Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒకే వ్యక్తి తల్లి ప్లస్ తండ్రి..! ఈ ప్రచారం ఏమిటి..? అసలు నిజాలు ఏమిటి..?!

March 21, 2026 by M S R

.

మన దేశ దౌర్భాగ్యం ఏమిటంటే..? మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే అజ్ఞానం తాండవిస్తున్నదంటే… అంతకు వేల రెట్లు సోషల్ మీడియా, వెబ్ మీడియా, డిజిటల్ మీడియాలో వీరతాండవం చేస్తున్నది… ఓ విషయం వివరంగా చెప్పుకుందా…

అనయ బంగర్…: ఒకే వ్యక్తి అటు తండ్రి.. ఇటు తల్లి? సైన్స్ వెనుక దాగున్న ‘పచ్చి’ నిజం! ప్రస్తుతం సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒకటే హోరు… భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్, ఇప్పుడు అనయగా మారి సృష్టించబోయే ‘చరిత్ర’ గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు… “ఒకే వ్యక్తి అటు తండ్రిగా, ఇటు తల్లిగా మారుతున్నాడు\ది… ఇది సైన్స్ అద్భుతం… ఇది వైద్య విప్లవం” అంటూ ఊదరగొడుతున్నారు…

Ads

అసలు ఈ ప్రచారంలో నిజమెంత? సైన్స్ పేరుతో మనం ఒక భ్రమను నమ్ముతున్నామా? అశాస్త్రీయమైన వాదనలను అద్భుతాలుగా భ్రమిస్తున్నామా? ఒక్కసారి లోతుగా విశ్లేషిద్దాం…

ప్రచారం…: “అనయ – తండ్రి మరియు తల్లి కూడా!” సోషల్ మీడియా ప్రచారం ప్రకారం… అనయ ప్రస్తుతం మగ… కానీ హార్మోన్ థెరపీతో ఆడదానిగా మారుతున్నాడు… ప్రస్తుతం తన హార్మోన్ థెరపీకి ముందే వీర్యాన్ని భద్రపరిచాడు… కాబట్టి రేపు ఆడదానిగా మారాక తనకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఆమే, తల్లి కూడా ఆమే… ఇది వినడానికి విప్లవాత్మకంగా ఉన్నా, వైద్యశాస్త్రం దృష్టిలో ఇది ఒక ‘అర్థసత్యం’ మాత్రమే… కాదు, అసత్యం మాత్రమే…

విశ్లేషణ 1: జీవశాస్త్రం (Biology) ఎప్పుడూ అబద్ధం చెప్పదు

ఒక జీవి పుట్టడానికి కావాల్సింది రెండు భిన్నమైన కణాలు..: ఒకటి శుక్రకణం (Sperm), రెండోది అండం (Egg)…

  • అనయ భద్రపరిచింది తన శరీరంలోని ‘పురుష’ కణాలను (Sperm)… అంటే రేపు పుట్టబోయే బిడ్డలో సగం డిఎన్ఏ (DNA) అనయదే ఉంటుంది…

  • మరి మిగతా సగం? బిడ్డ పుట్టాలంటే అండం కావాలి కదా! అనయ స్త్రీగా మారినంత మాత్రాన ఆమె శరీరంలో అండాలు పుట్టవు… అంటే, ఆ బిడ్డకు జన్మనివ్వాలంటే కచ్చితంగా వేరొక స్త్రీ అండాన్ని దానం తీసుకోవాల్సిందే…

  • ఇక్కడ అసలు నిజం ఏంటంటే… ఆ బిడ్డకు బయలాజికల్ తల్లి (Biological Mother) అండం ఇచ్చిన ఆ ‘అపరిచిత మహిళే’ అవుతుంది… అనయ కేవలం బయలాజికల్ తండ్రి (Biological Father) మాత్రమే… మరిక తల్లీ, తండ్రీ తనే కావడం ఏమిటి..? అబ్సర్డ్…

విశ్లేషణ 2: గర్భాశయం లేని ‘మాతృత్వం’ మరో ప్రచారం ఏమిటంటే.. అనయ తల్లిగా మారుతున్నాడని…

  • లింగ మార్పిడి శస్త్రచికిత్స ద్వారా బాహ్యంగా స్త్రీ రూపం రావచ్చు, గొంతు మారవచ్చు, కానీ గర్భాశయం (Uterus) రాదు… అంటే ఆమె బిడ్డను మోయలేదు…

  • ఇక్కడ మరొక ‘అద్దె తల్లి’ (Surrogate Mother) అవసరం ఉంటుంది…

  • అంటే, అనయ తండ్రిగా వీర్యం ఇస్తాడు… మరొక మహిళ తల్లిగా అండం ఇస్తుంది… ఇంకొక మహిళ తొమ్మిది నెలలు గర్భంలో మోస్తుంది… అంటే లీగల్‌గా తల్లీతండ్రీ తనే… కానీ బయలాజికల్ తండ్రి తను, తల్లి వేరే ఎవరో… నవమాసాలు మోసి కనేది ఇంకెవరో…

ఇంకాస్త శాస్త్రీయంగా వెళ్దాం… అసలు నిజాల్లోకి… 

  • 1. అండం ఉత్పత్తి (Egg Production)

    హార్మోన్ థెరపీ ద్వారా శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరిగినప్పటికీ, అండం ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండదు… అండాలు ఉత్పత్తి కావడానికి ‘అండాశయాలు’ (Ovaries) ఉండాలి… పురుషుడు స్త్రీగా మారే క్రమంలో అండాశయాలను సృష్టించడం ప్రస్తుత వైద్య సాంకేతికతతో సాధ్యం కాదు… కాబట్టి, వారు సహజంగా అండాలను విడుదల చేయలేరు…

    2. గర్భాశయం (Uterus)

    సాధారణ HRT లేదా ప్రస్తుతమున్న సర్జరీల ద్వారా గర్భాశయం ఏర్పడదు… * దీనివల్ల వారు సహజంగా గర్భం దాల్చడం లేదా రుతుక్రమం (Periods) రావడం వంటివి జరగవు…

    • ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ‘యూట్రస్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ (గర్భాశయ మార్పిడి) మీద పరిశోధనలు జరుగుతున్నాయి, కానీ ఇది ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉంది, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులలో ఇది సాధారణ చికిత్సగా అందుబాటులోకి రాలేదు…

    3. వజైనా (Vagina / Vaginoplasty)

    లింగ మార్పిడి శస్త్రచికిత్స (Gender Affirmation Surgery) ద్వారా వజైనాను నిర్మించవచ్చు… దీనిని ‘వజైనోప్లాస్టీ’ (Vaginoplasty) అంటారు… ఇది చూడటానికి మరియు అనుభూతికి సహజమైన స్త్రీ జననేంద్రియాల వలె ఉంటుంది.

  • దీని ద్వారా లైంగిక సాన్నిహిత్యం సాధ్యమవుతుంది…

  • అయితే, ఇది సహజమైన వజైనా లాగా స్వయంగా లూబ్రికేషన్ ఉత్పత్తి చేయకపోవచ్చు, కాబట్టి లైంగిక చర్య సమయంలో కృత్రిమ లూబ్రికెంట్స్ వాడాల్సి ఉంటుంది… అంతా ఆర్టిఫిషియల్…


సారాంశం…: హార్మోన్ థెరపీ , సర్జరీల ద్వారా ఒక వ్యక్తి బాహ్య రూపంలో, గొంతులో, జననేంద్రియాల అమరికలో మార్పులు పొందవచ్చు. కానీ అండాల ఉత్పత్తి, గర్భాశయం వంటి అంతర్గత పునరుత్పత్తి వ్యవస్థలు ప్రస్తుతానికి సాధ్యం కావు….

విశ్లేషణ 3: సామాజిక గుర్తింపు vs జైవిక వాస్తవం మరి అనయను “తల్లి ప్లస్  తండ్రి” అని ఎందుకు పిలుస్తున్నారు? ఇది కేవలం సామాజిక గుర్తింపు (Social Identity) మాత్రమే…

  1. తండ్రిగా…: Biological connectivity ద్వారా ఆమె తండ్రి…

  2. తల్లిగా…: ఆమె ఎంచుకున్న కొత్త లింగ అస్తిత్వం (Gender Identity) ద్వారా ఆమె తల్లి…

అంటే చట్టపరంగా ఆ బిడ్డ సర్టిఫికెట్ మీద ‘తల్లి’ స్థానంలో అనయ పేరు ఉండొచ్చు… కానీ అది ‘సైన్స్ అద్భుతం’ కాదు, అది ‘చట్టపరమైన వెసులుబాటు’ మాత్రమే…

పచ్చి నిజం ఏమిటంటే… సైన్స్ మూఢనమ్మకాలను పటాపంచలు చేస్తుంది నిజమే, కానీ అది సృష్టి ధర్మాలను మార్చలేదు… ఒక వ్యక్తి తన ఇష్టప్రకారం జీవించే హక్కును గౌరవించాలి, కానీ ఆ ప్రక్రియలో సైన్స్‌కు తప్పుడు రంగు పూయకూడదు…

అనయ బంగర్ విషయంలో జరుగుతున్నది కేవలం ఒక ‘రీ-లేబ్లింగ్’ (పేరు మార్పిడి) మాత్రమే… ఆమె తన బిడ్డకు బయలాజికల్ తండ్రిగా ఉంటూనే, ఒక తల్లిగా ప్రేమను పంచాలని నిర్ణయించుకున్నారు\ది… దీన్ని ‘వైద్య చరిత్రలో అరుదైన ఘట్టం’ అనడం కంటే, ఒక వ్యక్తి తన వారసత్వాన్ని కాపాడుకోవడానికి ప్లాన్ చేసుకున్న ‘ముందు జాగ్రత్త’ అనడమే సమంజసం…

ముగింపు…: వార్తలు వస్తుంటాయి… పోతుంటాయి… కానీ విశ్లేషణ చేసినప్పుడే అందులోని ‘వ్యాపారం’ ఏంటో, ‘వాస్తవం’ ఏంటో అర్థమవుతుంది… అనయ తల్లిగా బిడ్డను పెంచవచ్చు గాక…. కానీ ఆ బిడ్డను సృష్టించే క్రమంలో మాత్రం ఆమె ఎప్పటికీ బయ‘లాజికల్’ తండ్రి మాత్రమే… తల్లి కాబోదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నో, నో… నేను దురంధర్ సినిమా చూడను… ప్లీజ్, నన్నొదిలేయండి…
  • అవును, నేను నేషనలిస్టునే… సో వాట్..? అదేమైనా భ్రష్టాచారమా..?
  • ‘కేసీయార్ అమృత హస్తాలు – హరీష్‌ దివ్యాశీస్సులతో’ అని చెక్కించాలా..?!
  • కొందరు బ్రాండ్లను నమ్ముకోరు – వాళ్లే స్వయంగా బ్రాండ్లు అవుతారు…
  • పొలిటిషయన్ తెలివి ముందు జర్నలిస్టుల తెలివి… జస్ట్ ఓ జుజుబీ…
  • సినిమా- రాజకీయం… పడుగూపేక..!! అరవ పాలిటిక్స్ అదోరకం… ఎలాగంటే..?
  • గ్యాస్, పెట్రో, డీజిల్ మాత్రమే కాదు… ఎరువులకూ కొరత ప్రమాదం…
  • దురంధర్ లో బాగా పేలిన పాత్ర… బడే సాహెబ్… ఎవరీ నటుడంటే..?
  • భయం నుంచి విముక్తి – ఆ పచ్చిపుండు వేదన – దురందర్ మరో కోణం…
  • ఒకే వ్యక్తి తల్లి ప్లస్ తండ్రి..! ఈ ప్రచారం ఏమిటి..? అసలు నిజాలు ఏమిటి..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions