Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏది ఉషోదయం..? ఏది పరాభవం..? ఎవడి నవ్వు, ఎవడి ఏడుపు..?

March 19, 2026 by M S R

.
A. Saye Sekhar …. సంభవం… పరాభవం
రణరంగం కాని చోటు
భూస్థలమంతా వెదికిన దొరకదు …
అని శ్రీ శ్రీ అంటే…
ఆ వెంటనే ‘గతమంతా తడిసె రక్తమున …” అనడంతో
పోన్లే గతం గతః అనుకున్నా…

కాదు అది పెరిన్నియల్ ట్రూత్
నిత్య సత్యం…
అమెరికా- ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద…
ఇజ్రాయెల్ లెబనాన్ మీద…
ఇరాన్ ఇజ్రాయెల్ మీద…
ఇంకా శాంతి కాముకులైన
చిన్న దేశాల మీద…

చైనా తైవాన్ మీద…
రష్యా ఉక్రెయిన్ మీద…
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద…
ఇలా…
ఎక్కడ బడితే అక్కడ
పొట్టోణ్ణి పొడుగోడు
కొడుతునే ఉన్నడు
మరి పొడుగోణ్ణి పోచమ్మ కొట్టదా?
కొడితే … ఎప్పుడు?

Ads

ఈ సంవత్సరం కొడుతుందా..?
కొడితే అప్పుడు అది నిజమైన
పరాభవ నామ సంవత్సరం…
ఇది ప్రపంచం కథ

బెంగాల్, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరిలలో పువ్వు
ఓట్ల సీజన్లో ఓడినా… వాడినట్టు కాదు…
అసలు ఎప్పుడూ అక్కడ వికసించలేదు కాబట్టి…
తనను వికసించకుండా చేయడం సూర్య భగవానుడి తప్పుగా చెప్పేసి
తప్పించుకుంటుంది…

కామరూప్ లో కామాఖ్య కరుణించినా…
అదీ పెద్ద విజయమేం కాబోదు…
మొత్తానికి ఇదంతా ఏదైనా…
సంభవమే గానీ
పరాభవం కాదు…
ఇది దేశం గొడవ

ఇహ, మన దగ్గరంటారా?
దేవుళ్ళ నుంచీ చావిళ్ళ దాకా
అడ్డాల నుంచీ లడ్డూల దాకా…
ద్రవం నుంచీ ద్రవ్యం దాకా
చెరువు నుంచి గురువు దాకా
కోకోకొలా నుంచీ
కొకెయిన్ దాకా…
అమీబా నుంచి హైడ్రా దాకా
తెలుగోళ్ళు తన్నుకోని సబ్జెక్టు లేదు…

మనం చేస్తే సంసారం
అవతలోడు చేస్తే అపచారం…
అనే ధోరణి కి ధూపదీప నైవేద్యాలతో లోకమంతా హారతులు పట్టే
ప్రసారకులూ, ప్రచారకులూ…
పరిచారికలూ… పరిచారకులు
చుట్టాలు, గొట్టాలు
ఒకటా రెండా?

అందరూ రెండుగా చీలిపోయి
అక్షతలు, అక్షింతలూ
శనార్తులూ, శాపనార్థాలూ
కురిపించేస్తున్నారు…
న్యూట్రలిస్టులూ… అలా అనుకునే వాళ్ళూ…
వాళ్ళ సబ్స్క్రైబరులకు నలకూబరుల్లా కనిపిస్తే చాలని
సేవానిరతిలో సేద తీరుతున్నారు…

ఒకపక్క రణరక్త పిపాసుల పోరు, మన కొంపలో పొయ్యి దాకా, మన కడుపులో చల్ల దాకా వచ్చేస్తున్నా…
బింకంగా ఈ గొట్టాల్లో, ఆ ట్విట్టర్లో …
లోకల్ గొడవల్లోనే కిక్కు పొందేస్తూ… కాలం గడిపేస్తున్నారు…
ఈ “ఏ.ఐ” ( అమెరికా – ఇరాన్) వార్ కాకపోయినా
నిజమైన ఏ.ఐ అమాంతం ముంచుకొచ్చే ప్రమాదం
ముంగిటనే ఉంది…
అది తెచ్చే ఉత్పాతం పరాభవం కంటే పెను భూతం

సో…
ఈ పొద్దు మన సాములూ, సన్నాసులూ… పంచాంగ శ్రవణంలో చెప్పే
అందమైన అబద్ధాల కోసం ఎదురు చూద్దాం…
మీ అందరికీ మాత్రం
ఆదాయం హీరో
వ్యయం జీరో
రాజపూజ్యం ఫుల్లూ
అవమానం నిల్లూ…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏది ఉషోదయం..? ఏది పరాభవం..? ఎవడి నవ్వు, ఎవడి ఏడుపు..?
  • సారీ గబ్బర్ సింగ్..! ఈ సనాతన సీక్వెల్‌లో ఏదో మిస్సయింది..!!
  • తొండల భాషకు స్వస్తి… సెటైర్లతో ఎద్దేవా… రేవంత్ స్టయిల్ మారింది…
  • ప్రస్తుతం తమిళనాడు పొలిటికల్ ముఖచిత్రం ఎలా ఉందంటే..? ఫుల్ పిక్చర్..!!
  • ఆ బూతు రోత పాటపై అందరూ లెంపలేసుకుంటున్నారు..! కానీ..?
  • ఎవరు ఈ లారీజానీ..? ఇరాన్ ‘మాస్టర్ మైండ్’నే లేపిన ఇజ్రాయిల్..!!
  • వైఎస్ విజయమ్మ ‘ఫరమ్’ అటాక్… ఆస్తుల పంచాయితీలో జగన్‌కు షాక్…
  • ఈ ఒక్క దాడితో… ఇక ప్రపంచవ్యాప్తంగా ఇంధన విధ్వంసం..!!
  • దురందర్-2 … 4 గంటలపాటు కుర్చీకి కట్టేశాడు… బాక్సాఫీస్ బద్దలు…
  • ఉస్తాద్… తెలంగాణలో మాట చెల్లుబాటు కాలేదేం నాయకా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions