.
Pardha Saradhi Upadrasta పాకిస్తాన్ ఎందుకు ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉంది?
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న తాజా పరిణామాల కారణంగా పాకిస్తాన్ చాలా క్లిష్టమైన జియో పాలిటికల్ పరిస్థితిలో పడింది. అమెరికా తాజాగా కరాచీ, లాహోర్‌లోని కాన్సులేట్లలో పనిచేసే non-emergency సిబ్బందిని దేశం విడిచిపోవాలని ఆదేశించడం పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో చూపిస్తోంది.
1️⃣ అమెరికా సిబ్బందిని ఎందుకు వెనక్కి పంపింది?
అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం పాకిస్తాన్‌లో పెరుగుతున్న భద్రతా సమస్యలు.
ఇరాన్‌పై జరిగిన దాడుల తర్వాత పాకిస్తాన్‌లో అమెరికా వ్యతిరేక నిరసనలు జరిగాయి.
కొన్ని చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి.
కరాచీలో అమెరికా కాన్సులేట్ వద్ద భద్రతా సమస్యలు ఏర్పడ్డాయి.
అందుకే అమెరికా జాగ్రత్త చర్యగా కుటుంబాలతో సహా non-essential staff ను వెనక్కి పంపుతోంది.
⚠️ ఇది యుద్ధం మొదలవుతుందనే అర్థం కాదు. కానీ డిప్లొమాటిక్ ప్రపంచంలో ఇది ఒక early warning signal గా పరిగణిస్తారు.
Ads
2️⃣ పాకిస్తాన్ ఎందుకు “Sandwiched” అయింది?
పాకిస్తాన్ ఇప్పుడు మూడు వైపుల ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
సౌదీ అరేబియాతో సంబంధం, పాకిస్తాన్‌కు సౌదీతో దీర్ఘకాల రక్షణ సహకారం ఉంది. ఆర్థికంగా కూడా సౌదీపై చాలా ఆధారపడుతుంది. సౌదీపై ఇరాన్ దాడులు జరిగినప్పుడు పాకిస్తాన్ మద్దతు ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇరాన్‌తో భౌగోళిక సంబంధం , పాకిస్తాన్‌కు ఇరాన్‌తో సరిహద్దు ఉంది.
రెండు దేశాల మధ్య బలోచిస్తాన్ ప్రాంతంలో ఇప్పటికే భద్రతా సమస్యలు ఉన్నాయి.
పాకిస్తాన్‌లో పెద్ద షియా ముస్లిం జనాభా ఉంది.
అమెరికాతో సంబంధం, పాకిస్తాన్‌కు అమెరికాతో కూడా భద్రత, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. కానీ ఇరాన్‌కు దగ్గరగా వెళ్లినా సమస్య, అమెరికాకు దగ్గరగా వెళ్లినా సమస్య.
3️⃣ పాకిస్తాన్‌పై వచ్చిన ఆరోపణలు
ఇరాన్ పై దాడిలో పాకిస్తాన్ అమెరికాకు ఇంటెలిజెన్స్ ఇచ్చింది. పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లు ఇచ్చింది అని ఇరాన్ కు అనుమానం ఉంది. కానీ ఇప్పటివరకు ఇది నిర్ధారించబడిన సమాచారం కాదు. చైనాకూ ఇది నచ్చడం లేదు.
4️⃣ పాకిస్తాన్ చేస్తున్న అసలు పని
ప్రస్తుతం పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొనడం కాదు, మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నిస్తోంది.
5️⃣ పాకిస్తాన్‌కు ఉన్న అసలు భయం పాకిస్తాన్‌కు మూడు పెద్ద భయాలు ఉన్నాయి:
– ఇరాన్ ప్రతీకార దాడి. తన నీడ దాడిలో పాక్ సహాయం వుంది అని ఇరాన్ నిర్ధారించుకుంటే ఇరాన్ పాక్ మీద దాడి చేస్తుంది. ఇరాన్ ఇంత వరకు దాడి చేయకుండా వదిలిన దాని పొరుగు దేశాలు పాక్, టర్కీ మాత్రమే.
– దేశంలో మతపరమైన అల్లర్లు. అతి పెద్ద షియా ముస్లింలున్న కారణంగా రోజూ అల్లర్లు నడుస్తున్నాయి.
– బలోచిస్తాన్ ప్రాంతంలో సైనిక ఉద్రిక్తతలు. బలోచిస్తాన్ ప్రత్యేక దేశం అవటానికి విపరీతంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటిదాకా ఇరాన్ పెద్దగా పట్టించుకోలేదు. ఇరాన్ పట్టించుకొని బలోచిస్తాన్ కు మద్దతు ఇవ్వటం మొదలు పెడితే పాక్ కు ఇంకా ఇబ్బంది తప్పదు.
ఇరాన్ గనుక పాకిస్తాన్ అమెరికాకు సహాయం చేసింది అని భావిస్తే, ధ్రువీకరించుకుంటే పాకిస్తాన్ సరిహద్దులో టెన్షన్ పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ భూభాగంలోకి అమెరికా లేదా ఇశ్రాయేల్ సైన్యం ప్రవేశించాలి అంటే పాక్ అమెరికా కు సహాయం చేస్తుందనే అపనమ్మకం ఇరాన్ కు ఉంది. అది బలపడితే పాక్ చచ్చిందే.
6️⃣ ప్రాంతీయ ప్రభావం
ఈ సంక్షోభం వల్ల ప్రభావం పడే దేశాలు:
పాకిస్తాన్
సౌదీ అరేబియా
గల్ఫ్ దేశాలు
ఇజ్రాయిల్
అమెరికా
ఇది పూర్తిగా మధ్యప్రాచ్య భద్రతా సమీకరణాన్ని మార్చే పరిస్థితి.
- J 35 ఫిఫ్త్ జెనరేషన్ ఫైటర్ జెట్స్ ని పాకిస్తాన్ కి అమ్మడం లేదని ప్రకటించింది చైనా!
వచ్చే సంవత్సరం అంటే 2027 చివర్లో మొదటి బాచ్ J35 ఫిఫ్త్ జనేరేషన్ ఫైటర్స్ ని ఇవ్వడానికి పోయిన సంవత్సరం చైనా ఒప్పుకుంది! కానీ ఇప్పుడు వెనక్కి తగ్గింది!
✅ సారాంశం
అమెరికా కరాచీ, లాహోర్ కాన్సులేట్ల నుండి సిబ్బందిని వెనక్కి పిలిచింది.
పాకిస్తాన్ ప్రస్తుతం సౌదీ– అమెరికా బ్లాక్ , ఇరాన్ మధ్య చిక్కుకుంది.
పాకిస్తాన్ నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్టు ఆధారాలు లేవు కానీ పరిస్థితి చాలా సున్నితంగా ఉంది.
—– ఉపద్రష్ట పార్ధసారధి
Share this Article