Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాక్ గురించి కాదు, పాజ్ గురించే చర్చ..! ఉస్మాన్ తారీఖ్‌తో ఆడుకుంటారా..?

February 14, 2026 by M S R

.
Prasen Bellamkonda ….. రేపటి మ్యాచ్‌కు సంబంధించి అందరూ పాక్ గురించి కాక పాజ్ గురించి మాట్లాడుతున్నారు. ఉస్మాన్ తారీఖ్ “నేను వెయ్యను పో, వేస్తే వేస్తా లేకపోతే లేదు ” అన్నట్టుండే యాక్షన్ గురించి మాట్లాడుతున్నారు.

జోక్స్ పక్కన పెడితే దీనికో గమ్మత్తయిన పరిష్కారం ఉంది. క్రికెట్‌లో బౌలర్ బాల్ డెలివర్ చేసేపుడు పాజ్ ఇస్తే బ్యాటర్ పక్కకు జరగవచ్చు. అలా పక్కకు జరగడం లీగల్ అని క్రికెట్ మాన్యువల్ చెపుతోంది.

ఉస్మాన్ తారీఖ్ యాక్షన్‌లో చాలా పెద్ద పాజ్ ఉంటది. మన బాటర్లు అలా జరుగుతారా లేదా తెలియదు. కానీ జరగొచ్చు. నిలువెత్తు యాటిట్యూడ్‌తో కదిలే హార్దిక్ పాండే లాంటి వాళ్లయితే ఖచ్చితంగా జరుగుతారనే అనుకుంటున్నాను.

Ads

అనేకసార్లు బ్యాటర్లు అలా పక్కకు జరిగితే ఎలా, ఏమవుతది..? ఇదంతా ప్రహసనం కావచ్చు. కిరణ్ మోరేను ఎక్కిరిస్తూ మియాందాద్ గెంతినట్టన్నమాట.

అయితే క్రీజ్‌లో అటూ ఇటూ కదిలే బ్యాటర్లకు ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌తో ఇబ్బంది కానీ స్టాండ్ అండ్ డెలివర్ బ్యాటర్లు సెహ్వాగ్, అభిషేక్, హార్దిక్, సూర్యవంశి, క్రిస్ గేల్ లాంటి వాళ్లకు ఇబ్బంది ఉండదు. అమెరికా బ్యాటర్లు అటూ ఇటూ కదిలి ఇబ్బంది పడ్డారు.

తారీఖ్ పాజ్ నిజంగానే బ్యాటర్లను డిస్టర్బ్ చేస్తది. బ్యాటర్లు పక్కకు జరిగి ఉస్మాన్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వచ్చు. రెండూ లీగలే. డెడ్ బాల్‌గా ప్రకటించడం తప్ప అంపెయిర్ ఏమీ చెయ్యలేడు.

నిజానికి ఉస్మాన్ బౌలింగ్ యాక్షన్ భిన్నమే తప్ప ఇల్లీగల్ కాదు. అతని మీద icc పరీక్షలు చాలా సార్లు జరిగాయి. బయోమెకానికల్‌గా అతని యాక్షన్ సరైనదేనని, అన్ని బంతులు ఒకేలా వేస్తాడు కనుక లీగలేనని ఐసీసీ అంగీకరించింది.

మలింగా, మురళీధరన్ లాంటి స్లింజింగ్, చకింగ్ ఆరోపణలు కొత్తేం కాదు. మన అశ్విన్ కూడా డెలివరీకి ముందు ఒక సెకన్ ఆగి వేస్తాడనే ఆరోపణ ఉంది. కొంత మంది చేస్తున్న మ్యాచ్ మధ్యలో ఉస్మాన్‌ను బ్యాన్ చేస్తారనే పిచ్చి వాదన తప్పు.

అభిషేక్, ఇషాన్, ప్రశాంత్ ఎంచక్కా “నిలబడి” కొట్టేయండి, బ్యాటింగ్ హార్దిక్ దాకా రానియ్యకండి. అసలే భారత్ పాక్ మ్యాచ్ అంటే అగ్ని. ఇప్పుడు ఉస్మాన్ తారీఖ్ కొత్త ఆజ్యం. చూద్దాం.
…..

రూల్ ఏమంటుందంటే

1. Law 41.4 –
Deliberate distraction, deception, or obstruction of batter
If a bowler stops while delivering the ball to deliberately deceive or distract the striker, this is considered unfair.
The Rule: “It is unfair for any fielder [which includes the bowler] deliberately to attempt to distract the striker while he/she is preparing to receive or receiving a delivery”.
Outcome: If the umpire considers the pause to be a trick or an unfair distraction, they shall immediately call and signal Dead ball.

2. Law 41.5 – Deliberate distraction, deception, or obstruction of batter
This covers if the distraction happens after the striker has already received the ball (if it wasn’t a dead ball). It similarly allows the umpire to call Dead ball.
Summary for the Batter
If a bowler stops, breaks their stride, or pauses in a way that is not part of a natural bowling action, it is treated as a “deception,” and the umpire should call “Dead Ball.” Once “Dead Ball” is called, the ball is not in play, and the striker is safe to move out of their stance.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాక్ గురించి కాదు, పాజ్ గురించే చర్చ..! ఉస్మాన్ తారీఖ్‌తో ఆడుకుంటారా..?
  • జీరోలు, సింగిల్ సీట్లు..! మున్సిపల్ తీర్పులో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్..!!
  • కొన్ని కేసుల్లో న్యాయం ఓ చిక్కు ప్రశ్నే… ఇదీ అలాంటి కేసే…
  • పట్టణ వోటర్లూ చెప్పేశారు..! రేవంతుడి లీడర్‌షిప్‌కి క్లియర్ బూస్టప్..!!
  • శారద అనగానే… కథలూ, మాటలూ రెచ్చిపోయి రాసేస్తారు బ్రదర్స్…
  • స్టయిలిష్ సనాతనం… భజన్ క్లబ్బింగ్… న్యూ స్పిరిట్యుయల్ వైబ్స్…
  • డ్రమ్ముల కొద్దీ గాఢమైన యాసిడ్ కొనుగోలు… ఎపిస్టీన్ ప్లానేమిటి..?!
  • ఫన్‌కీ..! సారీ, అనుదీప్… అంత పెద్దగా నవ్వించలేకపోయావ్..!!
  • అతడు… టీవీ ప్రసారాల్లో తిరుగులేని రికార్డు… థియేటర్లకు మళ్లీ వస్తాడట…
  • అబ్బో… ఈ ప్రముఖ గ్రంథ ‘సాంగు’డి కథలో ఈ కోణాలూ ఉన్నాయా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions