.
కఠినంగా స్పందించక తప్పని అనివార్యత కావచ్చు… ఇంకా రాబోయే రోజుల్లో మీడియా, సోషల్ మీడియా వేదికలపై మరింతగా విద్వేషవ్యాప్తి, వ్యక్తిత్వ హననాలు జరగకుండా అడ్డుకునే ప్రయత్నం కావచ్చు… తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వేగంగానే విచారణకు ఒక సిట్ వేశాడు… అది ఆల్రెడీ యాక్షన్‌లోకి దిగింది కూడా…
ఈ స్పీడ్ మూవ్ జర్నలిస్టు సర్కిళ్లలోనే కాదు, పొలిటికల్ సర్కిళ్లు, బ్యూరోక్రాట్లలోనూ ఆసక్తిని రేపుతోంది… మంత్రి కోమటిరెడ్డి- ఓ మహిళ ఐఏఎస్ మీద ఎన్టీవీలో మాత్రమే కాదు, పలు సోషల్ మీడియా వేదికల్లో కూడా (ప్రధానంగా బీఆర్ఎస్ అనుకూలం) ప్రసారమైన ఓ నీచమైన కంటెంటు మీద పోలీసులు ఏయే సెక్షన్లు పెడతారనేది పక్కన పెడితే…
Ads
- తెలంగాణలో క్షుద్ర రాజకీయాలు… అనగా సోషల్ మీడియాలో వందల కోట్లు ఖర్చు చేస్తూ… బురద ప్రచారాలు, అబద్ధాలు, వక్రబాష్యాలు, బూతులు, పెయిడ్ జనంతో తిట్ల వీడియోలు, విద్వేషాలను సమాజంలోకి పంప్ చేస్తున్నాయి రాజకీయ పార్ఠీలు.,. ఇందులో అగ్రస్థానం బీఆర్ఎస్‌దే…
అనేకానేక యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా ఖాతాలు, వెబ్ సైట్లు, సొంత మీడియా… కాంగ్రెస్ ప్రభుత్వం మీద, పర్టిక్యులర్‌గా రేవంత్ రెడ్డి మీద వందల కోట్ల బురద గుమ్మరించబడుతోంది… అంతేకాదు, బీఆర్ఎస్ మీద చిన్న విమర్శ వచ్చినా సరే… వ్యక్తిగత దూషణలు, బూతులతో విరుచుకుపడుతోంది అది… పార్టీ సపోర్ట్‌తోనే..!!
ఇక్కడ ఓ మాట... బీఆర్ఎస్ ఎంత నీచమైన ప్రచార దందాలకు దిగినా సరే... జాగృతి పేరిట బీఆర్ఎస్ సోషల్ మీడియా బాధ్యులపై ఇటీవల కనిపిస్తున్న పోస్టులు మరీ నీచంగా ఉన్నాయి... బీఆర్ఎస్‌ను మించిన దిగజారుడుతనం... బీఆర్ఎస్ క్యాంపు ఎంత నీచంగా బిహేవ్ చేసినా సరే, కల్వకుంట్ల కవిత ఈ రకమైన నీచ ప్రచారాల్ని ఎంకరేజ్ చేయకపోవడం, సంయమనం పాటించడం ఆమెకే శోభస్కరం...
పలు సెక్షన్లు పెట్టి కేసులు పెడుతున్నా సరే… సోషల్ మీడియా విద్వేష యాక్టివిస్టులపై ఆ కేసులు నిలవడం లేదు… పొద్దున కేసు, సాయంత్రానికి విడుదల అన్నట్టు తయారైంది… ఈ స్థితిలో తెలంగాణ ప్రభుత్వం కర్నాటక ప్రభుత్వం తరహాలో ఒక హేట్ బిల్లు తీసుకురానుందనే వార్త కాస్త ఇంట్రస్టింగుగా ఉంది…
సహజంగానే భావ వ్యక్తీకరణ హక్కుకు వ్యతిరేకం, ప్రజాస్వామిక గొంతుల్ని కర్కశంగా అణిచేసే కుట్ర అనే విమర్శలు వస్తాయేమో… కానీ సొసైటీలో విద్వేషవ్యాప్తి భయంకరంగా సాగుతున్నవేళ ఇలాంటి కొత్త చట్టాలు అవసరమేనా అనే చర్చ కూడా జరుగుతోంది… అసలు ఆ కర్నాటక చట్టం ఏమిటో, దాని ముఖ్యాంశాలు ఏమిటో చూద్దాం…
‘కర్ణాటక విద్వేష ప్రసంగం, విద్వేష నేరాల (నిరోధక) బిల్లు – 2025’ లోని ముఖ్యాంశాలు… విద్వేష ప్రసంగాలను అరికట్టడానికి ఒక రాష్ట్రం ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకురావడం దేశంలో ఇదే మొదటిసారి…
1. విద్వేష ప్రసంగం (Hate Speech) నిర్వచనం: సమాజంలో వ్యక్తులు లేదా సమూహాల మధ్య శత్రుత్వాన్ని, విద్వేషాన్ని పెంచేలా చేసే ఏ చర్య అయినా ఈ చట్టం పరిధిలోకి వస్తుంది…
-
మాధ్యమాలు…: మాటలు (spoken), రాతలు (written), సైగలు (signs), దృశ్య రూపాలు (visual representations) లేదా సోషల్ మీడియా వంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా చేసే ప్రచారం…
-
ఆధారాలు…: మతం, కులం, జాతి, లింగం (gender), లైంగిక ధోరణి (sexual orientation), పుట్టిన స్థలం, నివాసం, భాష లేదా వైకల్యం ఆధారంగా ఇతరులను దూషించడం నేరంగా పరిగణించబడుతుంది…
2. శిక్షలు మరియు జరిమానాలు: తప్పు చేసిన వారికి కఠినమైన శిక్షలను ఈ బిల్లు ప్రతిపాదించింది…
-
మొదటిసారి నేరం చేస్తే…: సంవత్సరం నుండి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, ₹50,000 జరిమానా… (ప్రారంభంలో 10 ఏళ్లు అని ఉన్నా, సవరణ ద్వారా 7 ఏళ్లకు తగ్గించారు)…
-
రెండవసారి లేదా అంతకంటే ఎక్కువసార్లు చేస్తే…: 2 ఏళ్ల నుండి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా…
3. సంస్థాగత బాధ్యత (Collective Liability): ఒకవేళ ఏదైనా సంస్థ లేదా అసోసియేషన్ ద్వారా విద్వేష ప్రసంగాలు జరిగితే, ఆ సంస్థలోని బాధ్యతాయుతమైన వ్యక్తులను (Office bearers) కూడా దోషులుగా పరిగణిస్తారు… తమకు తెలియకుండానే ఆ నేరం జరిగిందని వారు నిరూపించుకోవాల్సి ఉంటుంది…
4. ఆన్‌లైన్ కంటెంట్ తొలగింపు: విద్వేషాన్ని రగిల్చే సమాచారాన్ని సోషల్ మీడియా లేదా ఇతర ఇంటర్నెట్ వేదికల నుండి తొలగించడానికి లేదా బ్లాక్ చేయడానికి ప్రభుత్వానికి ఈ బిల్లు అధికారం ఇస్తుంది…
5. ఇతర కీలక అంశాలు:
-
నాన్- బెయిలబుల్…: ఈ చట్టం కింద నమోదయ్యే కేసులు నాన్- బెయిలబుల్ (బెయిల్ రావడం కష్టం) , పోలీసులు వారంట్ లేకుండానే అరెస్టు చేసే అవకాశం (Cognizable) ఉంటుంది…
-
బాధితులకు పరిహారం…: విద్వేష నేరాల వల్ల నష్టపోయిన బాధితులకు తగిన పరిహారం చెల్లించే నిబంధన కూడా ఇందులో ఉంది…
-
మినహాయింపులు…: కళాత్మక సృజనలు (Art), సాహిత్యం (Literature), విద్యాపరమైన అంశాలకు (Academic work) కొన్ని మినహాయింపులు ఇచ్చారు…
ప్రతిపక్షాల విమర్శ….: ఈ బిల్లు వల్ల ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ (Freedom of Speech) కు భంగం కలుగుతుందని, ప్రభుత్వం తన విమర్శకులను అణచివేయడానికి దీనిని ఒక ఆయుధంగా వాడుకునే ప్రమాదం ఉందని బీజేపీ వంటి ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి…
అందుకే ఈ బిల్లుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఇంకా ఆమోదం తెలపలేదు... తిరస్కరించలేదు లేదా వెనక్కి పంపలేదు, కేవలం పెండింగ్‌లో ఉంచారు… ఈ బిల్లును రాజకీయ కక్షసాధింపులకు వాడుకునే ప్రమాదం ఉందని పేర్కొంటూ ఆమోదించవద్దని గవర్నర్‌ను కోరింది… ప్రభుత్వం పంపిన 22 బిల్లుల్లో 19 బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపినప్పటికీ, ఈ ‘హేట్ స్పీచ్’ బిల్లును మాత్రం ప్రస్తుతానికి పక్కన పెట్టారు…
Share this Article