Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒకప్పుడు హెడింగ్స్ మీద కేర్… వర్తమానంలో పక్కా కేర్‌లెస్…

March 16, 2026 by M S R

.

ఏదో ఒక హెడింగ్ పెట్టామా, జనంలోకి తోసేశామా అన్నట్టుంది వర్తమానంలో పాత్రికేయం పరిస్థితి… ఫస్ట్ పేజీలో మాత్రమే కాదు, జోన్ పేజీ హెడింగుల మీద కూడా గతంలో మంచి మథనం, సృజన కనిపించేవి… ఇది చూడండి బ్యానర్ స్టోరీ హెడింగ్… పాంచ్ జన్యం మోగిందట… ఐదు రాష్ట్రాలు, అంటే పాంచ్… పాంచ్ అనగానే పాంచజన్యం గుర్తొచ్చి హెడింగ్ పెట్టిపారేశారు ఇలా…

పాంచజన్యం అంటే కృష్ణుడి శంఖం… అసలు ఏమైనా సంబంధం ఉందా ఈ పాంచ్ జన్యానికీ, పాంచజన్యానికీ..? కృష్ణుడు శంఖం పూరిస్తేనే యుద్ధం ప్రారంభమైనట్టు కాదు, అతిరథ మహారథులకు, దేవుళ్ల శంఖాలకూ వేర్వేరే పేర్లుంటాయి… ఉదాహరణకు అర్జునుడి శంఖం పేరు దేవదత్తం…

Ads

పాంచ్ జన్యం
.
సాక్షి హెడింగ్ ‘పాంచ్ పటాకా’…  ఈ హెడింగ్ పెట్టినవారికే తెలియాలి అది ఎలా ఆప్ట్ అవుతుందో..? పాంచ్ అనగానే పాంచ్ పటాకా, పంచ పటాకా అని గుర్తుకొచ్చి పెట్టేయడం సాక్షి తరహా టేస్ట్… ఎన్నికల నగారాకూ పటాకులకు, బాణాసంచాకు ఏం సంబంధమో మరి…

ఆంధ్రజ్యోతి మరీ దరిద్రం… పాంచ్ నగారా అని పెట్టింది… అంటే ఐదు నగారాలు అని అర్థం చేసుకోవాలేమో… ఖర్మ… చివరకు ఏ పాత్రికేయ ప్రమాణాల నాణ్యత కనిపించని నమస్తే తెలంగాణే నయం ఈరోజు… అయిదు అసెంబ్లీలకు మోగిన నగారా అని ప్లెయిన్, స్ట్రెయిట్ హెడింగ్ పెట్టింది…
.
మరో రెండుమూడు పత్రికలు…. 4 రాష్ట్రాలు, ఒక యూటీలో అసెంబ్లీ నగారా అట… యూటీ అయితేనేం, అక్కడ అసెంబ్లీ ఉంటుంది మహాశయా…
.

ప్రభ
ఈ నగారాలకు సంబంధం లేదు గానీ, ఆంధ్రప్రభలో ఓ హెడింగ్… కొండెక్కిన కోడి… అంటే ధర పెరిగింది అని ఆ కవి హృదయం… కానీ, కొండెక్కడం అంటే ఆరిపోవడం… అంటే, లైక్ దీపం కొండెక్కింది… అంతేతప్ప రేటు కొండ ఎక్కి కూర్చుంది అని కాదు బాబూ…

సాక్షి

ఇది సాక్షిలో మరో హెడింగ్… మంగళస్నానాల్ని హల్దీ పేరిట ఇటీవల పెళ్లిళ్లలో కొత్త ఈవెంట్లలాగా ఎలా అట్టహాసాలు చేస్తున్నారనేది వార్త… సరే, వార్త గురించి కాదు గానీ… పెట్టిన హెడింగ్ ఆనందాల ఊయల్లో… ఇందులో ఊయల్లో అనే పదంలో ఊయ అనే అక్షరాలకు వేరే రంగు పూశారు… అంటే వేరే అర్థం కూడా కలిపి చెప్పాలనుకున్నప్పుడు ఆ అక్షరాల్ని కోట్స్‌లోనో, ప్రస్తుతం వేరే రంగులోనో ప్రజెంట్ చేస్తున్నారు… కానీ ఇక్కడ ఊయ అనే రెండక్షరాల ఆ పదానికి అర్థం ఏమిటో, ఆ ఊయల్లో అదెందుకు, ఎలా ఆనందంగా ఒదిగిందో ఓ పట్టాన అర్థం కాలేదు… ఈ ఒక్కరోజు కొన్ని మచ్చుకు కనిపించినవి ఇవీ, ఇంకా బోలెడున్నాయి…

అఫ్‌కోర్స్, సమర్థనలు ఉండవచ్చు, పై అభిప్రాయాలతో విభేదించేవాళ్లూ ఉండొచ్చు… తప్పు లేదు, కానీ సగటు పాఠకుడి కోణంలో చూసినప్పుడు మాత్రం తోచింది ఇదే… (మొన్న ఏదో పత్రిక… యాడ్స్ ఇస్తామన్నారు, రెండు ఫోటోలు వాడండి అని రిపోర్టర్ పెట్టిన నోట్‌నే హెడింగుగా పెట్టేసిన పాత్రికేయాన్ని చూశాం కదా… ఇవి రాస్తున్నప్పుడు ఆ హెడింగ్ మరోసారి గుర్తొచ్చింది సుమీ…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బఫూన్‌లా కనిపిస్తున్నామా..? సినిమా కంపోజర్ కోటికి మండిపోయింది..!!
  • ఒకప్పుడు హెడింగ్స్ మీద కేర్… వర్తమానంలో పక్కా కేర్‌లెస్…
  • డ్రగ్స్ కేసు… రేవంత్ రెడ్డికి భలే కలిసొచ్చింది… ఎలాగంటే..?
  • మాస్ జాతర..! జబర్దస్త్ ఫార్మాట్‌కు జెమిని మరో కామెడీ వెర్షన్..?
  • వావ్… నటి రాధిక చెప్పిన ఓ సిగ్గు కథ… ఎంత మురిపెంగా ఉందో…
  • 90 ఏళ్ల దాకా మోదీ ఆ కుర్చీ వదలడా..? మరో రెండు టరమ్స్ తనేనా..?
  • ఓ ట్రెండ్ సెట్టర్ కవి వైరముత్తు… అందుకే వరించిన జ్ఞానపీఠ్…
  • పింక్, యెల్లో క్యాంపులు కిక్కుమంటే ఒట్టు… డ్రగ్స్ తేళ్లు కుట్టిన దొంగలు…
  • అక్కినేని – వాణిశ్రీ… వయసు మీద పడినా సరే ఎవర్‌గ్రీన్ జోడీ…
  • “ఆకలిపై యుద్ధం… 500 కోట్ల భోజనాలు… అక్షయపాత్ర అమోఘ ప్రయాణం”

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions