.
షోలే సినిమాకు వంద రెట్లు… ఇప్పటిదాకా వచ్చిన ఇండియన్ సినిమాలు ఒకత్తు, దురందర్‌తో మరో శకం… హాలీవుడ్ టాప్ డైరెక్టర్లు కూడా తమ పంథా మార్చుకోవాల్సిందే… ఇదేకదా దురందర్ సీక్వెల్‌ను ఆకాశానికి ఎత్తుతూ చెప్పిన మాటలు… పెయిడ్ ప్రివ్యూలు, ప్రీమియర్లు పడ్డాయి… బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది… సినిమా సెలబ్రిటీలందరూ సినిమాను బ్రహ్మాండమైన ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు… మరీ వర్మ చెప్పినంత కాకపోయినా మరీ మరీ విశేషంగా చెప్పుకునే పాయింట్లు కొన్ని ఉన్నాయి ఖచ్చితంగా…
ఎస్, స్మగ్లర్లను కూడా గ్లోరిఫై చేస్తూ, హీరోలను చేస్తూ… ఫేక్ ఎలివేషన్లు, చెత్తా ఐటమ్ సాంగ్స్ గట్రా ఫక్తు రొటీన్ ఇమేజ్ బిల్డప్పులు, ఫుల్ కమర్షియల్ పోకడలతో మేం తోపులం, మేం తురుంలం అనుకునే బాపతు హీరోయిజంతో పోలిస్తే దురందర్ సినిమా హీరో రణవీర్‌సింగ్ ఎక్కడికో వెళ్లిపోయాడు… జస్‌ప్రీత్‌సింగ్‌గా, హంజా ఆలీగా రెండు కోణాల్ని అద్భుతంగా పండించాడు… సినిమాకు దర్శకుడు అసలు తెర వెనుక హీరో, రణవీర్ సింగ్ సమాంతర హీరో తెరపై… ఇప్పటికైతే తన కెరీర్ బెస్ట్ ఇది…
Ads
అసలు గంటన్నర సినిమాలు కూడా థియేటర్లలో చివరిదాకా ప్రేక్షకుడిని కుదురుగా కూర్చోనివ్వని ఈ రోజుల్లో… 3 గంటల 49 నిమిషాలు, అంటే దాదాపు 4 గంటలపాటు ప్రేక్షకుడికి బోర్ రాకుండా, సోకాల్డ్ కమర్షియల్ పోకడలకు తీసుకెళ్లకుండా… చివరిదాకా అదే టెంపోను ఎంగేజ్ చేయడం మామూలు విషయం కాదు.,. ఆదిత్యథార్ ఈకోణంలో ఓ రికార్డ్ క్రియేట్ చేశాడనే చెప్పాలి…
హింస… ఎక్కువే, కానీ ఆ కథకు జస్టిఫయబులే… మోడీ నోట్ల రద్దు, యూపీ ఎన్‌కౌంటర్ల సమర్థన వంటివి బీజేపీ ప్రాపగాండా సినిమాగా కొందరికి అనిపించవచ్చుగాక… కానీ సినిమా స్టోరీ లైన్ ఇండియన్ స్పై, పొరుగు పాకిస్థాన్‌లో సాగించిన యాక్టివిటీ, జాతీయవాద నేపథ్యం కదా… సో, చల్తా… మరీ కృతకంగా ఏమీ ఇరికించినట్టు లేదు… దేశంలో ఉగ్రవాద చర్యలను అక్కకడక్కడా ప్రస్తావిస్తున్న ఫ్లోలో అన్నీ కొట్టుకుపోతాయి…
అసలు ఏ హైప్ లేకుండా వచ్చిన దురందర్ ఏకంగా 1000 కోట్లు కలెక్ట్ చేసి హల్‌చల్ క్రియేట్ చేయడంతో ఇక ఈ సీక్వెల్ మీద మామూలు బజ్ ఏర్పడలేదు… దేశవ్యాప్తంగా థియేటర్లను ఓ మేనియా కమ్మేసినట్టుంది… 200 కోట్ల మేరకు అడ్వాన్స్ బుకింగులే జరిగాయంటే ఏ రేంజ్ బజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు… చూడబోతే చాలా వసూళ్ల రికార్డులను బ్రేక్ చేయబోతున్నట్టుంది ఈ దురందర్ రివెంజ్ సీక్వెన్స్…
మామూలుగా ఒరిజినల్ హిట్టయితే, దాని సీక్వెల్ మీద ఆటోమేటిక్‌గా విపరీతంగా హైప్ క్రియేటవుతుంది, దాన్ని అందుకోవడం కష్టం… కానీ ఆదిత్యథార్ దాన్ని సాధించడమే కాదు, ఆ అంచనాల్ని దాటేశాడు… కథ జోలికి వెళ్లకుండా తమాయించుకుంటే, ఇంకొన్ని విశేషాలూ చెప్పుకోవాలి…
శాశ్వత సచ్‌దేవ్… ఈ సినిమాకు మరో బలం ఈయన అందించిన బీజీఎం… అదరగొట్టేశాడు… మరీ యాక్షన్ సీన్లలో ఎక్కువగా..! బాక్సులు బద్ధలయ్యే సౌండ్ కాదు, బీజీఎం అంటే సీన్‌కు ఆప్ట్‌గా ఎలా ఉండాలో మన తోపు కంపోజర్స్ కూడా నేర్చుకోవాలి… కెమెరా వర్క్ కూడా వోకే…
మాధవన్… తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… ఆదిత్యథార్ తన నుంచి నటనను పిండుకున్నాడు, తనకు తగినట్టు ఆ పాత్ర కేరక్టరైజేషన్ ఉంది… రణవీర్‌సింగ్‌కు దీటుగా మాధవన్ హైలైట్ అయ్యాడు… సారా అర్జున్‌కు దక్కిన స్క్రీన్ స్పేస్ తక్కువే, బట్, వోకే… సంజయ్ దత్ కూడా వోకే…
దురందర్ ఫస్ట్ పార్ట్‌లో మిగిలిపోయిన ప్రశ్నలన్నింటికీ దర్శకుడు ఇందులో జవాబులు కూడా చెప్పేశాడు… స్థూలంగా చూస్తే ఓ స్పై థ్రిల్లర్, యాక్షన్ ఓరియంటెడ్ పాట్రియాటిక్ మూవీ… దీన్ని డీల్ చేయడం పెద్ద టాస్క్… ఈ టాస్క్‌లో దర్శకుడు డిస్టింక్షన్‌లో పాస్..!!
- (టెక్నికల్ ఇష్యూస్‌తో కంటెంట్ అందించని కారణంగా తెలుగు ప్రీమియర్లు రద్దు చేశారు, హిందీ ప్రీమియర్లే పడ్డాయి)…
Share this Article