Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈరోజు మ్యాచులో ఈ అంపైర్ గనుక ఉంటే… ఇండియా ఇక ఇంటికేనా..?

February 26, 2026 by M S R

.

క్రికెట్ అంటేనే సెంటిమెంట్ల పుట్ట… బ్యాటర్ కొత్త బ్యాట్ పట్టుకోవడం దగ్గర నుండి, బౌలర్ తన లక్కీ షూస్ వేసుకోవడం వరకు అన్నీ సెంటిమెంట్ లెక్కలే…! కానీ టీమిండియాకు మాత్రం ఒక వింతైన ‘అంపైర్ గండం’ పట్టుకుంది. అదే రిచర్డ్ కెటిల్‌బరో గండం! ఈ బ్రిటిష్ అంపైర్ మీద నెట్‌లో భలే చర్చ సాగుతోంది…

వివరాల్లోకి వెళ్తే… ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ 2026 లో భారత్ మొన్న ఓటమి పాలవ్వడం కంటే.. ఆ మ్యాచ్‌లో అంపైర్‌గా కెటిల్‌బరో ఉండటమే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్… మనోళ్లు దీనికి ‘కెటిల్‌బరో కర్స్’ అని పేరు కూడా పెట్టేశారు… ఇంతకీ ఎవరీయన? టీమిండియాకు ఇయనకు ఉన్న లింకేంటి?

Ads

ప్రతి చేదు జ్ఞాపకంలోనూ అతడే!

గణాంకాలు చూస్తుంటే భారత అభిమానులకు వెన్నులో వణుకు పుట్టడం ఖాయం… ఒకసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే… కెటిల్‌బరో అంపైర్‌గా ఉన్న ఏ ఒక్క కీలక మ్యాచ్‌లోనూ భారత్ గెలవలేదు…

  • 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్: శ్రీలంక చేతిలో ఓటమి.

  • 2015 వన్డే వరల్డ్ కప్ సెమీస్: ఆస్ట్రేలియా చేతిలో పరాజయం.

  • 2016 టీ20 వరల్డ్ కప్ సెమీస్: వెస్టిండీస్ విక్టరీ.

  • 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్: పాకిస్థాన్ చేతిలో ఘోర పరాజయం.

  • 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్: కోట్లాది మంది భారతీయుల గుండె పగిలిన ధోనీ రన్ అవుట్ సీన్ గుర్తుందిగా? అప్పుడు కూడా ఈయనే అంపైర్!

  • 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్: గుజరాత్ స్టేడియంలో ఆస్ట్రేలియా మన ఆశలపై నీళ్లు చల్లింది.. అక్కడ కూడా కెటిల్‌బరోనే అంపైర్.

  • తాజాగా టీ20 వరల్డ్ కప్ 2026: సూపర్-8లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి. కథ మళ్లీ మొదటికొచ్చింది!

సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం… ఈ వింత యాదృచ్ఛికం చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు… సోషల్ మీడియాలో ఐసీసీని ట్యాగ్ చేస్తూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు…

“అయ్యా ఐసీసీ.. ప్లీజ్, మా మ్యాచ్‌లకు ఈ అంపైర్‌ను పెట్టకండి… ఆయన ఉంటే మాకు ‘ఐరెన్ లెగ్’ తగిలినట్టే” అని కొందరు, “ఆయన అంపైర్ అని తెలియగానే టీవీలు కట్టేస్తున్నాం” అని మరికొందరు వాపోతున్నారు…

నిజానికి ఇదంతా యాదృచ్ఛికమే, కానీ ప్రేక్షకుల సెంటిమెంటు అది, అందుకే ఈ విశ్లేషణలు.., మ్యాచ్ ఫలితం అనేది ఆటగాళ్ల ప్రతిభపై ఆధారపడి ఉంటుంది కానీ, అంపైర్ మీద కాదు… అయినా సరే.. సెంటిమెంట్లు నమ్మే సగటు భారత క్రికెట్ ఫ్యాన్‌కు మాత్రం ‘కెటిల్‌బరో గ్రౌండ్‌లో అడుగుపెడితే.. భారత్ ఇంటికి దారి వెతుక్కున్నట్టే’ అనే ఫీలింగ్ బలంగా నాటుకుపోయింది…

దక్షిణాఫ్రికాపై ఓటమితో టీమిండియా సెమీస్ అవకాశాలు సన్నగిల్లిన ఈ తరుణంలో.. కనీసం వచ్చే మ్యాచ్‌ల్లోనైనా మన జట్టు ఈ ‘అంపైర్ శాపాన్ని’ చెరిపివేసి గెలుస్తుందేమో చూడాలి…! అన్నట్టు ఈరోజు కీలకమైన మ్యాచు, అంపైర్ ఎవరో మరి..! జైషా ఓసారి లుక్కేయాలి మరి..!!

  • అన్నట్టు … దీంతో సంబంధం లేదు గానీ ఓ ముచ్చట… 2003లో ఆస్ట్రేలియాతో జరిగిన ఓ మ్యాచులో సచిన్ టెండూల్కర్‌ను ఎల్బీడబ్ల్యూగా ఔటిచ్చాడు అప్పటి అంపైర్ స్టీవ్ బక్నర్… పక్కాగా అది తప్పుడు నిర్ణయం… తనను తిట్టుకోని సచిన్ ఫ్యాన్ లేడు… 23 ఏళ్ల తరువాత సదరు అంపైర్ నోరు విప్పి, అవును, అది తప్పే అని ఇప్పుడు అంగీకరించాడు…

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈరోజు మ్యాచులో ఈ అంపైర్ గనుక ఉంటే… ఇండియా ఇక ఇంటికేనా..?
  • అసలే బాలయ్య, ఆపై విజయశాంతి… మాంచి కమర్షియల్ మాస్ మసాలా…
  • KCR ఎడాపెడా అప్పులు, అక్రమాలు … గట్టెక్కించే తిప్పలు Revanth Reddy…
  • ఈ కీలక లొంగుబాట్ల వేదికపై ఎవరామె..? ఓసారి చెప్పుకోవాలి..!!
  • అప్పట్లో రిజెక్టయ్యాడు గానీ… వర్తమాన చానెళ్లలో చెలామణీ అయ్యేవాడేమో…
  • సాయి పల్లవి…! వాట్ ఏ కెరీర్… 15 సినిమాలు- ఏడు ఫిలిమ్ ఫేర్లు…!!
  • ఫోన్‌బుక్..! ప్రతి నంబరూ ఆత్మీయం కాదు, అవసరమైతే పలకరించదు..!!
  • పరకాల ప్రభాకర్… కేంద్ర ఆర్థికమంత్రి భర్తకు ఎక్కడో ఏదో దెబ్బ తిన్నది…
  • కేరళం..! ఎందుకు ఈ పేరు మార్పిడి..? ఈ పేరులో అర్థమేమిటి..?
  • రాయల్ టైగర్‌కు ఓ మాంసం ముక్క… ఆడిట్ వాడు పట్టేసుకున్నాడు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions