.
2017 లోకి వెళ్దాం ఓసారి… సమంత, నాగ చైతన్య వివాహం… గోవాలో రెండు వేర్వేరు సంప్రదాయాల ప్రకారం జరిగింది… అప్పట్లో ఈ పెళ్లి ఒక పెద్ద సంచలనం… వీరు రెండు పద్ధతులను ఎంచుకోవడానికి కారణం వారిద్దరి మతపరమైన నేపథ్యాలు…
అఫ్‌కోర్స్, ప్రస్తుతం తెలుగు కుటుంబాలు అలవర్చుకుంటున్న రికార్డింగ్ డాన్సుల సంగీత్‌లు ఎట్సెట్రాలతో పోల్చితే చాలా చాలా బెటర్… సమంత, చైతన్య ఎవరి మత వివాహ సంప్రదాయాల్ని వాళ్లు గౌరవించారు…
Ads
1. హిందూ వివాహం (అక్టోబర్ 6, 2017) తెలుగు సంప్రదాయం ప్రకారం జరిగింది… ఈ వేడుకలో సమంత, చైతన్య తాత (డి.రామానాయుడు) భార్య రాజేశ్వరి 70 ఏళ్ల నాటి పాత పట్టుచీరను ధరించి అందరినీ ఆకట్టుకుంది…
2. క్రైస్తవ వివాహం (అక్టోబర్ 7, 2017) సమంత క్రైస్తవ మతానికి చెందినది కావడంతో, మరుసటి రోజు చర్చిలో క్రైస్తవ పద్ధతిలో వివాహం జరిగింది… సమంత తెల్లటి గౌనులో, చైతన్య సూట్ ధరించి హాలీవుడ్ తరహాలో మెరిసింది…
ఇది రెండు భిన్న మత సంప్రదాయాల కలయిక… కానీ ఇప్పుడు చర్చ విజయ్ దేవరకొండ, రష్మిక మంధానా పెళ్లి గురించి… వీళ్లిద్దరి పెళ్లి కొడవ- తెలుగు వివాహ పద్ధతుల్లో, అంటే రెండు పద్ధతుల్లో జరుగుతుందీ అని… అవును, రష్మిక కూడా హిందూయే కదా… మరి ఈ రెండు పద్ధతులేమిటి..?
సాధారణంగా తెలుగు పెళ్లిళ్లలో కూడా చాలా తేడాలుంటాయి ప్రాంతాలను బట్టి, శైవ- వైష్ణవ పద్ధతులను బట్టి..! ప్రతి 100 కిలోమీటర్లకు పద్ధతుల్లో తేడాలుంటాయి… మామూలుగా పెళ్లి చేసే అమ్మాయి తరఫు పెళ్లి సంప్రదాయాన్నే పాటిస్తారు… కానీ ఈ కొడవ- తెలుగు పెళ్లిళ్ల తేడా ఏమిటి..? రష్మిక కావాలనే తమ కల్చర్‌కు సంబంధించిన (కొడవ) పెళ్లే కావాలనే ఎందుకు కోరుకుంది..?
-
సమంత-చైతన్య..: ఇది రెండు వేర్వేరు మతాల (హిందూ & క్రైస్తవ) కలయిక…
-
రష్మిక-విజయ్..: ఇది ఒకే మతంలోని (హిందూ) రెండు వేర్వేరు ప్రాంతీయ సంప్రదాయాల (తెలుగు & కొడవ) కలయిక…
ఇంకా వివరాల్లోకి వెళ్దాం… రష్మిక మంధాన కొడవ (Kodava) సామాజిక వర్గానికి చెందినది… ఈమె కర్ణాటకలోని కొడగు (Coorg) జిల్లాకు చెందిన మహిళ… కొడవలు తమదైన ప్రత్యేక సంస్కృతి, ఆచార వ్యవహారాలకు పేరుగాంచిన ఒక యోధుల జాతి… రష్మిక తన మూలాలను, తన మాతృభాష కొడవ భాషను ఎంతో గౌరవిస్తానని పలు సందర్భాల్లో తెలియజేసింది…
కొడవ వివాహ సంప్రదాయం (దీనిని మంగళ అని పిలుస్తారు) మిగిలిన హిందూ వివాహ వేడుకల కంటే చాలా భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది… సాధారణంగా హిందూ వివాహాల్లో కనిపించే బ్రాహ్మణ పురోహితులు, హోమం (అగ్ని సాక్షి), మరియు సప్తపది వంటివి కొడవ వివాహాల్లో ఉండవు…
ప్రధాన వ్యత్యాసాలు ఇవే… సాధారణ హిందూ వివాహంలో వేద మంత్రాల మధ్య, పురోహితుడు హోమం నిర్వహిస్తూ పెళ్లి జరిపిస్తారు… కొడవ వివాహంలో పురోహితులు ఉండరు… పెద్దల సమక్షంలో, వారి ఆశీర్వాదంతోనే పెళ్లి జరుగుతుంది… అగ్ని చుట్టూ తిరగడం (సప్తపది) వంటివి ఉండవు…
ఆయుధాలకు ప్రాధాన్యత… సాధారణ హిందూ వివాహంలో పూజా సామగ్రికి, మంగళ సూత్రానికి ప్రాధాన్యత ఉంటుంది… కొడవలు యోధుల జాతి (Martial Race) కావడంతో, పెళ్లిలో ఆయుధాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది… వరుడు సాంప్రదాయక కత్తి (Peeche Katti) ధరిస్తాడు… పెళ్లి వేడుకలో భాగంగా వరుడు అరటి కాండాలను కత్తితో నరికే ఆచారం ఉంటుంది, ఇది అతని ధైర్యసాహసాలకు ప్రతీక…
మద్యం మరియు మాంసం చాలా వరకు హిందూ సంప్రదాయాల్లో వివాహ వేడుకలో మద్యం, మాంసం నిషిద్ధం… కొడవ పెళ్లిళ్లలో మద్యం, మాంసం (ముఖ్యంగా పంది మాంసం – Pandi Curry) తప్పనిసరి… ఇది వారి సంస్కృతిలో ఒక గౌరవప్రదమైన భాగం…
వస్త్రధారణ కొడవ మహిళలు చీరను వెనుక వైపు కుచ్చెళ్లు వచ్చేలా విభిన్నంగా కడతారు (Coorgi Style)… వరుడు నలుపు రంగు కోటు (Kuppasa), తలపాగా ధరిస్తాడు…
ప్రార్థన, దేవతలు సాధారణ హిందూ వివాహంలో వినాయక పూజ లేదా కులదైవ ప్రార్థనతో మొదలవుతుంది… కొడవ వివాహంలో ప్రకృతిని, తమ పూర్వీకులను (Guru Karana) కావేరి మాతను ఎక్కువగా ఆరాధిస్తారు…
సారాంశం చెప్పాలంటే.., కొడవ వివాహం అనేది మతపరమైన కర్మకాండల కంటే కుటుంబ గౌరవం, పూర్వీకుల ఆశీర్వాదం, సామాజిక ఐక్యతకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది… ఈ నెల ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరగనున్న వీరి వివాహ వేడుకకు సంబంధించి బయటకు వచ్చిన తాజా వివరాల ప్రకారం…
1. రెండు పద్ధతుల్లో వివాహం
-
తెలుగు సంప్రదాయం…: విజయ్ దేవరకొండ తెలుగు వ్యక్తి కాబట్టి, ఉదయం పూట తెలుగు హిందూ సంప్రదాయం ప్రకారం ముహూర్తం నిర్ణయించారు… ఇందులో భాగంగా అరటి ఆకుల్లో భోజనాలు వంటి దక్షిణ భారతీయ పద్ధతులను అనుసరిస్తున్నారు…
-
కొడవ సంప్రదాయం…: రష్మిక మంధాన కొడగు (Coorg) ప్రాంతానికి చెందినది కాబట్టి, సాయంత్రం వేళ ఆమె మూలాలను గౌరవిస్తూ కొడవ సంప్రదాయం ప్రకారం వేడుకలు జరగనున్నాయి…
2. తాజా అప్‌డేట్స్
- వేదిక..: ఉదయపూర్‌లోని ఒక విలాసవంతమైన ప్యాలెస్ (ITC Mementos)…
-
ప్రైవసీ…: ఈ పెళ్లికి ‘నో ఫోన్ పాలసీ’ (ఫోన్లు అనుమతించరు) విధించినట్లు వార్తలు వస్తున్నాయి… ఇది చాలా ప్రైవేట్ వేడుకగా, కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే జరుగుతోంది…
-
రిసెప్షన్..: సినిమా ఇండస్ట్రీ మిత్రుల కోసం మార్చి 4, 2026న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు సమాచారం…
Share this Article