.
ముందుగా ఓ కఠిన నిజం… ప్రపంచంలో ఏ జాతికీ జాతిపిత, జాతిసుత, జాతిపుత్రి, జాతిసతి ఉండరు… ఏ జాతి ఐనా సరే, పరిణామ క్రమంలో కాలగమనంలో ఉద్భవించేదే… జాతికి సృష్టికర్తలు ఉండరు… ఇది శాస్త్రీయ వివరణ…
మరి తెలంగాణలో ఈ జాతిపిత రచ్చ ఏమిటి..? ఏమీలేదు… కావాలని ఓ మనిషిని మహోన్నతుడిగా చిత్రించడం… నిజంగా జాతి అంత అభిమానిస్తే, పూజిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో, లోకసభ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో అదే జాతిజనం ఎందుకు అడ్డంగా తిరస్కరించారు..? అంటే నువ్వు జాతిపితవు కావని జాతి స్పష్టంగానే చెప్పినట్టు కాదా..?
Ads
పైగా జాతి కుర్చీ ఎక్కిస్తే… ఆ జాతి యావత్తూ హాహాశ్చర్యపోయేలా, ఏవగించుకునేలా అనేకానేక అక్రమాలతో జాతిని మోసగించింది ఎవరు..? జాతిజనంలోకి రాని వ్యక్తి జాతిపిత అవుతాడా..? అజ్ఞాతంలో బందీలా బతికే వ్యక్తి జాతిపిత అవుతాడా..? మరీ ఆ సోకాల్డ్ జాతిపిత సొంత మీడియా ‘‘సమస్త ప్రపంచ జాతిపితల్లోకెల్లా మా బాసే అగ్రశ్రేణి జాతిపిత’’ అనే తరహాలో భుజకీర్తులు తొడుగుతోంది, భజకీర్తనలు పాడుతోంది…
కొందరైతే కేసీయార్ జాతిపిత కాదనడం తెలంగాణ అస్థిత్వానికే అవమానం అంటున్నారు… ఇది మరీ పరాకాష్ట… దాని గురించిన వివరణ పదే పదే పునరుక్తులు అనవసరం… నిజానికి అసలు అంతటి గాంధీని జాతిపిత, బాపు అనడం మీదే జాతీయ స్థాయిలో బోెలెడు అభ్యంతరాలు ఉన్నాయి…
…… ఇదుగో ఇన్నిరకాల చర్చలు, రచ్చలు… నాయకుల ప్రసంగాల్లోనూ ఖండనమండనలు… ఓ మిత్రుడు చేసిన వ్యాఖ్య ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్… ‘‘సొంత నెత్తుటి వారసులకే సరైన పిత కాలేని ఒక పాత్ర, జాతిపిత ఎలా అవుతుంది…’’
వివరాల్లోకి వెళ్తే… ముందుగా సొంత బిడ్డ… తెలంగాణ సంప్రదాయంలో తల్లిదండ్రులైనా, సోదరులైనా ఆడపిల్ల కాళ్లు మొక్కుతారు… అది పుట్టింట్లో తనకు లభించే గౌరవం… కానీ ఈ జాతిపిత ఏం చేశాడు..? ఆమె అత్తింటి ఫోన్లనూ, అందులోనూ అల్లుడి ఫోన్లనూ ట్యాప్ చేశాడు… అవమానకరంగా కుటుంబం నుంచి, పార్టీ నుంచి పంపించేశాడు…
ఎవరో కాదు, ఆమే స్వయంగా చెబుతోంది… ఆ జాతిపిత కుటుంబాన్ని, పార్టీని వదిలేసి, సొంత బాటలో నడుస్తోంది… సో, సొంత నెత్తుటి వారసురాలికే సమర్థ పిత, సరైన పిత కాలేకపోవడం..! హరీష్ రావు, సంతోష్ రావులను కాసేపు పక్కన పెట్టేస్తే… నెత్తుటి మగవారుసుడు కేటీయార్…

ఏళ్లపాటు పార్టీని, ప్రభుత్వాన్ని, ఆస్తిపాస్తులను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు… తనే యాక్టింగ్ సీఎం… తను చెప్పిందే శాసనం… మగ శివగామి… ఇక రేపో మాపో అధికారపగ్గాలు అధికారికంగానే అప్పగిస్తారని పదే పదే అనుకూల మీడియాలో ప్రచారాలు, కథనాలు… చివరకు అంతటి జాతిపితే చెప్పుకోవాల్సి వచ్చింది… నాకేమైంది..? ఆరోగ్యంగానే ఉన్నాను… నేనే పాలిస్తాను అని… కానీ కేటీయార్‌ను కంట్రోల్ చేయగలిగాడా..? లేదు..!!
ఆమధ్య అసెంబ్లీలో ఓ సీన్… ఎమ్మెల్యేగా కొనసాగాలీ అంటే అటెండెన్స్ వేసుకోవాలి కాబట్టి, అజ్ఞాతం వీడి సభకు వచ్చాడు కేసీయార్… సభానాయకుడు రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కేసీయార్ కుర్చీ వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు… కేసీయార్ లేచి నిలబడి సాదరంగా, హుందాగా స్వీకరించాడు… అదీ మర్యాదపూర్వక స్పందనే… నాయకుడు లేచి నిలబడగానే బీఆర్ఎస్ సభ్యులందరూ లేచి నిలబడ్డారు… అదీ తమ నేతకు ఇచ్చే గౌరవం…
లేవకుండా అలాగే కుర్చీలో కూర్చున్నది మాత్రం కేటీయార్..! అది పితకు, జాతిపితకు, ఆ స్థానానికి గౌరవమేనా..? చెప్పుకుంటే ఇలాంటివి ఎన్నో… సో, నెత్తుటి వారసత్వానికే సుపిత కాలేని ఓ పాత్ర జాతికే పిత అనిపించుకోగలడా..? ఇదీ ప్రశ్న..!!
చివరగా... సినిమా హీరోల వీరాభిమానులు సుప్రీం స్టార్, సూపర్ స్టార్, బర్నింగ్ స్టార్, బ్లాస్టింగ్ స్టార్, మెగా స్టార్, ఒమెగా స్టార్ అంటూ రకరకాల బిరుదులు ఇచ్చుకుని జైకొడుతుంటారు తమ హీరోలకు... అభిమాన ప్రకటన- ప్రదర్శన... ఎస్, జాతిపిత అనే పేరు కూడా భిన్నమేమీ కాదు..!!
Share this Article