Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అవిశ్వాసం, ఆ పుస్తకం… ఈ మొత్తం ఎపిసోడ్‌లో అసలు తప్పు ఎవరిది..?

February 12, 2026 by M S R

.

  • లోకసభ స్పీకర్ మీద అవిశ్వాసం అనేది కొత్తేమీ కాదు… ప్రస్తుత రాహుల్ గాంధీ పోకడలను గమనిస్తే అస్సలు అదేమీ విశేషమే కాదు… కానీ అవిశ్వాసం ఎందుకు..?

తనను లోకసభలో మాట్లానివ్వలేదట… అది ప్రజాస్వామ్యానికి ద్రోహం అట, అందుకే స్పీకర్ పక్షపాతానికి నిరసన అట…

  • అవకాశం ఇస్తే సభలో ఏం మాట్లాడతాడు…?

మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే ఏదో పుస్తకం (Four Stars of Destiny) రాశాడట, అందులో కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ మీద ఉదాసీనత చూపించిందట, కడిగేయాలని అనుకున్నాడు…

Ads

  • అదేమో పార్లమెంటు బయటే మాట్లాడాడు, ఆ పుస్తకం ప్రతి చూపించాడు, ఇంకా కొత్తగా ఏం మాట్లాడతాడు..?

ఏమో, స్పీకర్ మాత్రం కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల మహిళా సభ్యుల ధోరణి సందేహాస్పదంగా ఉందీ అని ప్రకటించాడు.,. ప్రస్తుత రాహుల్ మనస్తత్వాన్ని బట్టి అది నిజమే కాబోలు అనుకోవాలి… పెప్పర్ స్ప్రేను చూశాం కదా, అప్పటి తెలంగాణ బిల్లు సందర్భంలో లగడపాటి అనే ఓ ఎంపీ చర్యను…

  • ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వకపోతే అవిశ్వసమా..? కానీ తను ప్రధానిని కూడా వద్దన్నాడు కదా…

అవన్నీ మాకు అక్కర్లేదు,, స్పీకర్ మీద అవిశ్వాసం పేరిట ప్రభుత్వాన్ని కబడ్డీ ఆడుకోవడం ఉద్దేశం…

  • మరి అధికార పక్షం ఊరుకుంటుందా..? వాళ్లూ అదే కబడ్డీ ఆడుకుంటారు కదా…

అదే కదా, ప్రస్తుత ప్రతిపక్ష డొల్లతనం… అవిశ్వాసం గెలిచేది లేదు, ఒరిగేదీ లేదు, అందరికీ తెలుసు…

  • ఇవన్నీ సరే, ఇంతకీ ఆ పుస్తకం రాహుల్ గాంధీకి దగ్గరకు ఎలా వచ్చింది..? రచయిత అధికారికంగా పబ్లిష్ కాలేదు అంటున్నాడు, పబ్లిషర్స్ కూడా అదే అంటున్నారు…

అదే కదా అసలు విశేషం… మాజీ ఆర్మీ చీఫ్ పుస్తకం పబ్లిష్ కాలేదని అంటున్నాడు కదా, మరి తనే రెండేళ్ల క్రితం… బుక్ అందుబాటులో ఉంది అని ఎలా ట్వీటాడు..? రాహుల్ గాంధీ చెప్పేదీ అదే కదా…

నరవాణే

  • కానీ పెంగ్విన్ వాడు, అధికారికంగా బుక్ పబ్లిష్ చేయలేదు, అందుబాటులో లేదు అంటాడేమిటి..?

అదే కదా అసలు దరిద్రం… అమెజాన్ నుంచి ఆ లింక్ డిలిట్ చేశారు… అబ్బే, అవి ప్రిరిలీజ్, ప్రిఆర్డర్ బుక్స్ అనీ,  అడ్వాన్స్ కాపీలు అనీ, రివ్యూ కాపీలు అని నానా గందరగోళపు చెత్తా వాదనలు వినిపిస్తున్నారు… నరవాణే కూడా దాన్నే చూపిస్తున్నాడు… అసలు అనుమతి లేని పుస్తకాన్ని రివ్యూలకు ఎలా పంపిస్తారు, ఎలా మార్కెట్‌లో పెడతారు..? పెంగ్విన్ తప్పు చాలా ఉంది…

  • అదెలా..? అసలు అనుమతి లేకుండా పుస్తకం ఎలా బయటికి వచ్చింది..? డిజిటల్ పీడీఎఫ్ ఎలా దొరుకుతోంది..? అసలు ఎవరు కుట్రధారులు..?

ఇంకెవరు… మొత్తం పరిశీలిస్తే… అసలు అనైతిక రచయిత నరవాణే మాత్రమే… పుస్తకంలో తన వ్యాఖ్యలు ఎంత అనైతికంగా ఉన్నాయో… ఈరోజుకూ తన సమర్థన, పోకడ అలాగే ఉంది… ఇలాంటి వ్యక్తి ఇంత పెద్ద దేశానికి ఆర్మీ చీఫ్‌గా పనిచేశాడంటేనే ఓ విషాదం…

  • ఇదంతా సరే, ఒక పుస్తకానికి ముందస్తు పర్మిషన్ తీసుకోవాలనే సిస్టం ఏమీ లేదు కదా ఇండియాలో… ఎవరైనా ఏమైనా రాయొచ్చు కదా…

కాదు, కీలక స్థానాల్లో, అదీ ఆర్మీ వంటి అధికారిక రహస్యాల చట్టం (ఇక్కడ వ్యక్తిగత భావప్రకటన స్వేచ్ఛ వర్తించదు) పరిధిలోకి వచ్చే వ్యక్తులు ఏదిబడితే అది రాయడానికి వీల్లేదు, ఆ పుస్తకానికి కేంద్ర ప్రభుత్వం ఈరోజుకూ అనుమతి ఇవ్వలేదు…

  • ఓహో, అందుకే నరవాణే తనే కావాలనే ఈ పుస్తకాన్ని రాహుల్‌కు చేరేలా చేసి, రచ్చ చేస్తున్నాడా..? ఎలాగూ ఈ ప్రభుత్వం అనుమతి ఇవ్వదు అనుకుని చేశాడేమో…

నరవాణే

ఎస్, జరుగుతున్నవన్నీ చూస్తుంటే, అదే అనిపిస్తోంది… మొత్తం స్థూలంగా పరిశీలిస్తే… ఖచ్చితంగా అది నరవాణే తప్పే… రాహుల్ తప్పేమీ లేదు, ప్రభుత్వం ఎక్కడ దొరుకుతుందా చూస్తాడు ఏ ప్రతిపక్ష నేతయినా… అందులోనూ ఏది మాట్లాడాలో, ఏది జాతిహితమో తెలివిడి కూడా లేని నాయకుడు కాబట్టి సందర్భం దొరికింది కదాని వాడుకోవాలని చూశాడు…

  • మరి ఎవరిది తప్పు.?

ఖచ్చితంగా నరవాణేదే… దేశ రక్షణకు సంబంధించి కీలక వ్యక్తుల నడుమ అనేక సంభాషణలు జరుగుతాయి, రహస్యాలుంటాయి… వాటికి బయటపెట్టాలనుకోవడమే ఓ ధూర్తత… అనైతికత… మనది ఇతర ప్రజాస్వామిక వ్యవస్థల పరిణతి లేని దేశం… దానికి తగినట్టు ఇదుగో ఇలాంటి మాజీ ఆర్మీ చీఫ్‌ల పైత్యం…

  • తన జ్ఞాపకాల్ని పంచుకుంటే తప్పేమిటి..?

తప్పు లేదు, అవి దేశహితానికి వ్యతిరేకంగా లేనంతకాలం… కానీ ఆ తెలివిడి, ఆ జ్ఞానం నరవాణేకు లేకుండా పోయింది… మోడీ నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు అని తనే చెబుతాడు ఇంటర్వ్యూల్లో, మరోవైపు గల్వాన్ ఘర్షణ సమయంలో మోడీ బాధ్యతారాహిత్యం అన్నట్టుగా తన పుస్తకంలో రాశాడు… అసలు కంట్రవర్సీ, అసలు కప్పదాటు వైఖరి ఇదే… ఖండనీయం…

నరవాణే

  • మరి అధికారిక రహస్యాల చట్టం కింద యాక్షన్ తీసుకోవచ్చుగా కేంద్ర ప్రభుత్వం..?

వందల కోట్ల నోట్ల కట్టలతో దొరికిన న్యాయమూర్తినే ఏమీ చేయలేకపోయింది ఈ ప్రభుత్వం… ఓ మాజీ ఆర్మీ చీఫ్‌ను ఏం చేయగలదు..? పేరుకు ఏదో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, పెంగ్విన్‌కు నోటీసులు జారీ చేశారు… అంతిమంగా ఊదు కాలదు, పీరు లేవదు…

  • చివరకు ఏం జరుగుతుంది..?

ఏమీ జరగదు.,. ఏమీ ఒరగదు… నరవాణే నవ్వుతూ చూస్తుంటాడు… వ్యవస్థ దౌర్భాగ్యం ఇదంతా..!!

చివరగా... అదే గల్వాన్ భాషలో చెప్పుకుందాం... మిస్టర్ నరవాణే... నీకన్నా సకాలంలో దూకుడుగా ముందుకొచ్చి, చైనా సైనికులకు చుక్కలు చూపించి, వీరమరణం పొందిన మా తెలంగాణ కల్నల్ సంతోష్ నీకన్నా వేయిరెట్లు నయం..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మార్పేమీ లేదు… భద్రతామండలి సభ్యత్వంపై ఇప్పటికీ చైనా మోకాలడ్డు..!!
  • అవిశ్వాసం, ఆ పుస్తకం… ఈ మొత్తం ఎపిసోడ్‌లో అసలు తప్పు ఎవరిది..?
  • జంట నగరాలు కావు… ఈ విశ్వనగరం ఇప్పుడు చతుర్నగరి… క్వాడ్ సిటీ…
  • పూర్తి వందేమాతర గీతం తప్పనిసరి… ఇదుగో తెలుగు అనువాదం…
  • పాపం, మనం అర్థం చేసుకోలేం గానీ… కోటీశ్వరులకూ కోటి కష్టాలు…
  • నాటి బేబీ షామిలి… తెరపై ‘అంజలి’… నిజజీవితంలో ‘చిత్రలేఖిని’…
  • అంజలి..! ఇలాంటి మణిరత్నం క్లాసిక్స్ మళ్లీ ఎప్పుడు చూస్తామో..!
  • హిందూ మహా సముద్రంలో ఇండియాకు రెండు ‘సెక్యూరిటీ గార్డులు’…
  • ఆ జర్నలిజాన్ని మార్కెట్ తిరస్కరించింది… వాషింగ్టన్ పోస్ట్ వైఫల్యం అదే…
  • కాళ్లు తోక… చేతులే మొప్పలు… ఒళ్లు వలను కొరికి బయట పడ్డ చేపపిల్ల…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions