Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పైకి అంతా బాగానే ఉంది కానీ… లోలోపల పీడించే రోగాలెన్నో…

February 27, 2026 by M S R

.

జింబాబ్వేతో జరిగిన మ్యాచులో ఇండియా దుమ్ము రేపింది, దంచేశారు అనే విశేషణాలతో మస్తు వార్తలు కనిపిస్తున్నాయి… వరల్డ్ కప్‌లో సెకండ్ హయ్యెస్ట్ స్కోర్, ఇండియా అత్యధిక స్కోర్, ప్రతి బ్యాటరూ 150 కు మించిన స్ట్రయిక్ రేటుతో కుమ్మేశారు… ఇరగదీశారు… మనల్ని ఆపేదెవడురా వంటి పొగడ్తలూ కనిపిస్తున్నాయి…

ఎస్, బ్యాటర్లు జింబాబ్వే బౌలర్లను ఉతికి ఆరేశారు, కొత్త రికార్డులు నమోదయ్యాయి… 250 దాటిన స్కోర్ తక్కువేమీ కాదు, కాకపోతే టీ20 మ్యాచుల్లో పలుసార్లు ఇంతకుమించిన స్కోర్లు నమోదయ్యాయి… నిజానికి జింబాబ్వే బౌలర్లు మరీ అంత నాసిరకం ఏమీ కాదు, ఇదే వరల్డ్ కప్ గత మ్యాచుల్లో మంచి ప్రదర్శనే ఉంది…

Ads

కాకపోతే మంచి నెట్ రన్ రేట్ కూడా సాధించాలనే లక్ష్యంతో, కసితో మన బ్యాటర్లు భీకరంగా విజృంభించడంతో జింబాబ్వే బౌలింగ్ వ్యూహాలు చెల్లాచెదురయ్యాయి… ఎస్, అభిషేక్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు… సూర్య, హార్దిక్, తిలక్ వర్మ, ఇషాన్, సంజూ మంచి స్ట్రయిక్ రేట్‌తో కనిపించారు… ఇవన్నీ ప్లస్ పాయింట్స్… కానీ..?

టీ20

నిజంగా ఇండియాకు త్వరలో జరగబోయే వెస్టిండీస్ మ్యాచ్ చాలా కీలకం… అందులో తప్పకుండా గెలిస్తేనే పోటీలో ఉంటాం, లేకపోతే ఇంటికే… దక్షిణాఫ్రికాతో మన ఆటగాళ్ల నాసిరకం ఆటను చూశాం, జింబాబ్వేతో జరిగిన మ్యాచులో బోలెడు కెప్టెన్సీ లోపాలు… పేలవమైన ఫీల్డింగ్, బౌలింగు… చివరకు వరుణ్ చక్రవర్తి కూడా అదుపు తప్పిపోయాడు…

ఇక శివమ్ దూబే గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది… ఫీల్డింగులో పూర్, ఆపగలిగిన ఫోర్ కూడా ఆపని తీరు మీద చివరకు కామెంటేటర్లు కూడా చిరాకుపడ్డారు… బౌలింగులో ఫస్ట్ ఓవర్‌లో ఏకంగా 26 రన్స్… వైడ్లు, నోబాల్స్, భారీగా పరుగులు… అసలు బాల్ ఎటు పోతుందో ఎవరికీ అర్థం కాలేదు… రెండు ఓవర్లు వేయిస్తే ఏకంగా 46 పరుగులు ఇచ్చాడు మహానుభావుడు… తొలి ఓవరే అంత నాసిరకంగా ఉంటే, మ్యాచ్ చివరి ఓవర్ కూడా తనకే ఇచ్చాడు కెప్టెన్… అదేం తిక్క నిర్ణయమో…

అదేమంటే..? వెస్టిండీస్‌తో మ్యాచుకు రిహార్సల్ అట… కొందరు సమర్థిస్తున్నారు అలా… అసలు వెస్టిండీస్ మ్యాచుకూ, దీనికీ సంబంధం ఏమిటి అసలు..? ఉన్నంతలో అర్షదీప్ బెటర్… బెటర్ ఎకానమీ, 3 వికెట్లు… వాషింగ్టన్ సుందర్‌ను మార్చి అక్షర్ పటేల్‌ను తీసుకురావడం గుడ్… కానీ వెస్టిండీస్‌తో మ్యాచుకు రింకూ సింగ్ అందుబాటులో లేకపోవడం ఓ మైనసే… బెన్నెట్ క్యాచ్ మొదట్లోనే డ్రాప్ చేయడం వల్ల తను ఏకంగా 97 నాటవుట్…

వెస్టిండీస్ ఈ వరల్డ్ కప్ పోటీల్లో బాగా ఆడుతోంది… దాన్ని తేలికగా తీసుకోలేం, జింబాబ్వేతో మన ఆటతీరుతో పోలిస్తే వెస్టిండీసే బ్యాటింగ్, బౌలింగు, ఫీల్డింగుల్లో బాగున్నట్టు కనిపిస్తోంది… సిమ్రన్ హిట్‌మైర్ గనుక క్లిక్కయితే విధ్వంసమే, మరో బెన్నెట్ తను… సో, జింబాబ్వే వేరు, వెస్టిండీస్ ఖచ్చితంగా వేరు… ఈ అల్లాటప్పా వ్యూహాలు ఏమాత్రం పనికిరావు, తేడా కొడితే మాత్రం ఇక ప్రయోగాలు చేయడానికీ ఏ చాన్సూ ఉండదు, ఇంటికే..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మరేమనుకున్నారు పెద్ద దొర పెంపకం అంటే..? ఫుల్ క్లీన్ చిట్…!!
  • విష్ణువిన్యాసం..! చివరిదాకా చూడగలిగిన ప్రేక్షకులు అత్యుత్తమ జాతి..!!
  • పైకి అంతా బాగానే ఉంది కానీ… లోలోపల పీడించే రోగాలెన్నో…
  • మగాడు..! తెలుగులో సింగిల్ కమెండో ఆపరేషన్ సినిమాలు తక్కువే..!!
  • వంద ఆరుట్ల మోడల్ స్కూళ్లు… గుడ్ డెసిషన్… మురళి సిఫారసులూ భేష్…
  • త్వరలో లోకేష్‌కు పగ్గాలు..? మరి చంద్రబాబు..? మరి జనసేనాధిపతి..?!
  • ఆఫ్టరాల్ శెట్టి గ్యాంగ్..! తెలంగాణా కోడలా… తలెగరేసి ఇలాగే బతికెయ్..!!
  • అగ్రదేశపు యుద్ధనౌక… టాయిలెట్లతో యుద్ధం… చెప్పలేని అగచాట్లు…
  • న్యాయం ఓ ప్రశ్నార్థకం..! ఈ ఇద్దరు తల్లుల పోరాటానికి అభివందనం..!!
  • పని చేయడానికే జీవితమా..? జీవితంలో పని కేవలం ఓ భాగమా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions