Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొత్త సీసాలో పాత సారా..? కాదు.., కొత్త సీసా, కొత్త సారా, కొత్త రంగు కూడా..!!

March 21, 2026 by M S R

.

ఓ మిత్రుడు అడిగాడు… రేవంత్ రెడ్డి- భట్టి విక్రమార్క బడ్జెట్‌లో అసలు నచ్చిన అంశాలే లేవా అని..! ఉన్నాయి.,. అయితే అందరూ చెప్పుకునే శాఖల వారీ కేటాయింపుల అంకెలు వేరు, ఆ ప్రామాణికాలు వేరు, మనం చెప్పుకునేవి వేరు… రేవంత్ రెడ్డి బడ్జెట్ ఎందుకు సరైన దిశలో ఉందో ఓసారి నిజంగానే చెప్పుకుందాం… అంకెల్లో కాదు, తెలంగాణ సమాజం పట్ల కనబరుస్తున్న ఓ నిబద్ధతలో…

సరే.., ఓ పిచ్చి, రొటీన్, ఫార్ములా డైలాగ్ ఉంటుంది కదా, ఎప్పుడూ ప్రతిపక్షం ఆరోపిస్తుంటుంది, స్పందిస్తుంటుంది… ‘‘అబ్బే, ఇది కొత్త సీసాలో పాత సారా’’ అని… 3 లక్షల కోట్లు కాదు, 30 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా ఆ కేటీయార్, ఆ హరీష్ రావు అదే మాట్లాడతారు… వదిలేద్దాం…

Ads

కేసీయార్ విచక్షణరహితంగా తెలంగాణ జనం నెత్తి మీద పెట్టిపోయిన అపరిమిత లక్షల కోట్ల అప్పుల భారంలో… ఉన్నంతలో రేవంత్ రెడ్డి నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కొన్ని విశేషాంశాలు ఖచ్చితంగా ఉన్నాయి…? (ఇక్కడ జీఎస్డీపీ, ఇన్‌ఫ్లేషన్, తలసరి ఆదాయం, జాతీయ సగటు, తెలంగాణ వృద్ధిరేటు వంటి సాంకేతిక గణాంకాల్ని కాసేపు వదిలేద్దాం)…

  • (కేసీయార్ మార్క్ అడ్డగోలు వడ్డీలు, స్వల్పకాలిక చెల్లింపుల అరాచక రుణాల్ని ఈ ప్రభుత్వం దాదాపు 25 వేల కోెట్ల అప్పుల్ని తక్కువ వడ్డీకి, ఎక్కుక చెల్లింపు వ్యవధికి (రీషెడ్యూల్) మార్చడం తెలంగాణకు ఓ పేద్ద రిలీఫ్)… (అప్పుడు రామక‌ృష్ణారావు ఆర్థిక కార్యదర్శి, ఇప్పుడాయన ప్రధాన కార్యదర్శి... అంటే, ప్రభుత్వం పనిచేయించుకునే తీరును బట్టి ఫలితాలుంటాయి అని..)

బయట బోలెడు చెబుతారు పాలకులు… కానీ బడ్జెట్‌లో వాటిని ప్రస్తావించడం, నిధులు కేటాయించడం అంటేనే… వాటికి తమ కమిట్‌మెంట్ ప్రకటించడం, ఒకరకంగా పరిపాలన మంజూరును ఇవ్వడం… ఆ కోణంలో చూద్దాం ఓసారి… ప్రధానంగా చెప్పుకోవాల్సింది… ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం… ఇన్నొవేటివ్… ప్లస్ కొత్తది కూడా…

  • కోటీ 15 లక్షల కుటుంబాలకు అయిదేసి లక్షల రూపాయల బీమా పథకం… టు బి ఫ్రాంక్, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ అని ప్రకటించి ఉంటే… మరింత సూపర్బ్ స్కీమ్ అయి ఉండేది… ధనిక, పేద, కుల, మత, గ్రామ, పట్టణ బేధాలు లేకుండా… సరే, మరి ఇంకెేమిటి..?

నాకు బాగా నచ్చింది 12,600 కోట్ల ఇందిర సౌర గిరి జల వికాసం… ఎస్, మారుమూల ప్రాంతాలకు నిరంతర విద్యుత్తు ఎప్పుడూ పెద్ద టాస్క్… వాళ్లకు వెలుగులు కావాలి, వాళ్ల వ్యవసాయానికి, కుటీర పరిశ్రమలకు కరెంటు కావాలి… అందుకే 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్ల పథకం… ఇది మెయిన్ స్ట్రీమ్ పవర్ నెట్‌వర్క్ మీద  బాగా భారం తగ్గిస్తుంది…

  • అసలు ఇదే కాదు, బాగా నచ్చిన మరో అంశం, కొత్త దిశకు తెలంగాణను తీసుకుపోయే మరో ప్రోగ్రామ్… మహేశ్వరం, చౌటుప్పల్‌లలో 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ… ఇది ప్రారంభం… ఇదేమిటంటే..? సోలార్, విండ్, హైడల్ పవర్ తదితర చౌక, పర్యావరణ హిత పవర్‌ను ఉత్పత్తి చేసి, ఈ స్టోరీజీలోకి పంపించి, అవసరమున్నప్పుడు వాడుకోవడం… వెరీ గుడ్ ఇనీషియేటివ్…

TGGENCO ద్వారా 11,460 మెగావాట్ల Pumped Storage, ఇతర ప్రాజెక్టులకు ₹95,150 కోట్ల పెట్టుబడులు ఆకర్షించారు… అదే సమయంలో REDCO ద్వారా ₹1,23,350 కోట్ల పెట్టుబడులతో 12 ఒప్పందాలు… రెన్యువబుల్ పవర్, పంప్డ్ స్టోరేజీ, ఎనర్జీ స్టోరేజీ, సోలార్ వ్యవసాయ విద్యుత్తు అనేవి ఇతర రాష్ట్రాలకూ ఆదర్శం… ఇవి ఎనర్జీ సెక్టార్‌లో అభ్యుదయ అడుగులు… చాలామంది రాజకీయ నాయకులకే ఈ అంశాలు అర్థం కావు…

మరింత నచ్చింది జూనియర్ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం… అవును, రాబోయే కొత్త విద్యావిధానంలో టెన్ ప్లస్ టూ… ఇంటర్ కూడా స్కూలింగే… అక్కడా డ్రాపవుట్స్ తగ్గాలి, వాళ్లకూ పౌష్టికాహారం కావాలి… మంచి నిర్ణయం…

  • మరో విశేషాంశం… ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు క్యాష్ లెస్ హెల్త్ స్కీమ్… ఎన్నో ఏళ్ల కోరిక ఇది… (జర్నలిస్టులను విస్మరించారు) ఈమధ్య ప్రకటించిందే, కానీ బడ్జెట్‌లో పెట్టడం ద్వారా ఒక విధాన నిర్ణయంగా తమ కమిట్మెంటును ప్రభుత్వం ప్రకటించుకున్నట్టయింది…

సేమ్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను గతంలోనే సీఎం చెప్పినా… ఈసారి ఇతోధిక కేటాయింపుల్ని బడ్జెట్లో చూపించడం మరొక అంశం… ప్రి-ప్రైమరీ నుంచి టెన్ ప్లస్ టూ దాకా బోధించే పబ్లిక్ స్కూళ్లు మరో మంచి నిర్ణయం … నర్సరీ నుంచి టెన్ ప్లస్ టూ దాకా బ్రేక్ ఫాస్ట్ మరో విశేష నిర్ణయం… ఇవి మచ్చుకు కొన్ని… మూసీ, ఫ్యూచర్ సిటీ, ఇరిగేషన్… కొన్ని ప్రాజెక్టుల్లో పూడికతీత… ఏదీ వదల్లేదు… చివరగా…

  • బడ్జెట్ అంటే రఫ్‌గా రాబోయే సంవత్సరానికి ఆదాయ, వ్యయాల అంచనాలు మాత్రమే… కాకపోతే ప్రభుత్వ ప్రాధాన్యాల్ని ఆ కేటాయింపులు సూచిస్తాయి… అంతే ఖర్చు పెట్టాలని లేదు, అంతకన్నా పెట్టే వీలుంటే వదిలిపెట్టేదీ లేదు… సో, ప్రాధాన్యాలపరంగా రేవంత్ రెడ్డి బడ్జెట్ సరైన దిశలోనే ఉంది… అన్నీ చేస్తారా అనేది కొందరి ప్రశ్న... సంకల్పం అయితే బాగుంది కదానేది జవాబు...

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మణిరత్నం పిలుపు ఓ అవకాశం మాత్రమే కాదు… ఓ గౌరవం, ఓ గుర్తింపు..!!
  • చిరంజీవి వ్యాఖ్యలపై ఇంత వ్యతిరేకతకు కారణాలేమిటి..?!
  • కొత్త సీసాలో పాత సారా..? కాదు.., కొత్త సీసా, కొత్త సారా, కొత్త రంగు కూడా..!!
  • ఇటు గరికపాటి రచ్చ… అటు భట్టి కొత్త ఆహార ప్రకటన… భలే కంట్రాస్టు…
  • హేపీనెస్ ఇండెక్స్..! ‘హేపీగా’ పగలబడి నవ్వుకునే ఓ వరల్డ్ రేంజ్ జోక్..!
  • ఇరాన్ దెబ్బ… ఇంత బతుకూ బతికి… F35 జెట్ చావు దప్పి కన్నులొట్ట…
  • మై డియర్ గరికపాటి… నీ ప్రాపంచిక జ్ఞానం ఏపాటి..? వుయ్ పిటీ…!!
  • నిన్న రాష్ట్రపతి చేతుల మీదుగా… నిశ్శబ్దంగా అయోధ్యలో ఓ ప్రధాన ఘట్టం…
  • పది దేశాలకు అంటుకున్న చమురు మంటలు… What Next ..?
  • ‘ఎల్లమ్మ’గా భాగ్యశ్రీ..? ఊదు కాలదు- పీరు లేవదు..! పాపం వేణు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions