.
Pardha Saradhi Potluri …. రష్యా చైనాలు ఇరాన్ ని నడిపిస్తున్నాయి! మేము మా కీలకమైన మిత్రుడు ఇరాన్ ని అమెరికా ముందు తలవంచనీయము… రష్యా విదేశాంగ మంత్రి లెవరోవ్!
Ads
రష్యా వార్ ప్లాన్ ని ఇరాన్ అమలు చేస్తున్నది!
చైనా పరోక్షంగా ఇరాన్ కి సహాయం చేస్తున్నది!
చైనా తన ఉపగ్రహాల ద్వారా మధ్యప్రాచ్యంలో ఏం జరుగుతున్నదో చాలా సీరియస్ గా పర్యవేక్షిస్తూ ఇరాన్ కి రియల్ టైమ్ డాటా అందిస్తున్నది!
గల్ఫ్ తీరంలో ఉన్న అత్యాధునిక న్యూక్లియర్ పవర్ విమాన వాహక యుద్ధనౌక గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ని దాడులకి ముందే గల్ఫ్ నుండి మధ్యదరా సముద్ర తీరంలో ఉన్న ఇజ్రాయేల్ కి చెందిన హైఫా పోర్టు కి దగ్గరలో మొహరించింది!
అయితే చైనా వెంటనే ఇరాన్ కి తెలియచేయడంతో ఇరాన్ హైఫా నగరం మీదకి బాలిస్టిక్ మిసైల్స్ తో తీవ్రంగా దాడి చేసింది! ఇజ్రాయేల్ తమ దేశ, అంతర్జాతీయ మీడియా మీద సెన్సార్ విధించడంతో హైఫా నగరం ఎంత నష్టపోయిందో తెలియరాలేదు.
గత కొద్ది రోజులుగా ఇరాన్ హైఫా పోర్టు మీద దాడులు చేస్తానని హెచ్చరిస్తూ వస్తున్నది. అందుకే హైఫాకి రక్షణగా గెరాల్డ్ ఫోర్డ్ స్ట్రైక్ గ్రూపుని తరలించింది కానీ వెల్లువలా వచ్చి పడుతున్న ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ ని పూర్తిగా అడ్డుకోలేక పోయాయి హైఫా వద్ద ఉన్న ఫ్రీగేట్స్!
హైఫా, టెల్ అవీవ్, జెరూసలేం నగరాలలో ప్రజలు అండర్ గ్రౌండ్ బంకర్స్ లోకి వెళ్ళిపోయి తలదాచుకున్నారు!
గల్ఫ్ లోని అమెరికా సైనిక బేస్ ల మీద ఇరాన్ పిన్ పాయింట్ యాక్యురసితో దాడులు చేయగలుగుతున్నది అంటే అది చైనా ఇస్తున్న రియల్ టైమ్ డాటా వల్లనే!
మరోవైపు చైనా తాను సేకరించిన సాటిలైట్ ఫోటో, వీడియోలని తన సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నది!
ఇరాన్ అమెరికా వశం అయితే తీవ్రంగా నష్టపోయేది చైనా మాత్రమే! పుతిన్ కొత్తగా నష్టపోయేది ఏమీ ఉండదు ఎందుకంటే గత నాలుగేళ్లుగా ఉక్రెయిన్ తో పాటు యూరోపు దేశాలతో యుద్ధం చేస్తూ నష్టపోతూనే ఉన్నాడు!
చైనా అంత తొందరగా ఇరాన్ తో కలిసి యుద్ధం చేయదు. ఇరాన్ కి సహాయం చేస్తే అది ఎంతకీ తేలక పోగా తైవాన్ తో తలపడాల్సిన శక్తిని కోల్పోవాల్సి వస్తుంది!
So! టెక్నీకల్ గా సహాయం చేస్తున్నది చైనా!
ఇరాన్ ప్రయోగిస్తున్న బాలిస్టిక్ మిసైల్స్, హైపర్ సోనిక్ బాలిస్టిక్ మీసైల్స్ లో చైనా ఏవియానిక్స్, చైనా ఉపగ్రహ వ్యవస్థ బైదు ( Baidu ) ని నేరుగా కలుపుతూ ఉంచడానికి ఉపయోగపడే ఎలక్ట్రానిక్స్ ని IRGC వాడుతున్నది!
రెండు నెలల క్రితం రష్యా నుండి హెవీ ట్రాన్స్పోర్ట్ విమానాలు టెహ్రాన్ లో దిగాయి. ఇలా మూడు రోజుల పాటు మొత్తం 6 విమానాలు వచ్చి వెళ్లాయి.
అదే సమయంలో చైనా నుండి భారీ రవాణా నౌక బందర్ అబ్బాస్ పోర్టుకి వచ్చింది! బైదు సాటిలైట్ తో అనుసంధానించే ఎలక్ట్రానిక్ ఏక్విప్మెంట్ ఒక కంటైనర్ లో ఇరాన్ కి చేరుకున్నాయి. ఒక కంటైనర్ లో 2 వేల మిసైల్స్ కి కావాల్సిన సాటిలైట్ సిగ్నల్ రిసీవర్స్ పడతాయి!
వెనిజులా ఉదంతం జరిగిన వెంటనే రష్యా, చైనాలు స్పందించి జాగ్రత్త పడ్డాయి!
ఇరాన్ లో ఇప్పటిదాకా ఇంటర్నెట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు!
2018 లో చైనా తన ‘గ్రేట్ ఫైర్ వాల్ ’ ని ఆఫర్ చేసింది ఇరాన్ కి. ఇరాన్ గ్రేట్ ఫైర్ వాల్ ని తిరస్కరించింది! ఇప్పుడు బాధ పడుతున్నది!
గ్రేట్ ఫైర్ వాల్ ( GFW -Great Fire Wall ) అంటే ఏమిటీ?
Well…! గ్రేట్ ఫైర్ వాల్ అంటే ఇంటర్నెట్ ని సురక్షితంగా ఉంచుతుంది బయటి నుండి వచ్చే దాడులని!
1998 లో చైనా మొదటి సరిగా తమ దేశంలో గ్రేట్ ఫైర్ వాల్ ( అధికారికంగా పిలిచే పేరు గోల్డెన్ షీల్డ్ ప్రాజెక్ట్ ) ని ప్రవేశపెట్టింది.
GFW ని చైనాలో ప్రవేశపెట్టింది విదేశీ వెబ్ సైట్స్ ని అడ్డుకోవడానికి! ప్రధానంగా విదేశీ వార్తా సంస్థల వెబ్సైట్స్ తో పాటు గూగుల్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలని అడ్డుకోవడం చేస్తుంది.
GFW IP అడ్రెస్ లని బ్లాక్ చేస్తుంది. ప్రధానంగా చైనా నుండి విదేశాలకి వెళ్లే సమాచారంలో ఏదన్నా కోడ్ భాషతో ఉంటే వాటిని బ్లాక్ చేస్తుంది. DNS ని ఫిల్టర్ చేస్తుంది! ఇక పాకెట్స్ ని నిరంతరం పరిశీలస్తూ చైనా నిషేధించిన పదాలు ఏవన్నా ఉంటే ఆ సమాచారం బయటి దేశం నుండి వస్తున్నా లేదా చైనా నుండి బయటికి వెళుతున్నా బ్లాక్ చేస్తుంది!
GFW ని నిరంతరం అప్డేట్ చేస్తూ ఉంటుంది చైనా. ఇరాన్ GFW ని తిరస్కరించి తప్పు చేసింది! అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది … ఒక వేళ ఇరాన్ GFW ని పెట్టుకొని ఉంటే ఈ రోజున మోస్సాద్ దానిని చేధించి ఉండేది కానీ చైనా తన సమాచారం మొత్తాన్ని దొంగతనంగా తెలుసుకుంటుంది అనే భయం ఉంది!
నిన్న రష్యా విదేశాంగ మంత్రి ఒక మాట అన్నాడు. రష్యాతో ఇరాన్ కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు గత కొన్ని రోజులుగా కాబట్టి ఇరాన్ అధికారులతో మేము కాంటాక్ట్ చేయలేకపోతున్నాము అని.
SO..! ప్రస్తుతం ఇరాన్ తో అమెరికా, ఇజ్రాయేల్ లు యుద్ధం చేయడం లేదు.
అమెరికా, ఇజ్రాయేల్ లు ఇరాన్, రష్యా, చైనాలతో యుద్ధం చేస్తున్నాయి.
రష్యా ఉక్రెయిన్ తో పాటు నాటోతో యుద్ధం చేస్తున్నది గత నాలుగేళ్లుగా! కానీ బయటి ప్రపంచానికి అది రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధంలా కనపడుతున్నది.
ఇప్పుడు అదే తరహాలో రష్యా చైనాలు అమెరికా, ఇజ్రాయేల్ ల మీద ప్రాక్సీ వార్ చేస్తున్నాయి!
ఇరాన్ ప్రయోగిస్తున్న మిసైల్స్, షహీద్ డ్రోన్లు అంత ఖచ్చితంగా ఎలా టార్గెట్స్ ని ధ్వంసం చేయగలగుతున్నాయి?
జెర్మనీ మైక్రో చిప్స్ & ట్రాన్సస్టర్స్!
ఫిబ్రవరి 28 న మొదటి వేవ్ దాడులలో ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్ల లో జెర్మనీ కి చెందిన మైక్రో చిప్స్, ట్రాన్సిస్టర్స్ ఉన్నాయని ఇజ్రాయేల్ నిపుణులు కనుగొన్నరు!
Made in Germany అనే గుర్తులని చైనా చెరిపేసి ఇరాన్ కి సప్లై చేసింది కానీ ఇజ్రాయేల్ పోస్ట్ మార్టంలో Made in Germany అని ఉన్న ప్రింటింగ్ ని కనుక్కున్నది.
చైనా తెలివి!
తన ఎలక్ట్రానిక్స్ ని నేరుగా ఇరాన్ కి ఇస్తే అది తనకి నష్టం కాబట్టి జెర్మనీ నుండి దిగుమతి చేసుకొని వాటి మీద ఉన్న Made in Germany గుర్తులని చెరిపేసి ఇరాన్ కి సప్లై చేసింది!
మైక్రో చిప్స్ & ట్రాన్సిస్టర్స్ ని జెర్మనీ ఎందుకు చైనాకి సప్లై చేసింది అంటే జెర్మనీ కి కావాల్సిన రేర్ ఎర్త్ మినరల్స్ ని చైనా ఇస్తుంది కాబట్టి!
గల్ఫ్ రీజియన్ లో చైనా తన నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ ద్వారా అమెరికన్, ఇజ్రాయేల్ కదలికలని రియల్ టైమ్ డాటాతో ఇరాన్ కి సమాచారం ఇస్తే రష్యా తన నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ అయిన GLONASS ( Global Navigation Satellite System ) తో గల్ఫ్ తో పాటు ఇజ్రాయేల్ లోని టార్గెట్స్ ని గుర్తించి ఇరాన్ మిసైల్స్ పిన్ పాయింట్ ఆక్యురసి తో కొడుతున్నాయి!
గ్లోబల్ మీసైల్ స్ట్రైక్ అక్క్యూరసీ!
ఇరాన్ వార్ మొదలవకముందు వరకూ అమెరికన్, ఇజ్రాయేల్ స్ట్రైక్ అక్క్యూరసి 80% గా ఉంటే ఇరాన్ అమెరికన్, ఇజ్రాయేల్ మీద చేస్తున్న మీసైల్ అటాక్స్ 90% అక్క్యూరసిగా ఉంటున్నట్లు తేలింది!
So! ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా చెప్పకపోయినా న్యూట్రల్ డిఫెన్స్ అనలిస్టులు ఎటువైపు మొగ్గకుండా అనలైజ్ చేసి చెప్తున్నారు!
ప్రపంచ యుద్ధం మొదలవుతుందా?
అవకాశం లేదు! రష్యా, చైనా, ఉత్తర కొరియా ఒకే వైపు ఉన్నంతకాలం అమెరికా, యూరోపు సాహసం చేయలేవు!
ఇంతకాలం ఉత్తర కొరియాని తక్కువగా చూసిన వాళ్ళు ఇప్పుడు రష్యా, చైనా లు కలిసి ఇరాన్ మిసైల్స్ ని డ్రైవ్ చేస్తున్న తీరుని చూస్తే ఉత్తర కొరియాని కూడా అజేయ శక్తిగా గుర్తించక తప్పదు. రష్యా, చైనాలు కలిసి ఇప్పుడు ఇరాన్ ని నడిపిస్తున్నట్లే ఉత్తర కొరియా ని ఇదే విధంగా నడిపిస్తాయి.
అమెరికన్ థింక్ ట్యాంక్ ఊసరవెల్లికి తాత! తమతో బలమైన దేశాలు ఉండాలి అని కోరుకుంటుంది తప్పితే బలహీనమైన యూరోపుని కాదు.
ప్రస్తుతం ఇరాన్ తో అమెరికా, ఇజ్రాయేల్ చేస్తున్న యుద్దాన్ని రష్యా, చైనా, ఇరాన్ లతో చేస్తున్నట్లుగా పరిగణించాలి!
ఇరాన్, చైనాలని పక్కన పెడితే మనం రష్యాదే పై చేయిగా ఉండాలని కోరుకోవాలి! ఎందుకంటే, ఎప్పుడూ ఏకధ్రువ ప్రపంచం ప్రమాదకరం!
Share this Article