Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ సయామీ బంధం తెలిసీ… కాళేశ్వరాన్ని సీబీఐలో ఎందుకు ముంచినట్టు..!!

February 6, 2026 by M S R

.

ఠాట్, నాన్సెన్స్… వాటీజ్ దిస్… కాళేశ్వరం కేసు సీబీఐకి ఇచ్చి ఆరు నెలలైంది… ఏదీ యాక్షన్..? ముందుగా కేసీయార్, కేటీయార్, హరీష్‌రావులను అరెస్టు చేసి, అప్పుడు వోట్లడగండి… బీజేపీ-బీఆర్ఎస్ సయామీ కవలలు, వీణ-వాణి టైపు… లోకసభ ఎన్నికల్లోనూ బీజేపీకి బీఆర్ఎస్ అవయవదానం చేసింది… వాటి శరీరాలే వేరు కానీ తలల ఒక్కటే … ఫార్ములా వన్ కేసులో ఐఏఎస్ ప్రాసిక్యూషన్‌కు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు..? ఏందిది..? ఆయ్ఁ …

ఇదే కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణ… వీణ-వాణి, సయామీ కవలలు, అవయవదానం వంటి కొత్త పదాలతో పోలికలు కాస్త ఆసక్తికరంగా ఉన్నా…. బీజేపీ-బీఆర్ఎస్ రహస్య దోస్తీపై తెలంగాణ సమాజానికి స్పష్టమైన అవగాహన ఉన్నా… రేవంత్ రెడ్డిని కూడా వేలెత్తి చూపే ప్రశ్నలూ ఉన్నాయి…

Ads

లోకసభ ఎన్నికల మాటేమిటో గానీ… మొన్నటి జుబ్లీ హిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు కోసం బీజేపీ ఎంతగా సైలెంట్ మోడ్‌లోకి, ఏరోప్లేన్ మోడ్‌లోకి ఎలా వెళ్లిపోయిందో తెలంగాణ సమాజం కళ్లారా చూసింది… ఐనా ఓ దశలో విలీనం ప్రతిపాదనల దాకా వెళ్లాయి కదా ఆ రెండు పార్టీలు… ఇంకా పెద్దగా దాపరికం ఏముంది..? ఆ గుప్త దాంపత్యం బహిరంగమయ్యాక..!!

ఇక రేవంత్ రెడ్డి చెప్పాల్సింది ఏమిటంటే..? లోకసభ ఎన్నికల నుంచీ బీజేపీ- బీఆర్ఎస్ గుప్తస్నేహం, అవయవదానం తెలుసు కదా నీకు..? మరెందుకు కేంద్రంలోని బీజేపీకి, అనగా సీబీఐకి అంతటి సీరియస్ కాళేశ్వరం కేసు అప్పగించినట్టు..? అంటే కేసును అటకెక్కిస్తారని తెలిసీ సీబీఐకి అప్పగించడం అంటే… కేసీయార్‌ను శిక్షించకూడదనే భావనే కదా…

అందుకే కదా, ఫామ్ హౌజులో బందీ అయ్యాడు, ఇక నేను శిక్షించేది ఏముంది అన్నావు ఆమధ్యలో… బహుశా అమిత్ షా, మోడీ కూడా పాపం, అదే అనుకున్నారేమో… ఎంతైనా వాళ్ల దోస్తానా వేరు కదా… ఫార్ములా వన్ కేసులో ఐఏఎస్ ప్రాసిక్యూషన్‌కు అనుమతించడం లేదు అంటున్నావు కదా… మరి కేటీయార్ మీద యాక్షన్‌కు గవర్నరే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు కదా… మరి ఈ ఇన్‌యాక్షన్ ఏమిటి పాలకా..?

రేవంత్ రెడ్డి

ఇవేనా..? విద్యుత్తు ప్లాంట్లు, కొనుగోళ్ల అక్రమాల మీద ఓ కమిషన్ వేశావు, అది రిపోర్ట్ ఇచ్చింది… అదేమైంది..? గొర్ల స్కీమ్ అక్రమాలు, రైస్ మిల్లర్ల యవ్వారాలు… ఇలా ఎన్ని లేవు..? ఒక్క ఇష్యూలోనైనా బీఆర్ఎస్ పెద్దలను ఫిక్స్ చేశావా..? లేదు కదా…! చివరకు ఫోన్ ట్యాపింగు దర్యాప్తు కూడా ఓ పే-ద్ద సాగదీత… ట్యాపింగుతో ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో అప్రూవర్‌గా మారిన ఓ ఐఏఎస్ అన్నీ చెప్పేశాడట కదా… మరెందుకు ఇంకా ఫిక్స్ చేయడం లేదు బాధ్యులను..?

అందుకే… పాపం, కేసీయార్ తన పాపాలు తనే అనుభవిస్తాడు, నేనయితే క్షమించేస్తున్నాను అనుకుంటే, అదే బలంగా ఫిక్సయితే అలాగే వదిలెయ్… అలాంటప్పుడు ఇక మీరేం చేస్తున్నారని బీజేపీని అడగొద్దు… ఆడిపోసుకోవద్దు నాయకా… అసలే తెలంగాణ బీజేపీలో కేసీయార్ అనుంగు మిత్రులు బోలెడు మంది… పింకూ, కాషాయం అర్జెంటుగా కలగలిసిపోవాలని కాంక్షించేవాళ్లు హర్టవుతారు, ఫీలవుతారు..! అర్థం చేసుకోవూ..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ సయామీ బంధం తెలిసీ… కాళేశ్వరాన్ని సీబీఐలో ఎందుకు ముంచినట్టు..!!
  • వాషింగ్టన్ పోస్ట్ ‘ప్రమాద ఘంటికలు’ – ప్రపంచ మీడియాకు హెచ్చరిక
  • జనంలోకి రాడు… ఇల్లు కదలడు… అజ్ఞాతం వీడని ‘జాతిపిత’…
  • పాలకుల తెలివిడి- భవిష్యత్తు తరాలకు భరోసా… అదీ ఈ దేశపు కథ…
  • మోడీపై లోకసభలోనే భౌతిక దాడికి విపక్షం స్కెచ్..? ఓ విశ్లేషణ..!!
  • పాత ఆర్మీ బాస్ నరవాణే పుస్తకం- కొన్ని కటువైన నిష్ఠుర నిజాలు…
  • గుంజి గుంజి… వాడు కాదు, వాడి నిర్మాత- దర్శకులే అసలు వైరసులు..!!
  • చైనాలో కొందరు కీలక సైన్యాధికారులు మాయం… ఏం జరుగుతోంది…
  • ఏ గాయిగత్తరకు చాన్సివ్వకుండా… మేడారం తిరుగువారంతో పరిపూర్ణం…
  • అందరూ ఈ అందమైన ఆడదెయ్యం ప్రేమలో పడిపోతున్నారు… ఎవరామె..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions