Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ చిన్న తెలుగు పత్రిక క్లిప్పింగ్ నిన్నంతా వైరల్… ఎందుకు..?

March 10, 2026 by M S R

.

నిన్న ఓ పత్రిక క్లిప్పింగ్… అది కేవలం ఈ-పేపరేనా..? ప్రింట్ కూడా చేస్తారా..? అది తెలియదు గానీ… ఆ క్లిప్పింగ్ నిన్నంతా తెలుగు జర్నలిస్టుల నడుమ బాగా చక్కర్లు కొట్టింది… చర్చనీయాంశమైంది… రకరకాల అభిప్రాయాలు, విశ్లేషణలు సాగాయి…

అది నవభారత్ పత్రిక అని ఆ క్లిప్పింగ్ చెబుతోంది… తాజా వార్తే… మొన్నటి ఆరో తారీఖు… హెడింగ్ ఏమిటంటే..? రంజాన్ పండుగ సందర్భంగా మన పత్రికకు యాడ్ ఇస్తానని అన్నారు… కాసేపు అర్థం కాలేదు… కానీ నిజానికి జరిగింది ఏమిటంటే..?

Ads

పత్రిక

ఎల్బీనగర్‌లోని ఇస్లామియా బీఈడీ కాలేజీలో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించిన వార్త… స్పాట్ వార్త, మంచిదే, కవర్ చేయొచ్చు… అక్షర దోషాలు కూడా ఏమీ లేవు… సింపుల్‌గా బాగానే రాశాడు… కాకపోతే వార్త టైప్ చేసినప్పుడు పదాల నడుమ అక్కడక్కడా గ్యాప్స్ వచ్చాయి, అవలాగే వార్తలో ఉన్నాయి… అంటే..?

పేజీలో ఆ వార్త పెట్టిన సబ్ ఎడిటర్ లేదా పేజీనేషన్ ఆర్టిస్టు ఆ వార్తను యథాతథంగా పెట్టేశాడు, తప్ప ఒక్క ముక్క కూడా సరిచేయలేదు… వార్త పంపించిన రిపోర్టర్ వార్త పైభాగంలో చిన్న నోట్ పెట్టాడు… మనకు రంజాన్ పండుగ సందర్భంగా యాడ్ ఇస్తానని అన్నారు, అందువలన రెండు ఫోటోలు వాడగలరు అని పేజీలు పెట్టేవాళ్లకు ఓ రిక్వెస్ట్ అది…

సదరు సబ్ ఎడిటర్ కనీసం అది కూడా చదవకుండా, అదే హెడింగ్ అనుకుని, ఫస్ట్ వాక్యాన్ని హెడింగులో పెట్టేశాడు, ఫాంట్ పెంచేసి…! రెండో వాక్యాన్ని ఫస్ట్ డెక్ చేసేశాడు… రిపోర్టర్ పెట్టిన హెడింగ్ కూడా డెక్కుగా మారిపోయింది… అంటే, పేజీలో పెట్టిన సబ్ ఎడిటర్ జస్ట్, అలా వచ్చిన వార్తను ఇలా పేజీలో పెట్టేశాడు… అంతే…

ఇక్కడ యాడ్స్ తీసుకోవడం అనేది సమస్య కాదు… ఈనాడు తప్ప అన్ని పత్రికలూ యాడ్స్ కోసం రిపోర్టర్లను పీడించేవే… (సాక్షిలో వార్షిక యాడ్స్ టార్గెట్స్ విపరీతంగా పెంచారని ఆ రిపోర్టర్లు లబోదిబో అంటున్నారు) చిన్న చిన్న పత్రికల్లో కూడా యాడ్స్ టార్గెట్స్, సర్క్యులేషన్ టార్గెట్స్ సహజమే… (సాక్షి, ఆంధ్రజ్యోతి పత్రికలకు హైదరాబాదులో విపరీతంగా సర్క్యులేషన్ పడిపోయింది… వాటిని ఎలా పెంచుకోవాలనే అంశంపై రోజువారీ మథన సమావేశాలు సాగుతున్నాయి…)

సో, రిపోర్టర్లు యాడ్స్ అనేది కాదు ఇక్కడ ఇష్యూ… డెస్కుల్లో నాణ్యత, ప్రమాణాలు… సబ్ ఎడిటర్ అంటే ఫస్ట్ డ్యూటీ రిపోర్టర్ పంపిన కాపీని అక్షరదోషాలుంటే సరిదిద్ది, తప్పులుంటే మార్చి, పేజీలో ప్రాధాన్యాన్ని బట్టి పెట్టాలి… కానీ అసలు రిపోర్టర్ పెట్టిన నోట్ కూడా హెడింగ్ అనుకుని, సింపుల్‌గా దాన్నే హెడింగ్‌గా పెట్టేయడమే ఇక్కడ గమనించాల్సింది… (గతంలో వార్తలు తిరగరాసేవాళ్లు అవసరాన్ని బట్టి… ఆప్ట్ హెడింగ్ కోసం మథించేవాళ్లు…)

పెద్ద పెద్ద పత్రికలకే ట్రెయిన్డ్ సబ్ ఎడిటర్లు దొరకడం లేదు… గతంలో పత్రికలు తమ అవసరాల కోసం జర్నలిజం స్కూళ్లు నడిపేవి… ఇప్పుడవీ లేవు… యూనివర్శిటీల జర్నలిజం విభాగాల నుంచి వచ్చే గ్రాడ్రుయేట్లకు వర్తమాన జర్నలిజం తెలియదు… ఇక చిన్న పత్రికలకు ఎలా దొరుకుతారు… ఏదో కాస్త పేజీనేషన్ తెలిసినవాళ్లతో లాగించేస్తున్నారు… కాకపోతే మరీ రిపోర్టర్ నోట్‌కూ, వార్త హెడింగ్‌కూ తేడా తెలియకుండా… కాదు, కనీసం చూడకుండా, చదవకుండా పేజీలో ఏకంగా పెద్ద ఫాంట్‌తో హెడింగ్‌గా మార్చేయడంతో ఈ క్లిప్పింగ్ ఇంత చర్చనీయాంశమైంది..!!

పేరున్న పత్రికలు కూడా జిల్లాల వారీగా, డివిజన్ల వారీగా ఫ్రాంచైజీ ఇచ్చేసి, మీ లోకల్ వార్తలు మీరే పెట్టుకొండి అని చెప్పేస్తున్నాయి… ఎవరికి దొరికిన స్టాఫ్‌తో వాళ్లు లోకల్ వార్తలను అచ్చేస్తుంటారు… ఆ వార్తల గురించి చెప్పాలంటే అదో పెద్ద చాటభారతం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వైఎస్ నిజవారసత్వ పంథాలో రేవంత్… మచ్చుకు కొన్ని మెచ్చు తునకలు ఇవీ…
  • టీ20 వరల్డ్ కప్ హీరో కేరళ సంజూ శాంసన్ కథ తెలుసా మీకు..?
  • ముత్యం పూర్తిగా కడగబడలేదు… ఇంకా శుభం కార్డు పడలేదు…
  • ఓ చిన్న తెలుగు పత్రిక క్లిప్పింగ్ నిన్నంతా వైరల్… ఎందుకు..?
  • ఏది పనికిరాని ముచ్చట..? మన పెళ్లా..? నేనా..? త్రిషతో బంధమా..?
  • ‘‘బ్రదర్ కొంత కరెంటు సర్దుతావా..? వచ్చే నెలలో తిరిగి ఇచ్చేస్తా…’’
  • రెడ్ బుక్ సరే… పింక్ బుక్ సరే… అసలు ఈ బ్లూ బుక్ ఏమిటో తెలుసా..?
  • ట్రోలర్‌కు చెప్పుతో కొట్టినట్టు కౌంటర్… మీకు బూమ్రా-సంజనా కథ తెలుసా…
  • కేటీఆర్ ఇలా ట్వీటాడో లేదో… కవిత నుంచి కౌంటర్ పడింది…
  • త్రిష మళ్లీ హర్టయింది..! సీత మాజీ భర్తకు స్ట్రాంగ్ కౌంటర్ ..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions