.
ఖమేనీ కాదు… అసలు గుండెనే కొట్టింది! సైన్య స్థాయి వ్యూహకర్త లారీజానీ హతం — యుద్ధంలో టర్నింగ్ పాయింట్
మధ్యప్రాచ్య యుద్ధాల్లో నాయకులు చనిపోవడం కొత్త కాదు… కానీ ఈసారి జరిగినది సాధారణం కాదు. ఇరాన్ సుప్రీం లీడర్ Ali Khamenei హత్య తరువాత, అసలు యుద్ధాన్ని నడిపించే “మెదడు”ను కొట్టడం — ఇదే అసలు షాక్.
Ads
టెహ్రాన్‌లో జరిగిన కచ్చితమైన దాడిలో Ali Larijani హతమవడం… ఈ యుద్ధానికి అసలైన టర్నింగ్ పాయింట్‌గా మారింది.
“సైన్యాధ్యక్షుడికంటే కీలకం” లారీజానీ యూనిఫామ్ వేసుకున్న జనరల్ కాకపోవచ్చు… కానీ ఆయన పాత్ర మరింత ప్రమాదకరం.
👉 సైన్యం ఎలా కదలాలి
👉 ఎవరితో యుద్ధం చేయాలి
👉 ఎక్కడ ప్రాక్సీ దాడులు జరగాలి
ఈ మొత్తం వ్యూహాన్ని రూపొందించే స్థాయిలో ఉన్న వ్యక్తి. అంటే… ఫీల్డ్‌లో యుద్ధం చేసే కమాండర్ కంటే
యుద్ధాన్ని డిజైన్ చేసే మాస్టర్ మైండ్…
ఇజ్రాయెల్ గేమ్ ప్లాన్ మారింది…ఇప్పటివరకు Israel ఆయుధ గోదాములు, ప్రాక్సీ గ్రూపులు వంటి లక్ష్యాలపై దాడులు చేసింది. కానీ ఇప్పుడు… నేరుగా కమాండ్ స్ట్రక్చర్‌పై దాడి చేసింది… ఇది స్పష్టంగా ఒక మెసేజ్… “మేము మీ సైన్యాన్ని కాదు… మీ నిర్ణయాలను తీసుకునే మెదళ్లను టార్గెట్ చేస్తున్నాం…”
🧠 ప్రాక్సీ యుద్ధానికి దెబ్బ ఇరాన్ ప్రభావం విస్తరించడంలో కీలకమైన Hezbollah, Hamas, Houthis వంటి గ్రూపులతో సమన్వయం చేయడం — ఇది ఒక రోజులో నేర్చుకునే పని కాదు. లారీజానీ మరణంతో ఈ నెట్‌వర్క్‌కు తాత్కాలిక గందరగోళం తప్పదు…
ఇరాన్‌కు అసలు ప్రమాదం ఇదే… నాయకుడు చనిపోతే… మరొకరిని పెట్టొచ్చు… ఎవరో వారసుడు వస్తాడు… కానీ అనుభవం, అంతర్జాతీయ కనెక్షన్లు, గోప్య వ్యూహాలు… ఇవి ఒక్కరోజులో రీప్లేస్ కావు… అందుకే…
ఇది కేవలం “హత్య” కాదు … ఇరాన్ కమాండ్ సిస్టమ్‌పై స్ట్రైక్…
ప్రపంచానికి సిగ్నల్ … ఈ దాడితో ఒక విషయం క్లియర్ అయింది… యుద్ధం ఇప్పుడు “లీడర్‌షిప్ టార్గెటింగ్” దశలోకి వచ్చింది… United States, Russia వంటి దేశాలు కూడా ఇప్పుడు మరింత జాగ్రత్తగా చూస్తున్నాయి…
- ముగింపు … “గన్ పట్టిన చేతిని కాదు… ట్రిగ్గర్ నొక్కమని చెప్పే మెదడునే కొట్టింది ఈ దాడి…” ఇరాన్‌ను ఇజ్రాయిల్ తక్కువ అంచనా వేసింది, ఇరాన్ ఎదురుదాడితో అమెరికా, ఇజ్రాయిల్ తల్లడిల్లిపోతున్నాయి, ఎదురుదెబ్బలు అని బోలెడు వార్తలు… అయితే యుద్ధం అన్నాక దెబ్బలు ఉంటాయి, ఎదురుదెబ్బలూ ఉంటాయి… కానీ మొసాద్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు… లారీజానీని లేపేయడం చిన్న గెలుపు కాదు..!
!
Share this Article