.
పోలీసు జులుం, మీడియాపై దాష్టికం... ఈ ఆరోపణలు, ఈ విమర్శలకు మరో కోణం కూడా చూద్దాం ఓసారి...
అప్పట్లో… సీఎం ఆఫీసులో పనిచేసే ఓ మహిళా ఐఏఎస్ మీద ఏదో వెకిలి కార్టూన్ వస్తే… ఆమె కేసు పెట్టింది… తెలంగాణ ఖజానా నుంచి ఆమెకు ఆ కేసులో ఫైట్ చేయడానికి లక్షల రూపాయలు ఇచ్చాడు కేసీయార్… గుడ్… ఓ మహిళ గౌరవాన్ని కాపాడే దిశలో భరోసా ఇచ్చాడు…
Ads
కానీ ఇప్పుడు అదే కేసీయార్ బాపతు బ్యాచ్ పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు… ‘కలం’కాటుకు, విచక్షణ మరిచిన మీడియా ధాటికి, ఓ క్రూర వ్యక్తిత్వ హననానికి మరో లేడీ ఐఏఎస్ ఆత్మగౌరవం కించపడితే… పోలీసులు యాక్షన్‌లోకి దిగితే… గగ్గోలు పెడుతోంబది బీఆర్ఎస్…
- ఓ సినిమా నటితో కేటీయార్ అక్రమ సంబంధాలపై ప్రచారాలు గానీ… తరువాత మరో సినిమా నటిని లాగుతూ ఓ మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు చిల్లర… అవి వ్యతిరేకించిన బీఆర్ఎస్ పార్టీ… మరి మరో బాధిత లేడీ ఐఏఎస్ పట్ల ఇదేం ధోరణి తీసుకున్నట్టు..!! ఇక్కడ రాజకీయ విజ్ఞత ఏమైనట్టు..?
ఇద్దరూ లేడీ ఐఏఎస్‌లే కదా… ఐఏఎస్‌లు అని మాత్రమే కాదు… ఏ మహిళ ఇలాంటి వికృత ప్రచారాలకు బాధితురాలిగా మిగిలినా ప్రజాజీవితంలో ఉన్న పార్టీగా సపోర్టుగా నిలబడాల్సింది పోయి, విరుద్ధంగా నిందితులకు సపోర్టుగా నిలబడితే ఎలా..?
నిజానికి ఇక్కడ ఎన్టీవీ మీద కేసు పెట్టినందుకు కాదు, బీఆర్ఎస్ గగ్గోలు… ఆ ఎఫ్ఐఆర్‌లో ఎన్టీవీ తరువాత ఉన్నదంతా బీఆర్ఎస్ బ్యాచ్ మీడియా… ప్రధానంగా బీఆర్ఎస్ పెయిడ్, అనుంగు మీడియా..! పేరుకు అందరూ జర్నలిస్టులే…
ఎప్పుడైతే ఎన్టీవీ ‘చింతిస్తున్నాం’ అని తమ టీవీ తెర మీదే క్షమాపణ చెప్పిందో… తప్పు అంగీకరించినట్టే కదా… ఎవరెవరో పెయిడ్ మీడియా, సోషల్ మీడియా పర్సనాలిటీలు ఏదిపడితే అది ప్రసారం చేస్తే… అదంతా రాజకీయ లబ్ధి కోసం నడిపించే కుహనా, ఫేక్ జర్నలిజం అనుకుందాం… కానీ మెయిన్ స్ట్రీమ్‌లో నంబర్ వన్ లేదా నంబర్ టు చానెల్‌గా ఉండే ఎన్టీవీ ఈ కథన ప్రసార విషయంలో సంయమనం, జర్నలిజం బేసిక్స్, ఎథిక్స్ మరిచిపోయిందనే అభిప్రాయం జర్నలిస్టు సర్కిళ్లలోనే వినిపిస్తోంది…
- బీఆర్ఎస్ మరో వాదన ముందుకు తెస్తోంది… అదేమిటంటే..? అధికారపక్షంలోని అంతర్గత కుట్రలే ఈ వార్తా ప్రసారాలకు కారణమట… అదెలా..? సపోజ్, ఎవరో ఎవరినో టార్గెట్ చేసి, ఫలానా వార్త రాయి అనగానే… దాన్ని ప్రసారం చేస్తే, ఇక పాత్రికేయంలోని విజ్ఞత, విచక్షణ, వివేచన ఎక్కడ పోయినట్టు..? దొరికింది చాన్స్ అనుకుని బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా ప్రసారం చేస్తూ పండుగ చేసుకోవడాన్ని ఏమనాలి..?
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కేంద్ర సర్వీసు అధికారుల సంఘాలు ఈ వార్తా ప్రసారాల్ని ఖండించాయి… ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది… విచారణకు ఓ సిట్ వేసింది…
ఏకంగా ఓ లేడీ ఐఏఎస్- ఓ మంత్రికి నడుమ అక్రమ బంధం అనేది నీచమైన ప్రసారమే… దానికి ఆధారాలేమున్నాయని..! ఏం ఎస్టాబ్లిష్ చేశారని..! సరే, నోటీసులు ఇవ్వలేదు, పోలీసులు దూకుడు ప్రదర్శించారు అనే విమర్శలు కాసేపు పరిగణనలోకి తీసుకుందాం… కేసీయార్ హయాంలో ఏ జర్నలిస్టు మీదా కేసులు పెట్టలేదా..? కోదండరాం ఇంటి తలుపులు పగులగొట్టిన తీరు తెలియదా..?
మీడియా స్వేచ్ఛకు కూడా పరిమితులు ఉంటాయి… ఓ టైమ్ వస్తే మీడియాను కూడా ‘రాజ్యం’ బోనులో నిలబెడుతుంది అనేది ఈ మొత్తం ఎపిసోడ్‌లో వినిపించే పాఠం… చివరగా…

సగటు ఉద్యోగం చేసే మహిళ అర్ధరాత్రి వరకు ఆఫీస్లో పని చేసుకొని, రాత్రి ఇంటికి వెళ్లి, తన కుటుంబానికి ఒక అనుమానమనే జబ్బును అంటగట్టి బ్రతకాలా?
మన సగటు వర్కింగ్ విమెన్ దేశ అత్యున్నత పరీక్ష రాసి బ్యూరోక్రాట్ అయినా, డాక్టర్ అయినా, ట్రాఫిక్ కానిస్టేబుల్ అయినా… మీడియా పేరుతో, సోషల్ మీడియా వెకిలి చేష్టల పేరుతో ఈ సోకాల్డ్ సమాజం ఏవేవో కథలు అల్లితే… ఫలానా జాబ్ చేసి, ఇంటికి వచ్చి అలసిపోయిన మహిళ, ఆ అల్లబడిన కథలతో అనుమానాన్ని కూడా వెంట తీసుకొని వెళ్ళాలా? ఆ అనుమానంతో “ఆమె” కుటుంబం మానసిక వేదనకు గురి కావాలా?
- ఓ సగటు మహిళ వేసే ప్రశ్న ఏమిటంటే..,? మహిళలకు లేనిపోనివి అంటగట్టి పొందే రాక్షసానందాలు రేపు మీ ఇంట్లో ఉన్న సగటు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గానో, బ్యాంక్ మేనేజర్ గానో, ఏదో జాబ్ చేసుకునే మీ కన్న బిడ్డో, కోడలో, చెల్లో ఆమె బ్రతుకును కూడా ఇదే “కర్మ” కబళించదా?
ఒక ఇండిపెండెంట్ విమెన్ పట్ల కలంయములు వ్యక్తిత్వహనన క్రీడ ఆడుతుంటే… మీడియా కాబట్టి ‘టేక్ ఇట్ ఫర్ గ్రాంట్’ అవుతుందా..? నిజానికి ఎన్టీవీ ఎందుకీ కథనం విషయంలో ‘విచక్షణ’ కోల్పోయిందో అర్థం కాదు… ప్రొఫెషనల్ జాగ్రత్తల్లోనే ఉంటారు మరి..! సదరు సంస్థ జర్నలిస్టులు ఏదో కుట్రలో ఇరికించబడ్డారా..? వాళ్ల పట్ల సానుభూతి ఉంది, కానీ ఇతరత్రా పెయిడ్, మాలిషియస్ క్యాంపెయిన్ మీడియాతోపాటు వాళ్లనూ జతకట్టబడటం దురదృష్టకరమే..!!
జర్నలిస్టు కోణంలో... కటువుగా ఉన్నా ఒకటి మాత్రం నిజం... రాజకీయ నాయకులు, మీడియా సంఘాల ఖండనమండనల మాటెలా ఉన్నా... తెలంగాణలో సగటు మహిళా ఉద్యోగి మాత్రం ఈ కేసుల పరిణామాల్ని ఆహ్వానిస్తోంది... కావాలంటే ఓ తక్షణ సర్వే చేసి తెలుసుకొండి..!!
ఎన్టీవీ జర్నలిస్టులను రిమాండ్ చేసిన పోలీసులు పెట్టిన సెక్షన్లు… Sections 75, 78, 79, 351(1), 352, 61(2) and 238 of the BNS…, Section 67 of the IT Act, and Sections 3 and 4 of the Indecent Representation of Women (Prohibition) Act, 1986….. మేజిస్ట్రేటు ఎదుట హాజరు పరచబడిన రాత్రే ఆ జర్నలిస్టులకు బెయిల్ దొరికింది…
ఒక శివధర్ రెడ్డి శివధర్ రెడ్డిలాగే ఉంటాడు... ఒక సజ్జనార్ సజ్జనార్‌లాగే ఉంటాడు... అంతేగానీ, పోలీసులందరూ మీ ప్రభాకర్ రావులాగే ఉండాలని కోరుకుంటే ఎలా మిస్టర్ హరీష్ రావు అండ్ మిస్టర్ కేటీయార్..?
మహాన్యూస్ ఆఫీసు మీద జరిగిన ఈ దాడి మాటేమిటి బీఆర్ఎస్ లీడర్స్… ఏపీ పాలిటిక్స్‌లో భాగంగా సాక్షి సంపాదకుడి మీద వరుసగా కేసులు పెడుతుంటే ఎందరు జర్నలిస్టు సంఘాల నేతలు స్పందించారు..? అంతకుముందు జగన్ హయాంలో యెల్లో మీడియాపై వేధింపుల్ని ఎందరు ఖండించారు..?
Share this Article
