోర్టుకు వెళ్లడం లేదా ముంబైలోని రివైజింగ్ కమిటీని ఆశ్రయించడం రెండే మార్గాలు…
‘పరాశక్తి’ టీమ్ అనుసరించిన రివైజింగ్ కమిటీ (Mumbai RC) మార్గం కాకుండా, విజయ్ టీం కోర్టుకు వెళ్లింది… ఇక్కడ ఇష్యూ సంక్లిష్టంగా మారింది… సింగిల్ బెంచ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా, అసలు మా వాదనకు టైమ్ ఏదీ అంటూ సీబీఎఫ్‌సీ అప్పీల్‌కు వెళ్లింది… అది 21కు విచారణను వాయిదా వేసింది… దీంతో సినిమా రిలీజు ఆగిపోయింది… రివైజ్ కమిటీకే నేరుగా సినిమా టీమ్ వెళ్లి ఉంటే ఫలితం ఎలా ఉండేదో… అందులో సినిమా రంగ నిపుణులు కూడా ఉంటారు…
ఈలోపు రాజకీయ రంగు పులుముకుంది ఈ వివాదం… విజయ్ కాంగ్రెస్ వైపు వెళ్లకుండా, ఎన్డీయే వైపు వచ్చేలా… లేదా ఒంటరిగా పోటీలో ఉండేలా ఒత్తిడి తీసుకురావడానికి బీజేపీ ఆడుతున్న నాటకం అనే విమర్శలు మొదలయ్యాయి…
ఆల్రెడీ ఓ తొక్కిసలాట బాపతు కేసు సీబీఐ దగ్గర ఉంది… ఒక సినిమా రిలీజు ఆగిపోయినంతమాత్రాన, సీఎం కావాలనుకుంటున్న ఓ నాయకుడు తన పార్టీ విధానాల్ని తాకట్టు పెడతాడా..? నెవ్వర్… పైగా ఇప్పుడు తనకు యువతలో చాలా ఫాలోయింగ్ కనిపిస్తోంది… అన్నాడీఎంకేలో నాయకత్వ వైఫల్యం కారణంగా, విజయ్ ఓ సెకండ్ ఆల్టర్నేట్‌గా కనిపిస్తున్నాడు…
యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్ వోటు ఎక్కువగా తన వైపే టర్న్ అయ్యే అవకాశమూ ఉంది… ఒకవేళ కాంగ్రెస్‌తో జత కూడితే… అది ఇండి కూటమి మనుగడకు బలమైన దెబ్బ అవుతుంది… ఆ కూటమిలో బలమైన పార్టీ డీఎంకేయే… అదీ విచ్చుకుపోతే ఇక ఇండి కూటమి అస్థిత్వమే ప్రశ్నార్థకం అవుతుంది… సో, కాంగ్రెస్ డీఎంకేను వదులుతుందానేది సందేహమే…
విజయ్ తనే సీఎం కావాలని అనుకుంటున్నాడు కాబట్టి అన్నాడీఎంకే పళనిస్వామి ఎన్డీయేలోకి రానివ్వడు… తను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైనే మార్పించగలిగాడు… ఒకవేళ నిజంగానే కాంగ్రెస్, విజయ్ కలిస్తే… ఇక మూడు కూటముల నడుమ త్రిముఖ పోటీ జరిగి, అంతిమంగా ఎవరు నెగ్గుతారో తెలియదు…
విజయ్ ప్లస్ కాంగ్రెస్ … డీఎంకే కూటమి… అన్నాడీఎంకే ప్లస్ బీజేపీ… వీటి మధ్య పోరు… డీఎంకేకు బాసటగా ఉన్న దళిత, బహుజన, మైనారిటీ వోట్లు, ప్రభుత్వ వ్యతిరేక వోట్లు విజయ్ వైపు మళ్లితే డీఎంకే బాగా నష్టపోవడం ఖాయం…
సో, బీజేపీ విజయ్‌ను ఆర్మ్ ట్విస్టింగ్ ద్వారా తను చెప్పినట్టల్లా ఆడేలా చేసుకోవడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు… కేవలం సినిమా కోసం విజయ్ లొంగిపోతాడనేది సందేహమే… బీజేపీకి మరో విషయంలో స్పష్టత ఉంది…
ఒకవేళ విజయ్ మీద ఒత్తిడికే ఇలాంటి ఆర్మ్ ట్విస్టింగ్ మెథడ్స్ పాటిస్తే, విజయ్ గనుక విక్టిమ్ కార్డు బయటికి తీస్తే అది తనకు మరింత బలం… బీజేపీకి మైనస్… పైగా ద్రవిడ ఆత్మగౌరవం నినాదం మరింత బలంగా వినిపించగలడు విజయ్…
పైగా డీఎంకేతో, బీజేపీతో ‘ఒంటరిగా పోరాటం’ చేస్తున్నాడనే ఇమేజ్ వస్తుంది తనకు… జననాయగన్ సినిమాలో సంభాషణలు కేంద్ర ప్రభుత్వ, హిందుత్వకు వ్యతిరేకంగా ఉన్నందుకే సినిమాను అడ్డుకున్నారనే ప్రచారం పెరిగితే అదీ విజయ్‌కు “ప్రో-పీపుల్/ప్రో-తమిళ్” ఇమేజ్‌తో అదనపు బలమే అవుతుంది… (తమిళనాడులో యాంటీ హిందుత్వ పోకడలదే పెత్తనం)…
నిజానికి, ఈ సెన్సార్ వివాదం విజయ్‌కు ఒక రకంగా ఉచిత ప్రచారం (Free Publicity), రాజకీయ మైలేజీని తెచ్చిపెట్టినట్టే కనిపిస్తోంది...!!
Share this Article