Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చమురుపై అమెరికా గ్రిప్… తద్వారా ప్రపంచంపై గ్రిప్… పార్ట్ 5

January 19, 2026 by M S R

.

( పొట్లూరి పార్థసారథి ) ….  డెల్టా ఫోర్స్ ఉపయోగించిన ఆయుధం ఏమిటి? మైక్రోవేవ్ జెనరేటర్? లేదా
EMP గన్? లేదా మరేదైనా కొత్త ఆయుధం?

చనిపోయిన వాళ్ళు చనిపోగా తీవ్ర గాయలతో బ్రతికి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఒక క్యూబా సెక్యూరిటీ గార్డ్ జరిగిన సంఘటనని ఇలా వివరించాడు……ఈ కధనాన్ని కరకాస్ లోని స్థానిక పత్రికలు, లోకల్ ఎలెక్ట్రానిక్ మీడియా వెల్లడించాయి.

Ads

మేము మొత్తం 80 మందిమి అధ్యక్ష భవనంలో కాపలా కాస్తున్నాము హఠాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది కానీ ఎమర్జెన్సీ పవర్ సప్లై ని ఆన్ చేయవద్దని ముందే ఆదేశాలు ఉండడం వలన చీకటిలోనే అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తగానే ఉన్నాం!

విద్యుత్ సరఫరా నిలిచిపోయిన 20 నిమిషాల తరువాత దూరంగా హెలికాప్టర్ ఎగురుతున్న శబ్దం వినపడింది. క్షణాలలోనే 100 మందికి పైగా పైనుండి కిందికి వస్తూనే కాల్పులు జరుపుతూ లోపలకి వచ్చేసారు.

వాళ్ళ దగ్గర చిన్న గన్స్ మాత్రమే ఉన్నాయి కానీ సెకనుకి 200 పైగా బులెట్స్ ఆగకుండా పేలుతూనే ఉన్నాయి కానీ మేము ఎదురుదాడి చేసేంత సమయం వాళ్ళు ఇవ్వలేదు.

ఒకపక్క కాల్పులు జరుపుతూనే ఇంకోపక్క మరొక విచిత్రమైన వెపన్ తో మా మీద దాడి చేశారు. కానీ ఆ వెపన్ ఏమిటో కనపడలేదు. విచిత్రమైన శబ్దం చేయడం, ఆ శబ్దం మా చెవులకి చేరేలోపునే ఎవరో చేతితో బలంగా గుద్దినట్లయి నోట్లో నుండి ముక్కు చెవుల నుండి రక్తం వచ్చి కింద పడిపోయాము.

So! డెల్టా ఫోర్స్ వాడిన ఆయుధం బహుశా షార్ట్ రేంజ్ మైక్రోవేవ్ గన్ అయిండవచ్చు లేదా షార్ట్ రేంజ్ EMP ( Electro Magnetic Pulse) గన్ అయిండవచ్చు!

మైక్రోవేవ్ జెనరేటర్ తో శత్రు సైన్యాన్ని ఒకేసారి పెద్ద సంఖ్యలో అచేతనం చేయగల ఆయుధాన్ని చైనా అయిదేళ్ల క్రితమే సైన్యంలో ప్రవేశపెట్టింది. అయితే అది యుద్ధ టాంక్ అంత సైజులో ఉంటుంది కానీ కంపాక్ట్ కాదు.

EMP (ఎలక్ట్రో మాగ్నేటిక్ పల్స్) గన్ R&D దశలో ఉందని చదవడమే కానీ ప్రయోగించే స్థితిలోకి వచ్చేసిందని ఆపరేషన్ అబసొల్యూట్ రిసోల్యూషన్ వలన తెలుస్తున్నది.

EMP అనేది భూగర్భ లేదా సముద్రగర్భంలో అణు పరీక్షలు జరిపినప్పుడు పేలుడు తరువాత వెలువడే ప్రకంపనలని ఎలక్ట్రో మాగ్నేటిక్ పల్స్ అంటారు. ఎలక్ట్రో మాగ్నేటిక్ పల్స్ వల్ల మనిషికి బాహ్యంగా ఎలాంటి గాయాలు కావు కానీ శరీరం లోపల కణజాలం నశించిపోతుంది. అదే ఆ ప్రదేశంలో ఎలాంటి ఎలెక్ట్రీకల్ లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటే అవి పనిచేయడం ఆపేస్తాయి.

EMP గన్ లో శుద్ధి చేసిన యురేనియం వాడతారు కాబట్టి చాలా కొద్దిమొత్తంలో రెడీయేషన్ విడుదల అవుతుంది కాబట్టి కంపాక్ట్ చేసి వాడడం సాధ్యం కాదని చదివాను కానీ సాధ్యమైనట్లున్నది. మొత్తానికి సానిక్ వెపన్ ని ఉపయోగించింది అమెరికా అని అంటున్నారు.
****

డెల్టా ఫోర్స్! ఎలైల్ కమాండో ఫోర్స్!

అతి ముఖ్యమైన, హై వాల్యూ టార్గెట్స్ ని కొట్టడానికి లేదా హై వాల్యూ మిషన్స్ కోసమే డెల్టా ఫోర్స్ ని ఏర్పాటు చేశారు. శిక్షణ కోసం ఎంపిక చేసేటప్పుడు ప్రతీ వెయ్యి మందిలో ఒకరు మాత్రమే డెల్టా ఫోర్స్ కమాండో శిక్షణకి అర్హత పొందుతారు.

ప్రత్యేక డ్రెస్ కోడ్ అంటూ ఏమి ఉండదు. ఐడెంటిటీ కార్డ్ కూడా ఉండదు. ఒకవేళ మిషన్లో పాల్గొన్నప్పుడు ఎవరైనా కమాండో చనిపోతే శత్రువుకు శవం దొరికినా ఎలాంటి ఆధారాలు దొరకవు. అలాగే చనిపోయిన కమాండో ఇంటికి వెళ్లి అమెరికన్ జెండాని కుటుంబ సభ్యుల చేతిలో పెట్టి శాల్యూట్ చేయడం లాంటి ఫార్మాలిటీస్ ఏమి ఉండవు.

1986 లో హాలివుడ్ సినిమా The Delta Fors సినిమా చూడండి డెల్టా ఫోర్స్ గురుంచి తెలియాలి అంటే! Chuck Norris ప్రధాన పాత్రలో రెండు డెల్టా ఫోర్స్ సినిమాలు రిలీజ్ అయ్యాయి అప్పట్లో.

ఇక EMP గురుంచి తెలుసుకోవాలి అంటే BROKEN ARROW సినిమా చూడండి. YES! EMP గురుంచి ఎలాంటి సినిమాటిక్గా చెప్పే ఎక్సట్రాలు ఉండవు, ఉన్నది ఉన్నట్లుగా చూపించాడు దర్శకుడు!

*******
ఇంతకీ జనరల్ జెవియర్ మార్కనో టబట CIA కి సహకరించాడు అని వెనిజులా సైన్యానికి ఎలా తెలిసింది?

చాలా సింపుల్!
అమెరికా మొబైల్ హాకింగ్ చేసి సంభాషణలు వింటుందని అమెరికన్ లేదా యూరోపియన్ మొబైల్స్ ని వాడరు వెనిజులా ప్రజలు.

వెనిజులా లో 80% చైనాకి చెందిన Huawie (హువావి) ఫోన్లనే వాడతారు! హువావే స్వంత ఆపరేటింగ్ సిస్టమ్ ని అభివృద్ధి చేసుకొని తన ఫోన్లలో వాడుతున్నది.

Hormony Os Next పేరుతొ గూగుల్ ఆండ్రాయిడ్ తో కానీ ఇతర గూగుల్ అప్లికేషన్స్ ని వాడకుండా స్వంతంగా డెవలప్ చేసి వాడుతున్నది హువావే! హువావే ఫోన్ల లో అన్నీ చైనాలో డిజైన్ చేసి తయారు చేసినవే ఉంటాయి. పశ్చిమ దేశాల సర్వర్స్, శాటిలైట్స్ తో సంబంధం లేకుండా హువావే స్వతంత్రంగా ఉంటుంది.

హువావే ఫోన్లని అమెరికన్ సాటిలైట్స్ గుర్తించలేవు! అదే ఐఫోన్లు అయితే సాటిలైట్స్ గుర్తిస్తాయి. నీకోలస్ మదురో అధ్యక్ష భవనంలోకి హువావే ఫోన్లు తప్ప వేరే ఏ దేశపు ఫోన్ల ని అనుమతించరు! జెనరల్ జెవియర్ సహాయకుడు ఐఫోన్ ఆన్ చేయగానే మూడు నిమిషాలలో డెల్టా ఫోర్స్ అధ్యక్ష్య భావనంలోకి వచ్చినట్లు అధికారులకి తెలపడంతో వెంటనే జెనరల్ జెవియర్ ని అరెస్ట్ చేశారు!

ఇప్పుడు CIA ముందు రెండు అప్షన్లు ఉన్నాయి. మొదటిది వదనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిని బెదిరించి జైలు నుండి విడిపించడం. రెండోది జెనరల్ జెవియర్ ని వదిలేయడం!

******

  • సో… వెస్ట్రన్ టెక్నాలజీ మీద ఆధారపడడం ఎంత ప్రమాదమో నీకోలాస్ ముదురో కిడ్నాప్ ఉదంతం చెప్తున్నది!చైనా అవుట్ అఫ్ బాక్స్! అమెరికా ఏమాత్రం ప్రభావం చూపలేదు!రష్యా ఇప్పుడిప్పుడే మైక్రోసాఫ్ట్ విండోస్ నుండి Astra Linux ఆపరేటింగ్ సిస్టమ్ కి మారుతున్నది!

    మరో ఆపరేటింగ్ సిస్టమ్ అయిన Red Os ని స్కూళ్లు, యూనివర్సిటీలలో తప్పనిసరి చేసాడు పుతిన్!

    2022 ఫిబ్రవరి 23 న పుతిన్ ఉక్రెయిన్ మీద స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ ని మెదలుపెట్టగానే మైక్రోసాఫ్ట్ రష్యాలో తన కార్యకలాపాలని ఆపివేసింది! మైక్రోసాఫ్ట్ కి సంబంధించి ఎలాంటి అప్గ్రేడ్స్ కానీ, సెక్యూరిటీ అప్ డేట్స్ కానీ రష్యాలో పనిచేయవు.

    *****
    ఇప్పటివరకూ CIA చేసిన కోవర్ట్ ఆపరేషన్స్ అన్నీ ఆయా దేశాలలోని కీలక వ్యక్తులు CIA కి సహకరించడం వల్లనే విజయవంతం కాగలిగాయి!

    ******
    స్టెల్త్ రాడార్ అయిన చైనా తయారీ JY-127 లో ఫ్రీక్వీన్సీ రాడార్ తో F-22,F35 లని డీటేక్ట్ చేయవచ్చు అని భ్రమలో ఉండవద్దు అని అమెరికా హెచ్చరిక చేసింది!

    ఇక రష్యాకి అయితే ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ విషయంలో ఇప్పటికి మాదే పై చేయి అని హెచ్చరిక చేసింది!

*****

వెనిజులా ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ నిల్వలు ఉన్న దేశం! ఇప్పటికీ కొత్త నిల్వలు ఉన్న ప్రదేశాలని కొనుగొనాల్సినవి చాలానే ఉన్నాయి.

వెనిజులా లో ఉన్న క్రూడ్ ఆయిల్ ని హెవీ క్రూడ్ ఆయిల్ అని పిలుస్తారు. హెవీ క్రూడ్ ఆయిల్ ని శుద్ధి చేయడం ( refine) చాలా క్లిష్టమైన ప్రక్రియ.

హెవీ క్రూడ్ హై విస్కాసిటీ, హై డేన్సిటీ, మలినాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పైప్ లో వేగంగా ప్రవహించలేదు! రిఫైనరి లోకి పంపింగ్ చేయాలన్నా కష్టమే! రిఫైనరిలోకి పంపే ముందు క్రాకింగ్, హైడ్రో ట్రీటింగ్ అనే ప్రక్రియల ద్వారా పలచన చేసి తరువాత రిఫైనరీలోకి పంపించి శుద్ధి చేస్తారు.

హెవీ క్రూడ్ ఆయిల్ లో లోహాలు (metals), గంధకం ( sulfur), నైట్రోజెన్ ల శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవికాక ఏ మాత్రం పనికిరాని మలినాలు ఎక్కువగా ఉంటాయి. ఏతావాతా లైట్ క్రూడ్ ఆయిల్ శుద్ధి చేసేదానికంటే హెవీ క్రూడ్ ఆయిల్ ను శుద్ధి చేయడానికి ఎక్కువ ఖర్చు, సమయం పడుతుంది.

So! అమెరికా ఈ తరహా క్రూడ్ ఆయిల్ ని తీసుకెళ్లి శుద్ధి చేసి వాడుకోదు! హెవీ క్రూడ్ ఆయిల్ ని శుద్ధి చేసే క్రమంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెనిజులాలోనే శుద్ధి చేసి ఇతర దేశాలకి అమ్ముకుంటుంది అమెరికా.

వెనిజులా దివంగత మాజీ అధ్యక్షుడు అయిన హుగో చావేజ్ హయాంలో అమెరికన్ ఆయిల్ సంస్థలు అయిన
EXXONMOBIL, ConocoPhillips, Chevron, లతో విభేదాలు రావడంతో ExxonMobil, ConocoPhillips సంస్థలు వెనిజులా నుండి వెళ్లిపోయాయి కానీ చేవరోన్ సంస్థ ఇంకా వెనిజులాలోనే ఉంది. Total, Stateoil, BP సంస్థలు వెనిజులాలో పనిచేయడానికి ఆసక్తి చూపడంలేదు.

So! ట్రంప్ మాత్రం పట్టుదలతో ఉన్నాడు OPEC దేశాలని దెబ్బ తీయడానికి! వెనిజులా కీ పాత వైభవం అంటే ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలని కంట్రోల్ చేసే స్థాయికి తీసుకురావడం అన్నమాట!

1960-61 లో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలని ఒకే గొడుగు కిందకి తీసుకోచ్చి OPEC ( Organization of Petroleum Exporting Countries) ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది వెనిజులా. ఫౌండింగ్ ఫాదర్ అఫ్ ఒపెక్ అని వెనిజులా కీ పేరు.

1999 లో మరిన్ని సంస్కరణలు తెచ్చి OPEC ని బలంగా తీర్చిదిద్దింది అప్పటి వెనిజులా అధ్యక్షుడు హుగో చావెజ్! క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతున్నపుడల్లా ఓపెక్ దేశాలు ఆయిల్ ఉత్పత్తిని తగ్గించి ధరలని అదుపులో పెట్టె విధానం తప్పనిసరిగా చేయాలని సూచించాడు చావెజ్!

సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్ దేశాలు వెనిజులా చెప్పినట్లుగా నడుచుకునేవి! 2017 లో ట్రంప్ వెనిజులా మీద ఆర్ధిక ఆంక్షలు విధించాడు మానవహక్కులు, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకి పాల్పడుతున్నాడు నీకోలాస్ మదురో అంటూ! అప్పటినుండి వెనిజులా పతనం మొదలయ్యింది!

So! వెనిజులా లో మళ్ళీ అమెరికన్ ఆయిల్ సంస్థలు పాగా వేసి క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచి ఒక బారేల్ ధర $50 డాలర్ల కంటే తక్కువకి తీసుకోచ్చి తద్వారా రష్యా, సౌదీ అరేబియాలని నష్టాలలోకి నెట్టాలని ప్లాన్!

ఒక బారెల్ క్రూడ్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు:

సౌదీ అరేబియా లైట్ క్రూడ్ : $15 నుండి $20 డాలర్ల మధ్య.

నార్త్ అమెరికా హెవీ క్రూడ్ :30 నుండి 45 డాలర్ల మధ్య ఉంటుంది.

ఇది 2017 నాటి డాటా. 2024 డాటా ప్రకారం బ్రేక్ ఈవెన్ $45 డాలర్లు గా ఉంది. ఈ నేపథ్యంలో వెనిజులాలో అమెరికన్ ఆయిల్ సంస్థలు కనుక మునపటిలా అంటే 2017 పూర్వం రోజుకి 3 మిలియన్ బారెళ్ల ఉత్పత్తికి పునరిద్దరిస్తే అది అమెరికాకి ఆయిల్ ప్రపంచం మీద ఆధిపత్యం వచ్చినట్లే!

2017 లో ట్రంప్ విధించిన ఆంక్షల వల్ల అప్పటివరకు రోజుకి 3 మిలియన్ బారెళ్ల ఉత్పత్తి ఉండగా ఒకే సారి అది ఒక మిలియన్ బారెళ్ల కి పడిపోయింది. ఇది సౌదీ అరేబియాకి అనుకూలంగా మారి బేరమాడే శక్తిని ఇచ్చింది! అమెరికా మాజీ అధ్యక్షుడు జో బిడెన్ సౌదీ పర్యటనకి వెళ్ళినప్పుడు విమానాశ్రయానికి జెడ్డా మేయర్ ని పంపించాడు సౌదీ రాజు స్వాగతం పలకడానికి! అదీ సౌదీకి దొరికిన అవకాశం! వెనిజులా మీద ఆంక్షలు విధించడం వల్లనే కదా సౌదీ అరేబియా కీ అడ్వాంటేజ్ అయి అవమానం జరిగింది?

ఇప్పుడు వెనిజులా అమెరికా చేతిలోకి వెళ్లడం ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం దొరికింది! గతంలో నా పోస్ట్ లో వివరంగా చెప్పాను.. జో బిడెన్ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా ఉన్న అంథోని బ్లైంకెన్ సౌదీ కీ వెళ్లి క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి పెంచమని దీనంగా వేడుకొన్న సంగతిని!

అంథోని బ్లైంకెన్ ఎంతలా దిగజారాడు అంటే నేను అమెరికా విదేశాంగ మంత్రిగా కాకుండా ఒక యూదు జాతీయుడుగా మిమ్మల్ని (అరబ్) అభ్యర్థిస్తున్నాను క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచమని అని సౌదీ రాజుని అడిగాడు!

2015 లోనే వెనిజులాని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని ఇల్యూమీనాటి నిర్ణయం తీసుకుంది. 2017 లో ట్రంప్ చేత ఆంక్షలు విధింపచేసింది. తరువాత వచ్చిన జో బిడెన్ చేత ఉక్రెయిన్ ని నాటోలో భాగస్వామిని చేయాలని చూసి, పుతిన్ ని ఉక్రెయిన్ ని కాపాడుకోవడంలో బిజీ చేసి, పుతిన్ ని అదే స్థితిలో ఉంచి వెనిజులా మీద ఎటాక్ చేసింది!

ఇప్పుడు ఆయిల్ ప్రపంచాన్ని శాసించే స్థితిలోకి వచ్చేసింది! ఇప్పటికే సౌదీఅరేబియా క్రూడ్ ఉత్పత్తిని తగ్గించింది డిమాండ్ ని కాపాడుకోవడం కోసం! కానీ లాభం ఉండదు. వచ్చే రోజుల్లో ఒక బారెల్ క్రూడ్ ధర ఎంత ఉండాలో అమెరికా శాసిస్తుంది!

ఈ ఇక్వేషన్ ని అర్ధం చేసుకోవాలి అంటే… ముందు ధరలు తగ్గించి అమ్మి మార్కెట్ లో సింహాభాగం షేర్ ని కాప్చర్ చేస్తుంది అమెరికా! దాంతో వెనిజులా తో ఆయిల్ ఒప్పందాలు చేసుకుంటాయి ఎక్కువ దేశాలు. ఒకసారి మార్కెట్ ని తన గుప్పిటలో పెట్టుకున్నాక తను ఆడింది ఆట పాడింది పాట!

ఇప్పటికే ఒక బారెల్ క్రూడ్ ధర $50 కి అమ్మవచ్చని ఊహగానాలు వెలువడుతుండగా క్రమంగా ఆయిల్ బాండ్ల లో పెట్టె పెట్టుబడులు తగ్గిపోయి బంగారం మీద పెట్టుబడులు పెరుగుతూ రావడం బంగారం ధర పెరుగుతూ ఉండడం మనం చూస్తున్నాము.
బంగారం ధర అందుబాటులో లేకపోవడంతో వెండి మీద పెట్టుబడులు ఎక్కువ అయిపోయి వెండి ధరలు ఆకాశాన్ని తాకడం మొదలయ్యింది!

ఈ ట్రెండ్ ఇలానే కొనసాగి 2035 నాటికి అంటే వచ్చే పదేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలలో 10% వ్యత్యాసం ఉన్నట్లుగా బంగారం వెండి ధరలు కూడా అదే రీతిలో ఉండబోతున్నాయి!

బంగారం తులం 1,80,000 కి చేరుకోవచ్చని అంచనా. అయితే రాబోయే పదేళ్లలో ఎప్పుడైనా జరగవచ్చు!

2025 అక్టోబర్ నెల వరకూ వెండి ధర సగటున 0.25% పెరుగుదల ఉండేది. కానీ హఠాత్తుగా 200% పెరగడానికి కారణం అమెరికా వెనిజులా ని స్వాదీనం చేసుకోబోతున్నది, అంతర్జాతీయ చమురు ధరలు తగ్గబోతున్నాయి అనే విషయం బయటికి రావడమే కారణం!

ఇంత అని లెక్క బయటికి రాలేదు కానీ యురోపు దేశాల సెంట్రల్ బాంకుల నుండి మొత్తం వెండి స్విస్ బ్యాంకులకి తరలించబడింది అమెరికా వెనిజులా ని స్వాదీనం చేసుకోగానే! బ్యాంకులు వెండిని తాకట్టుపెట్టుకొని అప్పులు ఇచ్చేస్తున్నాయి!

ప్రపంచం మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ ని నడిపేది ఇల్యూమీనాటి! వెండిని బంగారం కంటే విలువైనదిగా చేలామణి చేయగల శక్తి ఇల్యూమినాటికి ఉంది! ట్రంప్, జోబీడెన్ లాంటి పేర్లు బయటికి కనిపించేవి, వినిపించేవి.

ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నెషనల్ కోర్ట్ అఫ్ జస్టిస్ కి నిధులు ఆపేసింది అమెరికా! ఇక గ్లోబల్ పాలిటిక్స్ లో అంతర్జాతీయ ఒప్పందాలు, వాటి తాలూకు అర్బీట్రేషన్ల కి విలువ ఉండదు. నీ దేశం తాలూకు కేసు అంతర్జాతీయ న్యాయస్థానములో ఉందా? అయితే మెయింటనెన్స్ కింద ఇంత అని కట్టు లేకపోతే కోర్టు నడవదు మీ కేసు విచారణ జరగదు! మళ్ళీ న్యాయవాదుల ఫీజు అదనం! బాగుంది కదా వరల్డ్ ఆర్డర్?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గిల్ సొంత హైటెక్ వాటర్ ప్యూరిఫయర్… కోహ్లీ అత్యంత ఖరీదైన వాటర్…
  • నాటో కూటమి అటో ఇటో… జియోపాలిటిక్స్‌లో అమెరికా కొత్త ఆట….
  • సాహసమే కృష్ణ ఊపిరి..! తెలుగు రాజకీయాల్లో పెద్ద రచ్చ ఆనాడు..!!
  • చమురుపై అమెరికా గ్రిప్… తద్వారా ప్రపంచంపై గ్రిప్… పార్ట్ 5
  • మదురో భవనం సెట్ వేసి… అమెరికా ఎడారిలో నెల రిహార్సల్… పార్ట్-4 …
  • వెనెజులా కొంప ముంచిన చైనా… చేతులెత్తేసిన నాసి రాడార్లు… పార్ట్-3
  • S E A D …. వెనెజులాపై దాడికి ప్రయోగించిన వార్ టెక్నిక్… (పార్ట్-2)
  • 2026 జియోపాలిటిక్స్… కాలజ్ఞాని బాబ వంగ ముందే చెప్పింది… (పార్ట్-1)
  • నేలకొరిగిన తెలుగు సింహం… ఒకేరోజు మూడు సప్లిమెంట్లు ఇచ్చాం….
  • అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు… కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions