Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమెరికా ట్రేడ్ డీల్ – జియో పాలిటిక్స్ – చమురు- హైదరాబాద్ రియల్ ఎస్టేట్..!!

February 3, 2026 by M S R

.

రీసెంటుగా కొంతమంది విశ్లేషకులు, ప్రత్యేకించి జాతీయవాద యాక్టివిస్టులు అంచనా వేస్తున్నది ఏమిటంటే..? కొన్ని ముఖ్యాంశాలు…

1. ఇండియాపై సుంకాల విషయంలో ట్రంపు తుది నిర్ణయం తీసేసుకున్నాడు. తను చెప్పినట్టు వెనిజులా ఆయిల్ మనం కొంటాం… ట్రేడ్ డీల్ ప్రకటన నేడో రేపో ఖాయం…

Ads

2. ఇరాన్ మీద యుద్ధం ఉండదు, రక్తపాతరహితంగానే అక్కడ అధికార మార్పిడి జరుగుతుంది… యుద్దాన్ని చూపించి మెడలు వంచడం…

3. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కూడా ముగిసిపోతుంది, క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోతాయి… ఉక్రెయిన్ యుద్దం ముగిసిపోతే ఇక రష్యా చమురు కొనవద్దనే ట్రంప్ బెదిరింపులకు కూడా విలువ పడిపోతుంది…

4. చమురు, డాలర్, స్టాక్ మార్కెట్ అనిశ్చిత స్థితి వల్ల ఏర్పడిన బంగారం- వెండి ధరల ర్యాలీ ఆగిపోతుంది… ఆల్రెడీ పతనం ప్రారంభమైంది…

5. నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన మన బడ్జెట్ చాలావరకు అమెరికా కోణంలో సాగింది. దీని వల్ల మన దేశంలోకి మళ్లీ ఫారిన్ ఫండ్స్ తిరిగి వస్తాయి, ఈ సంవత్సరం కనీసం 500 బిలియన్ డాలర్లు వస్తాయి, అంటే వాపస్ వెళ్లిపోయిన దానికన్నా 50% ఎక్కువ తిరిగి వస్తాయి…

6. మన పబ్లిక్ సెక్టార్లో డిజిన్వెస్ట్‌మెంట్‌కు, ప్రైవేట్ సంస్థల్లో ఆఫర్ ఫర్ సేల్‌కు రంగం రెడీ…

7. REITs నుండి వచ్చే పెట్టుబడులు చాలా మటుకు హైదరాబాద్ పెరిఫరల్స్‌లో వెళ్లిపోతాయి, రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది, మెటల్స్ ఇక నుండి ఈ స్థాయిలో పెరగవు…

8. రేపటి నుండి అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ లాంటి సంస్థలు మన దేశానికి పాజిటివ్ రేటింగ్ ఇస్తారు…  జిడిపి గ్రోత్ ఫోర్‌కాస్ట్‌లో రేటింగ్ పెంచేస్తారు … స్టాక్ మార్కెట్ పరుగులు తీయబోతోంది…



చాలావరకు రియాలిటీ కూడా ఇదే… హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు కూడా అనుకూల స్థితే కనిపిస్తోంది… పాయింట్ల వారీగా ఓసారి పరిశీలిస్తే…

అమెరికాతో ట్రేడ్ డీల్ ప్రకటన జరిగిపోయింది, సాక్షాత్తూ ట్రంపే ప్రకటించాడు… అపరాధ సుంకాల్లేవు ఇకపై… సుంకాలు కూడా 18 శాతానికి తగ్గుదల… వెనిజులా నుంచి చమురు ఎలాగూ కొంటాం, అక్కడ మన బావులు- మన ఒప్పందాలున్నాయి, తవ్వుకుంటాం… కొత్త ప్రభుత్వం కూడా పాజిటివ్‌గా ఉంది…

ఒకసారి రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతే ఇక రష్యా చమురు కొనుగోలు ఆంక్షలకు పెద్ద వాల్యూ ఉండదు, వేచి చూడాలి, అబుదాబిలో యుద్ధవిరమణ చర్చలు రేపో ఎల్లుండో స్టార్టవుతాయి… యుద్ధం ముగింపు దశకు రావడంతో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు $50 – $55 స్థాయికి పడిపోతాయని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి…

ఇరాన్‌లో అంతర్గత అశాంతి పెరగడం, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం వల్ల అక్కడ అధికార మార్పిడి దిశగా అడుగులు పడుతున్నాయి… అయితే ఇది పూర్తిగా “రక్తరహితంగా” జరుగుతుందా అనేది ఇంకా వేచి చూడాలి, కానీ అమెరికా ప్రత్యక్ష యుద్ధం కంటే పరోక్షంగా వ్యవస్థను మార్చడానికే మొగ్గు చూపుతోంది…

అనిశ్చితి తగ్గుతుండటంతో బంగారం, వెండి వంటి సేఫ్-హెవెన్ అసెట్స్ నుండి పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్లకు మళ్లుతున్నాయి… నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026 స్పష్టంగా గ్లోబల్ సప్లై చైన్, అమెరికా కంపెనీలను ఆకర్షించేలా ఉంది (ఉదాహరణకు డేటా సెంటర్లకు టాక్స్ హాలిడే)…

FPI ఇన్ ఫ్లోస్… గతేడాది బయటకు వెళ్లిన నిధులు ఇప్పుడు రెట్టింపు వేగంతో తిరిగి వస్తున్నాయి… 500 బిలియన్ డాలర్ల లక్ష్యం ప్రతిష్టాత్మకమైనదే అయినా, ప్రస్తుత ‘చైనా + 1’ వ్యూహం వల్ల భారత్‌కు భారీగా నిధులు వచ్చే అవకాశం ఉంది… ఇప్పటికే IMF భారత్ వృద్ధి రేటును 7.3%కి పెంచింది… మరిన్ని సానుకూల రేటింగ్స్ వచ్చే సూచనలు స్పష్టంగా ఉన్నాయి…

డిజ్ ఇన్వెస్ట్మెంట్…: ప్రభుత్వ బ్యాంకుల్లో (UCO, Bank of Maharashtra), LICలో వాటాల విక్రయానికి (OFS) ప్రభుత్వం సిద్ధమైంది…. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో REITs (Real Estate Investment Trusts) పెట్టుబడులు పెరుగుతున్నాయి… ఇది రాష్ట్రవ్యాప్తంగా రిఫ్లెక్టవుతుందా లేదా చూడాలి…

జియోపాలిటిక్స్‌కూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కూ లింక్ ఏమిటని ఆశ్చర్యంగా ఉందా..? అవును, అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానితమే... కార్యకారణ సంబంధాలు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • స్లోగా మింగేస్తున్న ‘డిజిటల్ స్లో పాయిజన్’… చికిత్స లేని అడిక్షన్…
  • గుంజి గుంజి… వేదికపైనే పరమ వికారం… సాహిత్యమా..? రోత పైత్యమా..?
  • అమెరికా ట్రేడ్ డీల్ – జియో పాలిటిక్స్ – చమురు- హైదరాబాద్ రియల్ ఎస్టేట్..!!
  • ట్రంపు తనే దిగొచ్చాడా..? దింపబడ్డాడా…? ఎందుకు..? ఎలా..? ఏమిటి..?
  • వెండితో బహుపరాక్..! ‘ఫ్యూచర్ ఆప్షన్స్’ కూడా పడిపోతున్నయ్..!!
  • అయోధ్య రామమందిర భవ్య నిర్మాణం ఇంకా ‘పూర్తి కాలేదు’..!!
  • కోటా యూనివర్సిటీలో కర్మకాండల కోర్సు..! పట్టభద్ర పంతుళ్లు..!!
  • పొలిటికల్ పంకిలంలోకి… కేంద్ర సర్వీసు అధికారులూ లాగబడుతున్నారు..!!
  • మృత్యువును ఎదిరిస్తూ… 11 రోజులు… ఓడ చుక్కానిపై వలస సాహసం..!!
  • భారీ దాడులతో పాకిస్థాన్ విలవిల…! ఎందుకు బెలూచిస్థాన్ కీలకం..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions