Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొన్ని కేసుల్లో న్యాయం ఓ చిక్కు ప్రశ్నే… ఇదీ అలాంటి కేసే…

February 14, 2026 by M S R

.

కొన్ని వార్తలు చదివాక మైండ్ బ్లాంక్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడూ… ఏదో ఓ అస్పష్ట భావన డిస్టర్బ్ చేస్తుంది… ముందుగా ఓ వార్త చదవండి…

ప్రేమపేరుతో బాలికను లొంగదీసుకుని, లైంగికదాడికి పాల్పడిన కేసులో నేరం రుజువుకావటంతో నిందితునికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 71,000 జరిమానా విధిస్తూ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి తీర్పునిచ్చారు…

Ads

నిందితుడు చెల్లించే జరిమానాలో బాధితురాలికి రూ. 70 వేలు పరిహారంగా అందించాలని ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు… ఈ కేసుకు సంబంధించి పోక్సో న్యాయస్థానం ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బత్తి రాజశేఖర్‌ అందించిన వివరాలిలావున్నాయి…

శ్రీకాకుళం జిల్లా, హిరమండలం మండలం కొల్లివలస గ్రామానికి చెందిన కొయ్యాన తిరుపతిరావు (33) వివాహితుడు… అనకాపల్లి జిల్లా చోడవరంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు… అదే ప్రాంతంలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు…

బాలికను మభ్యపెట్టి ఆమె ఇంటి నుంచి ఐదు తులాల బంగారం, రూ. 50 వేల నగదు తెప్పించాడు… ఆ నగలు, డబ్బులతో 2015, మే 25న బాలికను తీసుకుని రాజస్థాన్‌ వెళ్లిపోయాడు… తమ కుమార్తె కనిపించకపోవటంతో బాలిక తల్లి చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు… నిందితుడు 2021 వరకు బాలికతో అక్కడే ఉండిపోయాడు…

వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు… పోలీసులు దర్యాప్తు కొనసాగించి, నిందితుడిని అదే ఏడాది రాజస్థాన్‌లో అరెస్టు చేశారు… నిందితుడితో పాటు బాలికను, పిల్లలను నగరానికి తీసుకువచ్చారు… నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు… సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి, నేరం రుజువుకావటంతో నిందితునికి పైవిధంగా శిక్ష విధించారు…

…… ఇదీ వార్త… అతను ఆల్రెడీ వివాహితుడు… ఓ బాలికను మాయమాటలతో లేవదీసుకుని పోవడం ఖచ్చితంగా నేరమే… శిక్షార్హమే… చట్టం తన పని తాను చేసింది… పోలీసులు, కోర్టులు తమ విధులు తాము నిర్వర్తించారు… ఇక్కడి వరకూ అన్నీ వోకే…

కానీ ఆ పిల్ల తెలిసీ తెలియని 14- 15 ఏళ్ల వయసులో ఈ మోసానికి గురైంది… సంసారం చేసింది, ఇద్దరు పిల్లలు… ఇప్పుడు ఆ పాత భార్య ఏమైందో తెలియదు, లేవదీసుకుపోయినవాడు 20 ఏళ్లు జైలులో ఉంటే, ఇక ఈ అమ్మాయి ఆ పిల్లలతో ఎలా బతకాలో తెలియదు… సొసైటీ నిరాదరణ కూడా తప్పదు… 2021లో అరెస్టు చేస్తే, ఇన్నేళ్లు బెయిల్ మీద ఉన్నాడా..? ఆ అమ్మాయితోనే ఉన్నాడా..? అన్నీ ప్రశ్నలే… వార్త కేవలం కేసు, శిక్ష, తీర్పు వరకే పరిమితమైంది…

ఆమె తల్లిదండ్రులు ఆదరిస్తారా..? నేరస్థుడు అప్పీల్‌‌కు వెళ్తాడా..? ఆమెకు మళ్లీ పెళ్లి కూడా కష్టమే… నిజంగా ఇలాంటి కేసుల్లో అసలైన న్యాయం అంటే ఏమిటి..? నిజంగానే ఇదొక చిక్కు ప్రశ్న..!! బాధితురాలికి ఒక గౌరవప్రదమైన పునరావాసం (ఉదాహరణకు: ప్రభుత్వ గృహం, పిల్లల ఉచిత ఉన్నత చదువు, కనీస నెలవారీ భృతి) కల్పించకపోతే, ఆమెకు జరిగిన అన్యాయానికి పరిహారం దొరికినట్లు కాదేమో..!! మన ప్రభుత్వానికి అంత సెన్సిటివిటీ, మానవీయత ఉన్నాయా..? ఆశించగలమా..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాక్ గురించి కాదు, పాజ్ గురించే చర్చ..! ఉస్మాన్ తారీఖ్‌తో ఆడుకుంటారా..?
  • జీరోలు, సింగిల్ సీట్లు..! మున్సిపల్ తీర్పులో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్..!!
  • కొన్ని కేసుల్లో న్యాయం ఓ చిక్కు ప్రశ్నే… ఇదీ అలాంటి కేసే…
  • పట్టణ వోటర్లూ చెప్పేశారు..! రేవంతుడి లీడర్‌షిప్‌కి క్లియర్ బూస్టప్..!!
  • శారద అనగానే… కథలూ, మాటలూ రెచ్చిపోయి రాసేస్తారు బ్రదర్స్…
  • స్టయిలిష్ సనాతనం… భజన్ క్లబ్బింగ్… న్యూ స్పిరిట్యుయల్ వైబ్స్…
  • డ్రమ్ముల కొద్దీ గాఢమైన యాసిడ్ కొనుగోలు… ఎపిస్టీన్ ప్లానేమిటి..?!
  • ఫన్‌కీ..! సారీ, అనుదీప్… అంత పెద్దగా నవ్వించలేకపోయావ్..!!
  • అతడు… టీవీ ప్రసారాల్లో తిరుగులేని రికార్డు… థియేటర్లకు మళ్లీ వస్తాడట…
  • అబ్బో… ఈ ప్రముఖ గ్రంథ ‘సాంగు’డి కథలో ఈ కోణాలూ ఉన్నాయా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions