Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌‌ను నమ్మి… ఇరాన్ నిండా మునిగిందా..?!

March 3, 2026 by M S R

.

చైనా ‘తుప్పు’ ఆయుధాలు, ఇరాన్ నట్టేట మునిగిందా? చైనాతో రక్షణ ఒప్పందం అంటే… యుద్ధ సమయంలో చేతులెత్తేయడమేనని మరోసారి రుజువైంది… ఇజ్రాయెల్ మెరుపు దాడులను అడ్డుకోవడంలో ఇరాన్ వద్ద ఉన్న చైనా తయారీ HQ-9B ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఘోరంగా విఫలమైందనే వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి…

చైనా మాల్, చైనా సరుకు అంటేనే నాసిరకం అని ప్రపంచం మొత్తానికి తెలిసిందే కదా… ఇరాన్ అలా గుడ్డిగా ఎందుకు చైనాను నమ్మింది..? ఇదీ ప్రశ్న..! రష్యా, చైనా దేశాలతో ఇరాన్‌కు వ్యూహాత్మక మైత్రి ఉందనేది నిజం… ఇరాన్‌పై అంతర్జాతీయ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో, చైనా తనకు అవసరమైన చమురును ఇరాన్ నుండి తక్కువ ధరకు కొనుగోలు చేస్తోంది…

Ads

దీనికి బదులుగా నగదుకు బదులు తన నాణ్యత లేని రక్షణ పరికరాలను అంటగడుతోంది… ఈ ‘బార్టర్ సిస్టమ్’ వల్ల ఇరాన్ రక్షణ వ్యవస్థ పూర్తిగా చైనాపై ఆధారపడాల్సి వచ్చింది… కానీ తీరా సమయం వచ్చినప్పుడు, ఇజ్రాయెల్ ప్రయోగించిన క్షిపణులను గుర్తించడంలో కూడా ఈ వ్యవస్థలు విఫలమయ్యాయి…

చైనా తన ఆయుధాల డొల్లతనం బయటపడకుండా ఉండేందుకు అంతర్జాతీయ మీడియాలో, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను (Fake Narrative) సృష్టిస్తూ ఉంటుంది…

  • తమ ఆయుధాల ఫెయిల్యూర్ నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించడానికి, ఆపరేషన్ సిందూర్ సమయంలో “పాకిస్థాన్ తన చైనా ఆయుధాలతో భారత రఫెల్ జెట్లను కూల్చేసింది” అనే ఒక అవాస్తవ ప్రచారాన్ని మార్కెట్లోకి వదిలింది…

  • వాస్తవానికి అటువంటి సంఘటన ఏదీ జరగలేదు, కానీ తన ఆయుధాల మార్కెట్ పడిపోకుండా ఉండటానికి చైనా ఇలాంటి మైండ్ గేమ్స్ ఆడుతోంది…

చైనా నాణ్యత లేని ఉత్పత్తుల చరిత్ర చాలా పెద్దది… ఇటీవల చైనా సైన్యం, PLA రాకెట్ ఫోర్స్కు చెందిన క్షిపణులలో ఇంధనానికి బదులుగా నీరు నింపినట్లు, వాటి కవర్లు సరిగా లేనట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి… దీని వల్ల అనేకమంది ఉన్నత స్థాయి అధికారులు తొలగించబడ్డారు… అన్నింటా డొల్ల వ్యవహారమేనా..?

ఆయుధాలే కాదు, ప్రతి విషయంలోనూ అంతే… కోవిడ్-19 సమయంలో చైనా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌లు (Sinovac, Sinopharm) ప్రపంచవ్యాప్తంగా ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోయాయి… ఇవి తక్కువ ప్రభావశీలతను కలిగి ఉండటంతో, వీటిని ఉపయోగించిన దేశాలు మళ్ళీ వేరే వ్యాక్సిన్‌ల కోసం వెళ్లాల్సి వచ్చింది… కొన్ని దేశాలు చైనా వ్యాక్సిన్‌లకు బదులుగా మళ్ళీ పాశ్చాత్య వ్యాక్సిన్‌లు తీసుకోవలసి వచ్చింది…

పాకిస్థాన్, వెనిజులాల చేదు అనుభవం…: గతంలో భారత వైమానిక దళ దాడుల సమయంలో చైనా రక్షణ వ్యవస్థలు కనీసం ‘అలర్ట్’ కూడా ఇవ్వలేకపోయాయి… దీంతో పాకిస్థాన్ ఇప్పుడు చైనాను నమ్మి మోసపోయామని అంతర్గతంగా మధనపడుతోంది… వెనిజులాలో కూడా చైనా రాడార్లు , మిస్సైల్ సిస్టమ్స్ అత్యవసర సమయంలో మొరాయించాయి…

చైనా తన ఆయుధాలను రష్యా లేదా అమెరికా టెక్నాలజీని కాపీ కొట్టి (Reverse Engineering) తయారు చేస్తుంది… పైకి మెరిసే ఈ ఆయుధాలు, అమెరికాకు చెందిన F-35 వంటి అత్యాధునిక స్టీల్త్ విమానాలను ఎదుర్కోవడంలో ఏమాత్రం పనికిరావని ఇరాన్ ఉదంతం నిరూపించింది…


మిత్రదేశాల అవసరాలను ఆసరాగా చేసుకుని, తన పనికిరాని ఆయుధాలను చైనా అంటగడుతోంది… ఒకవేళ అవి విఫలమైతే, తన తప్పును ఒప్పుకోకుండా ఎదుటివారిపై బురద చల్లడం లేదా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం డ్రాగన్ దేశానికి అలవాటుగా మారింది… ఇరాన్ ఇప్పుడు చైనాను నమ్ముకుని పెద్ద తప్పు చేశామని ఆలస్యంగా గుర్తించింది… చైనాను నమ్మితే ప్రమాదంలో పడతాయని ప్రపంచ దేశాలు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సొంత కోతలు, తిక్క కూతలు… పాకిస్థాన్ ప్లేయర్లు ఇక అస్సలు మారరు…
  • సొంతూళ్లో… సొంతింట్లో… వ్రతం, విందు… భేష్ విజయ్ దేవరకొండా…
  • చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌‌ను నమ్మి… ఇరాన్ నిండా మునిగిందా..?!
  • 70 ఏళ్ల మాస్ ముసలమ్మ..! ఈ వయస్సులోనూ రాధిక అదరగొట్టేసింది..!!
  • తమ్మినేనికి అభిశంసన..! సీపీఎం కేంద్ర కమిటీ మండిపాటు..?!
  • ఆ రష్మిక మంధన్నా గురించే కాదు… ఈ రష్మి గౌతమ్ గురించీ ఓసారి చెప్పుకోవాలి…
  • విజయ శాంతిని ఏకంగా ఫైర్ బ్రాండ్ లేడీ అమితాబ్‌ను చేసింది..!
  • రష్మిక మంధన్నా..! తన మూలాల్ని గౌరవించింది… గర్వంగా చెప్పుకుంది…!
  • డెడ్లీ మొసాద్- ఇరాన్ అణు కార్యక్రమంపై విస్తుపోయే ఆపరేషన్లు…
  • రోబోటిక్ గన్… బ్లో టార్చ్‌లు… నమ్మలేని మొసాద్ ఇరాన్ ఆపరేషన్లు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions