Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సొంతూళ్లో… సొంతింట్లో… వ్రతం, విందు… భేష్ విజయ్ దేవరకొండా…

March 3, 2026 by M S R

.

ఎవరో ఓ ప్రశ్న వేశారు… రష్మిక మంధన్నా తన రూట్స్ మరిచిపోకుండా… తన కొడవ సంస్కృతికి పెద్దపీట వేసి, తమ సంప్రదాయంలోనే పెళ్లికి విజయ్ దేవరకొండను ఒప్పించింది కదా… తన సామాజికవర్గం పట్ల గౌరవాన్ని ప్రదర్శించి, గర్వాన్ని కూడా చాటుకుంది కదా… మరి విజయ్ ఆ పని ఎందుకు చేయలేదు..? ఇదీ ఆ ప్రశ్న…

దానికి జవాబు ఆ దంపతులే ఇచ్చారు నిన్న… విజయ్ స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా, బల్మూరు మండలం, తుమ్మెన్‌పేటకు కొత్త జంట వెళ్లింది… అక్కడ సత్యనారాయణ వ్రతం చేశారు… గ్రామస్థులకు విందు ఇచ్చారు… అంతేకాదు, ఆ నియోజకవర్గం పరిధిలోని 44 ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు (9, 10 తరగతులు- మంచి మార్కులు సాధించినవాళ్లు) స్కాలర్‌షిప్స్ ప్రకటించారు…

Ads

అక్కడే విజయ్ ఓ ఇల్లు కూడా (ఫామ్ హౌజ్) కట్టుకున్నాడు… ఆ గృహప్రవేశం జరిగింది… తమ్ముడు ఆనంద్ దేవరకొండ పెళ్లి ఊళ్లోనే చేస్తామనీ విజయ్ చెప్పుకొచ్చాడు… ఇది కాదా పుట్టిన గడ్డను మరిచిపోకుండా, తిరిగి ఆ పల్లె  తల్లి ఒడిలోకి చేరడం, గౌరవించడం..?!

విజయ్

ఇక్కడ ఓ విశేషం చెప్పుకోవాలి… డెస్టినేషన్ వెడ్డింగ్ పేరిట సుదూరంలో పరిమిత సంఖ్యలో బంధుమిత్రగణం నడుమ పెళ్లి చేసుకునే ధోరణి ఈమధ్య బాగా పెరుగుతోంది కదా మన సమాజంలో… మరోవైపు అట్టహాసాలు, ఆడంబరాలు, సంపద ప్రదర్శనల కోసం హల్దీలు, మంగళస్నానాలు, స్వాగత్, బరాత్, పెళ్లి, సంగీత్, రిసెప్షన్ వంటి ఏవేవో మిక్స్‌డ్ కల్చర్‌ను కూడా రుద్దుకుంటున్నాం కదా…

ఒకవైపు ఈ డబ్బాచారం, డంబాచారం పెరుగుతూ ఉన్నా సరే… ఎక్కడెక్కడ ఏ ప్రోగ్రాం జరుపుకున్నా సరే… మళ్లీ సొంతూళ్లోని సొంతింట్లో సత్యనారాయణవ్రతం చేసుకుంటున్న ధోరణి కూడా పెరుగుతోంది గుడ్… (సొంతూళ్లో సొంతిల్లు ఉన్నవాళ్లు)… ఇక్కడ విజయ్, రష్మిక జంటను ఓసారి అభినందించాలి…

విజయ్

అబ్బే, ఏముంది ఇందులో విశేషం అని తీసిపారేసేవాళ్లు కూడా ఉండొచ్చు… కానీ సెలబ్రిటీల వ్యవహారశైలి ప్రభావం వాళ్ల అభిమానుల మీదే కాదు, సమాజం మీద కూడా ఉంటుంది… ఈ నేపథ్యంలో విజయ్, రష్మిక తమ రూట్స్‌ను గౌరవిస్తూ, తమ ఊరిని ప్రేమిస్తూ, తమ సంస్కృతులను చాటుకోవడం విశేషమే కదా…

aditi

ఎస్, ఇక్కడ మరో జంట గురించీ చెప్పాలి… సిద్ధార్థ్, అదితిరావు హైదరీ పెళ్లి… ఆయనకు ఎన్నో పెళ్లి అనేది తెలియదు, ఆమెకు కూడా రెండో పెళ్లి కావచ్చు… కానీ ఆమె సిద్ధార్థ్‌ను వనపర్తికి తీసుకొచ్చింది… ఆమె రూట్స్ అవి… పాత జమీందారీ రాచరికం బాపతు…

ఆమె తాత వనపర్తి సంస్థానానికి చివరి పాలకుడు… అందుకని శ్రీరంగాపురంలో గల 400 ఏళ్ల నాటి చారిత్రాత్మక శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో పెళ్లి చేసుకుంది… అక్కడే నిశ్చితార్థం కూడా… అదితి రావు హైదరీ పూర్వీకులకు ఈ ఆలయంతో ఉన్న అనుబంధం కారణంగా, ఆమె ఈ ప్రదేశాన్ని ఎంచుకుంది… 

rashmika

సాధారణంగా మన ప్రాంతంలోని పెళ్లిళ్ల తీరును బట్టి పెళ్లిని వధువు ఊళ్లో జరుపుతారు… తరువాత వరుడి ఊళ్లో రిసెప్షన్ చేస్తుంటారు… (ఇప్పుడన్నీ అభిజిత్ లగ్నాలు, ఉదయం పెట్టుడు ముహూర్తం పెళ్లిల్లే కదా, అందరి కంఫర్ట్ కోసం)… కానీ ఇప్పుడు చాలాామంది రాత్రి ముహూర్తాలైనా సరే… పెళ్లి, రిసెప్షన్ ఒకేచోట కలిపేస్తున్నారు…

తరువాత ఎవరిళ్లల్లోవాళ్లు సత్యనారాయణ వ్రతాలు చేస్తున్నారు… అదుగో, అందుకే అవకాశమున్నచోట్ల, సొంతూళ్లో, సొంతిల్లు ఉన్నవాళ్లు, ఊరివాళ్లతో మంచి సంబంధాలు కొనసాగుతున్నవాళ్లు వ్రతం చేస్తే..? బాగుంటుంది… రష్మిక, విజయ్ చేసిందీ అదే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సొంత కోతలు, తిక్క కూతలు… పాకిస్థాన్ ప్లేయర్లు ఇక అస్సలు మారరు…
  • సొంతూళ్లో… సొంతింట్లో… వ్రతం, విందు… భేష్ విజయ్ దేవరకొండా…
  • చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌‌ను నమ్మి… ఇరాన్ నిండా మునిగిందా..?!
  • 70 ఏళ్ల మాస్ ముసలమ్మ..! ఈ వయస్సులోనూ రాధిక అదరగొట్టేసింది..!!
  • తమ్మినేనికి అభిశంసన..! సీపీఎం కేంద్ర కమిటీ మండిపాటు..?!
  • ఆ రష్మిక మంధన్నా గురించే కాదు… ఈ రష్మి గౌతమ్ గురించీ ఓసారి చెప్పుకోవాలి…
  • విజయ శాంతిని ఏకంగా ఫైర్ బ్రాండ్ లేడీ అమితాబ్‌ను చేసింది..!
  • రష్మిక మంధన్నా..! తన మూలాల్ని గౌరవించింది… గర్వంగా చెప్పుకుంది…!
  • డెడ్లీ మొసాద్- ఇరాన్ అణు కార్యక్రమంపై విస్తుపోయే ఆపరేషన్లు…
  • రోబోటిక్ గన్… బ్లో టార్చ్‌లు… నమ్మలేని మొసాద్ ఇరాన్ ఆపరేషన్లు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions