.
గ్యాస్ ఫీల్డ్ నుంచి గ్లోబల్ సంక్షోభం వరకు — ఇది కేవలం ఆరంభమా?
తెలంగాణలో ఓ పాత సామెత… నాశనం పదారు గంతలు…. అంటే సర్వనాశనం వైపు అడుగులు అని… అవును, ప్రపంచంలో అదే జరుగుతోంది… గల్ఫ్ యుద్ధం అనగా ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయిల్ యుద్ధం, ప్రతిగా ఇరాన్ దాడులు అక్షరాలా మరింత ఆర్థిక విధ్వంసం వైపే వెళ్తున్నాయి..,
Ads
మధ్యప్రాచ్యంలో మళ్లీ మంటలు రగులుతున్నాయి. Israel ఒక వైపు… Iran మరో వైపు… ఈసారి లక్ష్యం సాధారణ మిలిటరీ బేస్ కాదు — ప్రపంచ ఎనర్జీ గుండెకాయపై దాడి… South Pars/North Dome Gas Field
ఇది కేవలం ఒక గ్యాస్ ఫీల్డ్ కాదు… ఇది ప్రపంచానికి ఊపిరి ఇచ్చే ఎనర్జీ సిస్టమ్‌లో కీలక భాగం. దాన్ని ధ్వంసం చేశారు ఇప్పుడు… ఫలితం..? ఓ క్యాస్కేటిండ్ ఎఫెక్ట్… అంటే వరుసగా అనేక పేకముక్కలు కూలిపోతాయి…
ఒక్క ఎయిర్ స్ట్రైక్… కానీ దాని ప్రతిధ్వని ప్రపంచ మార్కెట్లలో వినిపిస్తోంది.
⚠️ STEP 1: “హార్ట్‌పై హిట్” South Parsపై దాడి అంటే… ఇరాన్ ఎకానమీకి నేరుగా షాక్… ఇది డబ్బు మాత్రమే కాదు… దేశం నిలబడే శక్తి మీద దెబ్బ… కానీ ఇరాన్ ఇప్పుడు ఒకే సందేశం ఇస్తోంది… “ఇది ఇక్కడితో ఆగదు.”
⚠️ STEP 2: ప్రతీకారం… ఎక్కడ? ముందున్న పెద్ద ప్రశ్న: ఇరాన్ ఎక్కడ కొడుతుంది? గల్ఫ్‌లోనే మరో సూపర్ పవర్ — Qatar పైనేనా..? అది ప్రపంచ LNG సరఫరాలో కీలక దేశం… ఒక్కసారి అక్కడ ఇన్‌ఫ్రా టార్గెట్ అయితే… యూరప్‌కు గ్యాస్ ప్రవాహం ఒక్కసారిగా కుదించబడుతుంది… ఇప్పటికే ప్రత్యామ్నాయాల కోసం అలమటిస్తున్న యూరప్‌కు ఇది పెద్ద షాక్…
⚠️ STEP 3: ధరలు… పెరగవు, పేలిపోతాయి… Crude Oil, ఎనర్జీ మార్కెట్లు ఒక సైకాలజీ మీద నడుస్తాయి —
భయం. సరఫరా తగ్గుతుందనే సంకేతం. యుద్ధం పెరుగుతుందనే భయం… చాలు… ధరలు ఎగిరిపోతాయి… $100 నుంచి $130… అక్కడి నుంచి $150 అనేది కూడా అసాధ్యం కాదు — కానీ అది యుద్ధం ఎంత పెరుగుతుందో దానిపైనే ఆధారపడి ఉంటుంది…
⚠️ STEP 4: ప్రపంచ మెడకాయ — హోర్ముజ్ … Strait of Hormuz… ప్రపంచ ఆయిల్ సరఫరాలో పెద్ద కీలక భాగం ఈ చిన్న మార్గం ద్వారానే వెళ్తుంది. ఇరాన్ ఒక నిర్ణయం తీసుకుంటే… “ఇది మొత్తానికే మూసేస్తాం” అంటే… రోజుకు మిలియన్ల బారెల్స్ సరఫరా స్టాప్, ప్రపంచ మార్కెట్లు షాక్, క్రాష్… ఇది కేవలం మధ్యప్రాచ్యం సమస్య కాదు… ప్రపంచానికి నేరుగా తాకే సమస్య…
⚠️ STEP 5: ఎవరికీ తప్పదు …. ఈ మార్గంపై ఆధారపడేవారు…
-
India
-
China
-
Japan
-
South Korea… అంటే ఇది ఒక రీజినల్ ఫైట్ కాదు, ఇది గ్లోబల్ ఎకానమీకి షాక్ వేవ్..
అసలు ప్రశ్న: ఇది తప్పించుకోవచ్చా? United States ఈ ఆటలో కీలకం. గతంలో ఆయిల్ కోసం యుద్ధాలు చూసిన ప్రపంచం… ఇప్పుడు ఎనర్జీ లైఫ్‌లైన్‌పై నేరుగా దాడిని చూస్తోంది. ఇజ్రాయెల్ ఈ స్టెప్ తీసుకోవడం
“స్ట్రాటజిక్ ప్రెజర్” కావచ్చు. కానీ అదే సమయంలో ఇది ఒక డోర్ ఓపెన్ చేసింది — ఎస్కలేషన్‌కు…
ఫైనల్ పంచ్ …. మీకు చూపిస్తున్నది… “precision strikes” “limited operations” కానీ కనిపించని విషయం:
(Chain Reaction)… ఒక్క దాడి… ఒక్క ప్రతీకారం… మరొక కౌంటర్ అటాక్… ఇలా కొనసాగితే — ఇది de-escalation కాదు… ఇది ఒక “కౌంట్‌డౌన్” కావచ్చు… మరింత తీవ్ర విధ్వంసం వైపు..!!
Share this Article