.
కటువుగా ఉన్న ఓ చేదు నిజం…. దేశహితం, జాతిహితం వంటి పదాలకు పూర్తి విరుద్ధమైన వ్యతిరేక పదం మమతా బెనర్జీ..! అక్రమ వలసదార్ల వోట్ల బ్యాంకు కోసం, రాజకీయం కోసం ఆమె ఏమైనా చేయగలదు… బోర్డర్ ఫెన్సింగ్‌కు అడ్డంకుల దగ్గర నుంచి సర్ ప్రక్రియకు విఘాతం దాకా…
నేను సుప్రీంకోర్టు దాకా వెళ్లి పోరాడాను అనే ఓ ఫేక్ ఇమేజ్, డొల్ల ప్రాపగాండా కోసం లాయర్‌గా సుప్రీంలో ప్రత్యక్షమైంది… అన్నీ గమనిస్తున్న సుప్రీంకోర్టు సింపుల్‌గా, స్ట్రెయిట్‌గా ఆమె ‘ఆటలకు’ చెక్ పెట్టింది… సర్ ప్రక్రియ, వోటర్ల జాబితాల శుద్ధీకరణ ఆగకూడదని, అడ్డంకులు వద్దని తన భాషలో గట్టిగానే చెప్పింది…
Ads
అంతేకాదు, అన్ని రాష్ట్రాలూ ఇది గమనించాలని కూడా చెప్పింది… అంటే, పరోక్షంగా స్టాలిన్ ఎట్సెట్రా నేతలకు కూడా హితవు చెప్పినట్టయింది… వోట్ చోరీ అనీ, ఇంకేదేదో రచ్చ చేయబోయిన రాహుల్ గాంధీ అండ్ కో తత్వం బోధపడి సైలెంట్ అయిపోయింది…
సర్ ప్రక్రియ మన ప్రజాస్వామ్యానికి ఎంత అవసరమో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది... సర్ ప్రక్రియను జాతివిరుద్ధంగా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నవేళ ఇది అవసరమైన తీర్పు...
నిజానికి పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలంటేనే ఒక ప్రహసనం… అక్కడ రిగ్గింగులు, హింస ఎంత సహజమో.. ఓటర్ల జాబితాలో ‘అక్రమ’ చేరికలు కూడా అంతకంటే సహజం… అయితే, ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ మమతా బెనర్జీ నిద్ర పాడు చేస్తోంది… దీన్ని అడ్డుకోవడానికి ఆమె వేసిన ఎత్తుగడలకు సుప్రీం కోర్టు ఇలా గట్టి చెక్ పెట్టింది…
ప్రజాస్వామ్యం ముసుగులో వోట్ బ్యాంక్ రాజకీయం? ఎస్‌ఐఆర్ ప్రక్రియ మొదలవ్వగానే మమత మాత్రమే కాదు, దొంగ వోట్లు- అనర్హమైన వోట్లతో పబ్బం గడుపుకునే పార్టీల నేతలంతా గొంతు చించుకుంటున్నారు… “ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది”, “ఓటర్లను తొలగిస్తున్నారు” అంటూ పెద్ద ఎత్తున యాగీ చేస్తున్నారు… కానీ ఇక్కడ అసలు ప్రశ్న అది కాదు…
-
అక్రమంగా ఓటరు కార్డులు పొందిన వారిని జాబితాల నుంచి తొలగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమా?
-
వలసదారుల అండతో నిర్మించుకున్న వోట్ బ్యాంక్ కూలిపోతుందనే భయమే దీదీని ఇంతలా వణికిస్తోందా?
సుప్రీం కోర్టు హితవు ఈ అంశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మమత ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తోంది… కోర్టు మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి…
“ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఎవరూ అడ్డుకోలేరు… విఘాతం కలిగిస్తే ఊరుకోం…”
ఇది కేవలం వ్యాఖ్య కాదు, ఒక స్ట్రాంగ్ వార్నింగ్… రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ ప్రక్రియలను అడ్డుకోవడం సాధ్యం కాదని సుప్రీం కుండబద్దలు కొట్టింది… ముఖ్యంగా అధికారులపై జరుగుతున్న దాడులు, బెదిరింపుల నేపథ్యంలో… రాష్ట్ర డీజీపీ నుంచి వ్యక్తిగత అఫిడవిట్ కోరడం అంటే, బెంగాల్ యంత్రాంగంపై కోర్టుకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు…
అదే సమయంలో భారీగా అర్హులైన వోటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించకుండా జాగ్రత్తలు అవసరమనీ, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన యంత్రాంగంతో సహకరిచాలని చెప్పింది సుప్రీం… ఎస్, రాజకీయ పార్టీలకు ఎన్నికల జాబితాలు ప్రైవేట్ ఆస్తి కాదు… వోట్ బ్యాంక్ రాజకీయాల కోసం దేశ భద్రతను, ప్రజాస్వామ్య విలువలను పణంగా పెట్టలేం… మమతా బెనర్జీ వేసిన ‘రాజకీయ స్క్రిప్ట్’ను సుప్రీం కోర్టు చింపేసింది…
సో, ఎంత పెద్ద నేతలైనా రాజ్యాంగం ముందు తలవంచాల్సిందే… ఎస్‌ఐఆర్ ఆగదు… ప్రజాస్వామ్య శుద్ధి ప్రక్రియ ఆగదు…
- అన్నట్టు… గుర్తుందా..? ఆమె అక్రమాస్తుల లావాదేవీల అడ్డాగా మారిన ఐప్యాక్ ఆఫీసుపై ఈడీ దాడులు చేస్తే… ఆమ స్వయంగా తన పోలీస్ అధికారులతో సహా వెళ్లి, కొన్ని ఫైళ్లు పట్టుకొచ్చుకుంది… అందులో మా రాజకీయ వ్యూహాలు, రహస్యాలున్నాయి అని ఏవో కథలు చెప్పింది… సర్ ప్రక్రియను ఎలా అడ్డుకోవాలనే తల తిక్క వ్యూహాలు కూడా ఆ ఫైళ్లలోనే ఉన్నాయా దీదీ..?
- అవును సర్, లాయర్లకు ఓ డ్రెస్ కోడ్ ఉంటుంది కదా, మరి ఆమె ఓ నల్ల కండువా కప్పుకుని వచ్చింది… అది వోకేనా సర్..?
Share this Article