.
Pardha Saradhi Upadrasta …. ఒక విషాదం… ఎన్నో ప్రశ్నలు!
నోయిడాలోని సూపర్‌నోవా సొసైటీలో 43వ అంతస్తు నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సంభవ్ జైన్ ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది.
తెలుస్తున్న వివరాల ప్రకారం…, వివాహం, అనారోగ్యంతో ఉన్న చిన్నారి వైద్య ఖర్చులు, పెరుగుతున్న అప్పులు, అనంతరం జరిగిన విడాకులు… ఇవన్నీ కలిసి ఆయనపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని పెంచాయి.
Ads
విడాకుల సమయంలో కుదిరిన ₹3 కోట్ల సెటిల్‌మెంట్‌లో ఇప్పటికే ₹1 కోటి చెల్లించగా, మరో ₹1 కోటి చెల్లించాల్సిన ఒత్తిడి ఉందని, అదే సమయంలో వైద్య ఖర్చులు ఇతర అప్పులు కూడా ఉన్నాయట.
ఈ ఘటన ఒక వ్యక్తి విషాదంతో ముగిసిపోయిన కథగా కాకుండా, విడాకుల సమయంలో ఆర్థిక పరిహారం ఎలా నిర్ణయించాలి? అనే పెద్ద ప్రశ్నను కూడా మన ముందుకు తీసుకువస్తోంది.

భార్యాభర్తలు ఇద్దరూ సంపాదించే సామర్థ్యం ఉన్నప్పుడు పరిహారం నిర్ణయించేటప్పుడు వారి ఆదాయం, ఆస్తులు, భవిష్యత్ సంపాదనా సామర్థ్యం, పిల్లల బాధ్యతలు, వైద్య ఖర్చులు, అప్పులు వంటి అంశాలను మరింత సమగ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందా?
విడాకుల తర్వాత ఒక పక్షంపై భరించలేని ఆర్థిక భారం పడకుండా, ఇరు పక్షాలకు న్యాయం జరిగే విధంగా సెటిల్‌మెంట్ వ్యవస్థ ఉండాలా?
ముఖ్యంగా, ప్రతి కేసు పరిస్థితులు భిన్నంగా ఉంటే, ఒకే విధమైన పరిహారం విధానం కాకుండా వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులను ఆధారంగా చేసుకుని నిర్ణయం తీసుకోవాలా?
ఇక్కడ ఎవరు తప్పు? ఎవరు ఒప్పు? అనే తీర్పు ఇవ్వడం కాదు.
ఒక ప్రాణం కోల్పోయిన తర్వాత ప్రశ్నించుకోవాల్సిన విషయం — న్యాయం అనేది ఒకరికి మాత్రమే కాకుండా, ఇరు పక్షాలకు సమతుల్యంగా అందేలా మన న్యాయవ్యవస్థను, సామాజిక ఆలోచనలను ఎలా మెరుగుపరచాలి?
ఒక కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన సమస్యలు మరో కుటుంబాన్ని ఇలాంటి విషాదానికి గురిచేయకుండా, విడాకులు, భరణం, పిల్లల బాధ్యతలు, ఆర్థిక సెటిల్‌మెంట్లపై సమాజం మరింత సున్నితంగా , సమతుల్యంగా ఆలోచించాల్సిన సమయం ఇది.
Sad. But more importantly — it should make us think.
— ఉపద్రష్ట పార్ధసారధి
Share this Article