Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వంద ఆరుట్ల మోడల్ స్కూళ్లు… గుడ్ డెసిషన్… మురళి సిఫారసులూ భేష్…

February 27, 2026 by M S R

.

ఈ విషయంలో రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని మెచ్చుకోవచ్చు… ఆకునూరి మురళి కమిషన్ రాష్ట్రంలో విద్యా స్థితిగతుల మెరుగుదలకై రిపోర్టు ఇవ్వగానే తక్షణం నియోజకవర్గానికి కనీసం ఒకటి, మొత్తంగా వంద వరకు తెలంగాణ మోడల్ స్కూల్  ఏర్పాటుకు నిర్ణయం తీసేసుకున్నాడు… ప్రభుత్వ రంగంలో విద్యను పేదలకే కాదు, అన్నివర్గాలకూ కార్పొరేట్ స్థాయిని మించి, ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చే దిశలో సరైన నిర్ణయం… ఇంకొన్ని విషయాల్లోకి వెళ్దాం…

బీఆర్ఎస్ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రంగం ప్రభుత్వ విద్యారంగం… చిన్నా చితకా ప్రైవేటు స్కూళ్లు కూడా పెరిగిపోతూ ప్రభుత్వ స్కూళ్లలో ఎన్‌రోల్‌మెంట్ పడిపోయింది… 1920 స్కూళ్లలో జీరో ఎన్‌రోల్‌మెంట్… అవి మూసేయనివ్వరు, రాజకీయాలు, డెవలప్ చేయరు… కనీసం క్లస్టర్లుగా మార్చనివ్వరు… పల్లెల్లో టీచర్లు ఉండరు, పట్టణాల్లోనే పైరవీలతో పోస్టింగులు, జీరో హేతుబద్ధీకరణ… గురుకులాలు ఏర్పాటు చేసినా వాటికేమో మౌలిక సదుపాయాల కొరత…

Ads

స్కూల్ పిల్లల ప్రమాణాలను కొలిచే ASER సర్వేలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల అభ్యసన స్థాయి మరీ తక్కువగా, ఆందోళనకరంగా ఉంటోంది… ఈ స్థితిలో మొత్తం విద్యావ్యవస్థను ఏం చేస్తే బాగుంటుందో సిఫారసు  చేయడానికి మురళి కమిషన్ అన్ని జిల్లాల్లోనూ తిరిగి అధ్యయనం సాగించింది… కొన్ని సిఫారసులు కూడా బాగున్నాయి…

అందులో ముఖ్యమైంది… నర్సరీ, ఎల్‌కేజీ నుంచి నేరుగా టెన్ ప్లస్ టూ వరకు ఒకేచోట… ఆధునిక విద్య (ఇంగ్లిష్ మీడియం, ఎఐ బేసిక్స్ ఎట్సెట్రా) అందుబాటులో ఉంచడం… ఆల్రెడీ రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్లలో ఈ మోడల్ స్కూల్ విజయవంతమైంది… (కేంద్ర పథకం పీఎం శ్రీ కింద కోట్లు ఖర్చు పెట్టారు)… ఏడెనిమిది వందల  నుంచి 16, 17 వందల దాకా విద్యార్థుల సంఖ్య పెరిగింది…)

ఆరుట్ల

  • ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లు మంచి కాన్సెప్టే… కానీ టీచర్ల బోధన సామర్థ్యాలే ఓ పెద్ద సమస్య… పట్టణాల్లో తిష్టవేసిన టీచర్లను పల్లెలకు పంపించడం ఓ బిగ్ టాస్క్… 9 వేల కోట్ల మేరకు ఏడీబీ, ఎఐఐబీల నుంచి రుణం తీసుకుని, బోధన సామర్థ్యాల్లో ఆధునిక శిక్షణ, మోడల్ స్కూళ్లలో స్టాండర్డ్స్- ఫెసిలిటీస్ పెంచబోతున్నారు… యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు కూడా వెచ్చిస్తారు… ఇవి స్థూలంగా తెలంగాణ స్కూళ్ల స్థితిగతులనే మార్చనున్నాయి… కేంద్రం కూడా ఈ రుణాలకు ప్రాథమికంగా అనుమతి ఇచ్చేసింది…

ఈ దిశలో టీచర్లకు గ్రేడింగ్ మంచి సూచనే… పనితీరు మారకపోతే సర్వీస్ నుంచి రిమూవల్, జీతాల తగ్గింపు కూడా మంచి సూచన… అవసరం కూడా… కానీ అమలులో చాలా కష్టం… (తెలంగాణ ఏర్పడినప్పుడు 1500 కోట్లున్న ప్రభుత్వ సిబ్బంది జీతభత్యాల భారం ఏకంగా 6000 కోట్లకు పెరగడం ఖచ్చితంగా ఆందోళనకరం… సరే, అది వేరే డిబేట్…)

డీఎడ్ తీసేసి, తప్పనిసరిగా బీఈడీ అర్హత పెట్టాలనేది కూడా గుడ్ సజెషన్… సీఎం ఇక్కడ టీచర్ల సంఘాల ఒత్తిడిని తట్టుకోవాలి… అలాగే ఇంటర్ బోర్డును తీసేసి, పాఠశాల విద్యా శాఖలో కలిపేయడం మరింత మంచి సూచన… మిగతా రాష్ట్రాల్లో టెన్ ప్లస్ టూ పద్ధతే… ఫార్మసీ, అగ్రికల్చర్, ఇంజినీరింగు వంటి కోర్సులకు ఎప్‌సెట్ వంటి ప్రవేశపరీక్షలు నిజంగానే వేస్ట్… ఇంటర్ (టెన్ ప్లస్) మార్కులే ప్రామాణికం కావాలనేదీ మంచి సూచనే… (టెన్ల ప్లస్ వన్ పరీక్ష కూడా వేస్టే… కాకపోతే టెన్ ప్లస్ టూ ప్రమాణాలు మాత్రం పెరగాలి)…

డీమ్డ్ వర్శిటీలకు కూడా కొన్ని ప్రామాణికాలు అవసరం… ఆ దందాలకు ముందు తెరపడాలి… ప్రమాణాలు లేని ఇంజినీరింగ్ కాలేజీలను ఫీజు రీయింబర్స్‌‌మెంట్ స్కీమ్ నుంచి తీసేయాలి… అది తక్షణావసరం…

వాటి ఫీజుల హేతుబద్దీకరణే గాకుండా ప్రైవేట్ స్కూళ్ల అడ్డగోలు ఫీజులకూ నియంత్రణ కావాలి… ఐఐటీ, పాలిటెక్నిక్కులను స్కిల్ యూనివర్శిటీకి అటాచ్ చేయడం, కనీసమార్కుల్ని 45 శాతం చేయడం, ఉన్నత విద్యలో 50 కనీస ఉత్తీర్ణత మార్కులు కూడా వెంటనే ప్రకటించేయాల్సిన మార్పు… ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలి…

అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లను ఒకే గొడుగు కిందకు తీసుకురాావాలి… ఇలా నిజంగానే మురళి కమిషన్ బోలెడు మంచి సూచనలు చేసింది… జాతీయ విద్యావిధానంతో కోరిలేట్ చేసుకునేలా..! సో, కేంద్రమూ ప్రోత్సహిస్తుంది… కాలయాపన లేకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి రేవంత్ రెడ్డి వీటిలో తక్షణ ఆచరణసాధ్యం అనిపించినవి వెంటనే ప్రారంభించడం మంచిది..!! (తనే విద్యా శాఖ మంత్రి... ఆచరణ సాధ్యతపై విడిగా అధ్యయనం కూడా అవసరం లేదేమో..!! 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పైకి అంతా బాగానే ఉంది కానీ… లోలోపల పీడించే రోగాలెన్నో…
  • మగాడు..! తెలుగులో సింగిల్ కమెండో ఆపరేషన్ సినిమాలు తక్కువే..!!
  • వంద ఆరుట్ల మోడల్ స్కూళ్లు… గుడ్ డెసిషన్… మురళి సిఫారసులూ భేష్…
  • త్వరలో లోకేష్‌కు పగ్గాలు..? మరి చంద్రబాబు..? మరి జనసేనాధిపతి..?!
  • ఆఫ్టరాల్ శెట్టి గ్యాంగ్..! తెలంగాణా కోడలా… తలెగరేసి ఇలాగే బతికెయ్..!!
  • అగ్రదేశపు యుద్ధనౌక… టాయిలెట్లతో యుద్ధం… చెప్పలేని అగచాట్లు…
  • న్యాయం ఓ ప్రశ్నార్థకం..! ఈ ఇద్దరు తల్లుల పోరాటానికి అభివందనం..!!
  • పని చేయడానికే జీవితమా..? జీవితంలో పని కేవలం ఓ భాగమా..?
  • నయా రాజరికం..! అంతటి రాజవంశ సింధియా కూడా హాశ్చర్యపోయాడు..!!
  • ఏపీ మంత్రి వ్యాఖ్యలపై… బీఆర్ఎస్ నుంచి ఉలుకూ పలుకూ లేదు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions