Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వాడెవడో ఏదో కూశాడట..! రాహుల్ గాంధీ డప్పు కొడుతున్నాడు..! ప్చ్, పిటీ..!!

March 18, 2026 by M S R

.

ఒక ఇజ్రాయిల్… అదేకాదు, ఏ దేశమైనా తీసుకొండి… పార్టీలు తన్నుకుంటాయి అనేక విషయాల్లో… దేశం, రక్షణ, జాతి అనే అంశాలకొచ్చేసరికి అందరూ ఏకమవుతారు… థాంక్స్ టు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ అల్లయిడ్ పార్టీస్… మన దరిద్రం ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు… రాహుల్ గాంధీ వంటి లీడర్ మరే దేశానికీ దొరకడు…

సరే, ఉదాహరణకు వద్దాం… ఓ వార్తా కథనంలోకి వెళ్దాం… సీరియస్ ఇష్యూయే… దేశభక్తి కలిగిన ఎవరైనా కాస్త  బుర్ర పెట్టి ఆలోచించాల్సిందే… యాంటీ నేషన్ మెంటాలిటీతో కుళ్లిపోయే కేరక్టర్లు తప్ప… హెడింగ్… ‘‘అమెరికా ‘అద్దె’ నివేదికలు.. కాంగ్రెస్ ‘అరకొర’ కూతలు! దేశ భద్రతతో చెలగాటమా?

Ads



  • అమెరికాకు చెందిన USCIRF అనే సంస్థ భారత్‌పై విషం చిమ్మడం కొత్తేమీ కాదు… కానీ, ఆ సంస్థ ఇచ్చే పక్షపాత నివేదికలను పట్టుకుని, మన దేశ రక్షణ వ్యవస్థలనే రద్దు చేయాలని ఇక్కడి ప్రతిపక్షాలు కోరడం అసలు సిసలు ‘నాన్సెన్స్’… పైగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ వెనుక కూడా ఓ పెద్ద కుట్ర దాగి ఉంది… ఈ మాట అనడానికి సాహసిస్తున్నా…

ప్రపంచవ్యాప్తంగా మత స్వేచ్ఛను ఉద్ధరిస్తున్నామంటూ బిల్డప్ ఇచ్చే USCIRF అమెరికా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేసింది..? అసలు అదేం సంస్థ..? ఎవరు దాని వెనుక..? ఎందుకు ఇండియా మీద ద్వేషం దానికి..? ఇవి అర్థం చేసుకోవాలి… ఎలాగూ అర్థం చేసుకునే వివేచన, వివేకం, విజ్ఞత రాహుల్ గాంధీకి లేవు గనుక… తన పప్పుత్వాన్ని ఎఐసీసీ టీమ్ స్వేచ్ఛగా వాడుకుంటోంది గనుక…

ఎవరిదీ కమిషన్? నేపథ్యాలేమిటి? ఈ కమిషన్‌లో కీలకంగా ఉన్న ఆసిఫ్ మహమూద్ (Asif Mahmood) పాకిస్థానీ మూలాలున్న అమెరికన్… సహజంగానే ఈయనకు భారత్ అంటే ఓ ద్వేషసహిత పక్షపాత వైఖరి ఉంటుంది… ఇక మొహమ్మద్ ఎల్సానౌసి లాంటి వారు అంతర్జాతీయ ఇస్లామిక్ సంస్థలతో సంబంధాలున్న వారు… IAMC (Indian American Muslim Council) వంటి లాబీయింగ్ గ్రూపులు డాలర్లు కుమ్మరించి చేయించిన ఈ ‘అద్దె నివేదికల’ అసలు ఉద్దేశం… అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను దెబ్బతీయడమే…



aicc



కాంగ్రెస్ కావాలనే దాస్తున్న నిగూఢ సత్యం! కాంగ్రెస్ పార్టీ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ చూస్తే వారి ద్వంద్వ నీతి స్పష్టమవుతోంది… “RSSని అమెరికా నిషేధించాలి” అంటూ ఆ నివేదికలోని ఒక భాగాన్ని మాత్రమే వారు హైలైట్ చేస్తున్నారు… కానీ, అదే పోస్ట్‌లో వారు జత చేసిన USCIRF నివేదిక ఒరిజినల్ కాపీని గమనిస్తే… అందులో భారత గూఢచారి సంస్థ ‘రా’ (Research and Analysis Wing – RAW) అధికారుల ఆస్తులను స్తంభింపజేయాలని, వారిపై ఆంక్షలు విధించాలని కూడా సిఫార్సు చేశారు…

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే…. ఆర్‌ఎస్‌ఎస్ మీద ఉన్న రాజకీయ ద్వేషంతో, మన దేశ భద్రతా వ్యవస్థ అయిన ‘రా’ను కూడా కించపరిచే విదేశీ నివేదికను కాంగ్రెస్ సమర్థించడం ఎంతవరకు సమంజసం? ఆ నివేదిెక, ఆ సంస్థను ప్రామాణికంగా తీసుకోవడం ఇండియన్లను కించపరచడం, ద్రోహం చేయడం కాదా..? ఈ రాహుల్ గాంధీ చుట్టూ ఉన్న కోటరీ అసలైన ప్రమాదకర కూటమి…

  • ఆర్‌ఎస్‌ఎస్‌ను తిట్టడం కోసం, భారత సార్వభౌమాధికారాన్ని సవాలు చేసే అమెరికా కమిషన్ రిపోర్టును భుజాన వేసుకోవడం దేశ ప్రయోజనాలకు విఘాతం కాదా..?


aicc



‘రా’ (RAW) మీద పడి ఏడవడం ఏమిటి? భారతదేశ భద్రతను కాపాడే అత్యున్నత గూఢచారి సంస్థ ‘రా’… అనేక మంది ప్రాణాలకు తెగించి తమకు అప్పగించిన బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు… వాళ్లు క్షుద్ర, శుష్క, అవినీతి, అక్రమాల రాజకీయ నాయకులు కాదు…  దేశ సరిహద్దుల వెలుపల పొంచి ఉన్న ముప్పులను పసిగట్టే ఈ సంస్థపై విదేశీ శక్తుల డైరెక్షన్‌లో నివేదికలు రావడం విడ్డూరం… అలాంటి నివేదికను పట్టుకుని రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ జాతీయ భద్రతా వ్యవస్థలను కూడా పరోక్షంగా తప్పుబట్టడం, అంటే దిక్కుమాలిన సంస్థల నివేదికలను మోయడం ఆ పార్టీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం…

rahul

ముగింపు: అమెరికాలో ఎవరో కూర్చుని రాసే నివేదికలు మన దేశ సార్వభౌమాధికారాన్ని శాసించలేవు… విదేశీ లాబీయింగ్ శక్తుల డైరెక్షన్ లో వచ్చే నివేదికలను ప్రామాణికంగా తీసుకుని మన సొంత వ్యవస్థలను తప్పుబట్టడం దేశద్రోహమే అవుతుంది… దేశ ప్రయోజనాల కంటే రాజకీయాలు ముఖ్యం కాదని ఇప్పటికైనా ప్రతిపక్షాలు, ప్రత్యేకించి రాహుల్ గాంధీ గుర్తించాలి…

విషాదం ఏమిటంటే… నేను (బ్రిటిష్ పౌరసత్వ వివాదం ఉండనే ఉంది) ఈ దేశానికి అక్కరకొస్తానా లేదా అనే తెలివిడి కూడా లేదు మనిషికి… ప్చ్, ఒక లోకేష్ పరిణతి చెంది రాటుదేలాడు… ఒక రాహుల్ గాంధీ మాత్రం… ఫాఫం…

ఈ పిచ్చి నివేదికలను పట్టుకుని అమెరికా జియోపాలిటిక్స్‌లో ఇండియాను విస్మరిస్తే దెబ్బతినేది అదే… ఇండియాలో, బయట పదే పదే ఇండియాను, సిస్టమ్స్‌ను విమర్శించి పలుచన చేసే రాహుల్ గాంధీ రియల్లీ ఈ దేశ ప్రతిష్టకు ఓ పెద్ద థ్రెట్… పైగా ఇప్పుడు సీఈసీ, స్పీకర్ వంటి రాజ్యాంగబద్ధ వ్యవస్థల్ని కూడా డిమోరల్ చేసే కుట్రలో యాక్టివ్‌గా ఉన్నాడు… ఇండియా దురదృష్టం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కోమటిరెడ్డి, జీవన్‌రెడ్డి… తెలంగాణ కాంగ్రెస్‌లో తాటాకు చప్పుళ్లు…
  • వాడెవడో ఏదో కూశాడట..! రాహుల్ గాంధీ డప్పు కొడుతున్నాడు..! ప్చ్, పిటీ..!!
  • హవ్వ మంగ్లీ..? నీ నోట ఈ బూతు పాటేంటి..? యూట్యూబ్‌లో మాయం..!!
  • భద్రాచలానికి ఇక కొత్త కళ… కేసీయార్ నిర్లక్ష్యానికి రేవంత్ దిద్దుబాటు…
  • ఈ సినిమాలో అందరికన్నా మెచ్చుకోవలసింది సత్యనారాయణనే
  • సాయం కోరుతూ కన్నీళ్లు, విన్నపాలు… ఇదోరకం మోసం, జాగ్రత్త…
  • ఆస్కార్ జ్యూరీని ఎందుకు ఈ సినిమా అంతగా ఇంప్రెస్ చేసింది..?!
  • పాత కేసీయార్ ఫ్యాన్… ధాటిగా ఆ పొలిటికల్ అనైతికతపై ప్రశ్నలు…
  • దిష్టి వ్యాఖ్యలు, వెక్కిరింపుల్ని తొక్కిపడేస్తూ… తెలంగాణ పరుగులు…
  • పేరుకే BRS- TDP వైరం… *యవ్వారాల్లో* జాన్‌జిగ్రీలే… ఏమంటావ్ బాపూ..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions