.
కన్నె పిట్టరో, కన్ను కొట్టరో… ఈ పాట గుర్తుందా..? నాగార్జున నటించిన హిట్ సినిమా హలో బ్రదర్ లోని ఓ పాట… సూపర్ హిట్ పాట… కంపోజర్ రాజ్- కోటి… ఈవీవీ దర్శకత్వం అనుకుంటాను… ఇప్పుడు విషయం ఏమిటంటే..? ఆ పాటను రాబోయే అడవి శేష్ సినిమా డెకాయిల్‌లో వాడుకున్నారు… రీమిక్స్ కొట్టారు…
ఎస్, పాత సినిమాల్లోని పాటల్ని వాడుకోవడం, రీమిక్సులు కామనే కదా అంటారా..? ఆగండి… ఈ డెకాయిల్ సినిమాలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్… అన్నపూర్ణ బ్యానర్ కింద యార్లగడ్డ సుప్రియ నిర్మాత… సినిమా మీద హోప్స్ పెరుగుతున్నాయి… శేష్ కాస్త పద్దతిగానే ఉంటాడు కథ, ట్రీట్‌మెంట్ ఎట్సెట్రా…
Ads
అయితే కోటి ఈ పాట వాడుకోవడం మీద అసంతృప్తిని వ్యక్తం చేశాడు… కనీసం తనను అడగలేదు, అనుమతి తీసుకోలేదు, చెప్పాపెట్టకుండా తన పాటను వాడుకున్నారనేది ఆ అసంతృప్తి… నాకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు, బఫూన్‌లా కనిపిస్తున్నామా అని భగ్గుమన్నాడు… అసలు అసంతృప్తి అదీ…
‘ఆయన బాధలో అర్థముంది, ఆయన ఇంటికి వెళ్లాను, మాట్లాడాను, సెటిలైంది’ అని చెప్పుకొచ్చింది సుప్రియ ఎక్కడో… వివరాల్లోకి వెళ్తే… మళ్లీ అదే సమస్య, అదే ఇళయరాజా బాపతు సమస్య… ఒక పాట మీద కంపోజర్‌కు గానీ, గీతరచయితకు గానీ, నిర్మాతకు గానీ ఉన్న హక్కులేమిటి అనేవి… మనం ఎప్పుడూ చెప్పుకునేదే…
పాట కంపోజర్‌కు, గీత రచయితకు, గాయకులకు నిర్మాత డబ్బులిస్తాడు, పని చేయించుకుంటాడు… అంతే రిస్క్, హక్కు అంతా నిర్మాతదే కదా… కానీ సినిమా పాటల తీరు వేరు… అందరికీ రాయల్టీలుంటాయి… కానీ నిర్మాత ఏదైనా ఆడియో కంపెనీకి హక్కులు గంపగుత్తాగా అమ్మేస్తే..? ఇక కంపోజర్‌కు ఏ హక్కూ ఉండదట… (ఇళయరాజా వివాదం కూడా ఇదే కదా)… గీత రచయితకు మాత్రం తృణమో పణమో రాయల్టీ ఉంటుందట…

ఆమె కోటి ఇంటికి వెళ్లిందట, ఇదంతా చెప్పినట్టుంది… ఆ పాట రైట్స్ కొనుక్కున్న ఆదిత్య మ్యూజిక్ వాళ్ల పర్మిషన్ తీసుకున్నామని చెప్పింది… (వాళ్లకు ఏమైనా డబ్బులిచ్చారేమో…) అంటే, నీకు ఇచ్చేదేముంది అనడిగిందా కోటిని..? పోనీ, వివాదం ఎందుకులే అనుకుని ఏమైనా పే చేసిందా తెలియదు… చివరకు కోటి హేపీ… ఇష్యూ సెటిల్డ్… మళ్లీ అదే ప్రశ్న… సినిమా పాటపై రియల్ హక్కులు ఎవరివి..? రాయల్టీల వాటాలు ఎవరివి, ఎంతెంత..? కోటి ఏమైనా డబ్బు ఆశించడంలో తప్పుందా..? అవకాశముందా..?
నిర్మాత గనుక ఆడియో కంపెనీకి రైట్స్ అమ్మేస్తే ఇక కంపోజర్‌కు ఏమీ మాట్లాడటానికి ఉండదా..? అలాంటప్పుడు గీత రచయితకు రాయల్టీ ఎలా సమంజసం..? మరి గాయకుల వాటా ఏమిటి..? ఒకవైపు తన పాటను ఎవరైనా హమ్ చేసినా సరే, కోర్టుకు ఈడుస్తున్నాడు ఇళయరాజా..? ఈ స్థితిలో ఓ సరైన ‘హక్కుల విధానం’ ఎవరు ఖరారు చేయాలి..?
Share this Article